వృద్దులు – హోమియోపతి
సేకరణ: పి. సుబ్బరాయుడు
(డా. శామ్యూల్ హానిమాన్, హోమియో వైద్య ప్రధాత)
కెంట్ హోమియో అసోసియేషన్, కడప (రిజిస్టర్డ్)
విషయసూచిక
1.ఆందోళన – ఆతృత 13.కడుపుబ్బరం
2. ఉబ్బసం 14. తల త్రిప్పుట
3.రక్తపోటు-B.P 15. చెవుడు
4. ద గ్గు- పడిశం 16.మతి మరుపు
5. మలబద్దకం 17. ముక్కు నుండి రక్తం
6. జివ్వు జివ్వుమను నొప్పులు 18.కీళ్ళనొప్పులు
7. నిరాశా నిస్పృహ 19. నిద్రలేమి
8. నీళ్ళ విరేచనాలు 20. మూత్రకోశ వ్యాదులు.
9. చీము బేదులు 21. కంటి చూపు
10. అజీర్ణం - ఆకలి తగ్గుట 22. చర్మ వ్యాధులు
11. వాపులు 23. ఇతర వ్యాదులు
12. చిక్కిపోవుట
జీవిత ఫలాస్వాదనం
"ఎదగడాని కెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర" అన్నాడొక సినీ కవి. నిజమే ఎదిగే దినాల్లో అనేక పోరాటాల నెదుర్కొన్నాం. 20 సంవత్సరముల వరకు చదువుతో పోరాడాం. 40 వరకు ఏ ఉద్యోగం మంచిదో, ఉన్న దాంట్లో ప్రమోషన్ పొందటం యెలాగో, ఏ వ్యాపారం అనువైనదో అనే ఆందోళనలతో కొట్టు మిట్టాడాం. సరే, 60 దరికి చేరే సరికి ఇక గట్టెక్కామనిపిస్తుంది. కష్టం పలించిందని పిస్తుంది. ఎవరి కోసం ఆరాటపడ్డామో వారు స్థిర పడ్డారు. ఇంకేం పరవాలేదనిపిస్తుంది. మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవడం ఊహించని సంతోషం కలుగ జేస్తుంది. రిటైర్డు జీవితం బాగుంది
అనిపిస్తుంది. ఉరుకులు పరుగులు లేవు. స్వేచ్చను అనుభవిస్తాం. శుభ కార్యాలలో మన పెద్దరికానికి మంచి విలువ కూడా లభిస్తుంది. ఇదంతా కొంతకాలమే. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు మారుతున్నట్లు గమనిస్తాం. ముందు చలాయించిన అధికార దర్పం ఇంట్లో చెల్లుబాటు కాక పోవడం చూస్తాం. జీవితంలో మన పాత్ర మరో మలుపు తిరిగి నట్లు అనిపిస్తుం. మనపిల్లలు మన మాటలు వింటున్నారు గానీ అవి కేవలం మర్యాద కోసమే. ఆచరణలో వారు మన మాటను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరూపణ అవుతుంది. నీ కొడుకుగా గుర్తింపు పొందిన వాడు, ఇప్పుడు నీ ఉనికికే ఆధార భూతుడై పోతాడు. జనం మనల్ని పలానా అతని తండ్రి
అని ఇప్పుడంటారు. మన మానసిక శారీరక బాధలు చెప్పుకోవటానికి మనిషి దొరకటం లేదిప్పుడు. ముందు ఎంతో శ్రద్ధగా విన్న వాళ్ళు ఇప్పుడు విసుగు పడుతున్నారు. ఇంటికి వచ్చినవాళ్ళు ముఖస్తుతికి పలుక రిస్తున్నారు. ఇదంతా జీవితపు చరమాంకంలో సర్వ సాధారణంగా జరిగేవే, లేదంటే, ఇందులో కాస్త అటూ ఇటూ హెచ్చు తగ్గులుండ వచ్చు.
కొందరి విషయంలో ఈ నిరాదరణ తీవ్ర స్థాయిలో ఉండవచ్చు. అది వారి అదృష్టం మీద - కుటుంబ సభ్యుల సంస్కారం మీద ఆధార పడి ఉంటుంది.
ఈ దశలో వృద్ధ దంపతులు కలసి వుండటం ఒక అదృష్టం - వయసులో ఉండేది ఆకర్షణ. ఇప్పుడు ఉండేది నిజమైన ప్రేమ ఆప్యాయత. బిడ్డలు పంచుకునే నెపంతో వారిని విడదీయడం అన్యాయం. ఒక వేళ మృత్యువు వాళ్ళను విడదీస్తే ఎవరూ ఏమీ చేయలేరు. ఈ దశలో మృత్యువు అతి సహజమైనదని, తప్పని సరి అని మనో దైర్యంతో ఉండాలి. చావుకు భయపడక పోవటమే, దానిని జయించటం. ఈ సమస్యల నెదుర్కోవటానికి సంసిద్ధులం కావాలి. అందుకు ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించి మనసులో వుంచుకోవాలి. మన వయస్సున్న వారితో స్నేహం పెంచు కోవాలి. అందుకు పార్కులు, లైబ్రరీలు బాగా ఉపయోగ పడతాయి. ప్రకృతిని గమనించండి – ఆహ్లాదంగా ఉంటుంది. ఇష్టమయిన పుస్తకాలు చదువుకోండి. తోట పని చేయడం అలవాటు చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ప్రొద్దు చాలా బాగా గడుస్తుంది. వాకింగ్ చేయండి- అదీ సాటి వృద్ధులతో కలసి చేస్తే మీకూ వారికి సంతోషం. మీ మనుమలు మనమరాళ్ళతో ఆడుకోండి, బి.పి మీ దరి చేరదు. వాళ్ళ హోంవర్కులో పాలు పంచుకోండి. మీకు ఒక మంచి పని చేసినట్లువుంటుంది. మీ సంతానం కూడా సంతోషిస్తారు. టీ.వీ. లో మీ వయస్సుకు తగిన ప్రోగ్రాంలు చూడండి. అసలు 'రిమోట్ మీ కోసమే సుమా కనిపెట్టబడింది. కుటుంబంలో జరిగే దినవారీ వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకండి. మీతో చర్చిస్తేనే సలహాలు ఇవ్వండి. ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ ఇంట్లో మీరు అతిధిగా వుండటం అలవాటు చేసుకోండి. రాబోయే ఆపదల గురించి ఎక్కువగా ఆలోచించి భయపడకండి- ఇప్పటికే 3 తరాల వారు సమకూరారు. కనుక సమస్యలు, ఆపదలు, భయాలు ఇక వారి భాగానికి వదలి వేయండి. నిరాదరణకు గురి అయ్యామనే ఆలోచన వదిలేయండి. మీ పిల్లలు వారి వారి పనుల్లో మునిగి వున్నారని అనుకోండి. భజన, పురాణ కాలక్షేపం, ద్యానంతో హాయిగా గడపండి. ఈ వయస్సులో సహజంగా వచ్చే జబ్బులుంటాయి. వాటిని తీవ్రంగా పరిగణించి మనసు పాడు చేసుకో కండి. వాటిని విపరీతము చేసి కుటుంబ సభ్యులను విసిగించకండి. అంటే నిర్లక్ష్యము చేయమనిగాదు. ఆందోళన రహితంగా తగిన ఉపశమన చికిత్సలు చేయించుకోండి. ఈ దశలో మీవద్ద కొన్ని నిరపాయకార మయిన హోమియో మందులు వుంటే వాటిని సులభంగా వాడు కోవచ్చు. నాలుగు లేక అయిదు రోజులు ఈ మందులు రోజుకు ఒకటి లేక రెండు మార్లు వేసుకుంటే సరిపోతుంది. అట్టి శ్రమ, మరియు ఎక్కువ ఖర్చు లేకుండా జీవితాన్ని ప్రశాతంగా కొనసాగించవచ్చు. మరొక్క విషయమేమిటంటే బాగుచేయలేని కఠినమైన జబ్బులకు ఉపశమనమే మార్గమౌతుంది. అందుకు కూడా హోమియో మందులు శ్రేష్టమైనవి. అంతేకాదు ఇక లాభం లేదనుకునే ఆఖరు దశలో కూడా ఈ మందులు ప్రశాంతతను మనిషికి ప్రసాదిస్తాయి. అందుకే కొంత సమాచారాన్ని సేకరించి సంక్షిప్తంగా మందులను సూచిస్తున్నాము. పరిశీలించండి. ఉపయోగించండి - మేలుపడండి.
సూచన:- 3,6,12 పొటెన్నీ మందులు రోజుకు 3 పూటలు, 30 పొటెన్నీ మందులు రోజుకు 1, 2 పూటలు వాడుకొన వచ్చును. 200 పొటెన్సీ మందులు వారానికి, 1, 2 సార్లు, 1M పొటెన్సీ మందులు నెలకు 1, 2 సార్లు వాడిన చాలును.
శుభం.
1.ఆందోళన – ఆతృత
అకోనైట్-30: చావు భయం, గుండెదడ, చల్లని పొడిగాలి వల్ల జ్వరం,పడిశం.
అర్జంటం నైట్రికం200: కీడును శంకించి త్వరత్వరగా నడుస్తాడు.
బ్రయోనియా- 200: తన వ్యాపారాన్ని గురించి చింత, రాత్రిళ్ళు కలవరింపులు.
జెల్సిమియం -30, 200 : భయం, సభా కంపం, చెడువార్త లేకవినడంతో వణుకు.
ఇగ్నీషియా- 200: ఆంతరంగిక చింత, పోయిన వారిపై బెంగ-దు:ఖము.
2. ఉబ్బసం
అమోనియం కార్చ్-30 : ముక్కు దిబ్బడ ,నోటితో ఊపిరి పీల్చ వలసి వచ్చును.
ఆంటిం టార్ట్-30: గళ్ళలు తెగి రాక బాధ పెట్టును.
ఇపెకాక్-30: ఊపిరితిత్తులలో గురగురలు.
కార్బో వేజ్-30: ఉపిరాడని స్థితి. గాలికై తపన.
క్యాషియా సోఫేరా: చలి కాలం బాధ- దుమ్మూ ధూళితో బాధ, వాతావరణం మార్పిడి వల్ల, చన్నీళ్ళవల్ల, పొగవల్ల దగ్గు, ఆయాసం, గొంతులోను, చాతీలోను నొప్పి.
గ్రిండేలియా-Q, బ్లాటా-Q: పడుకుంటే ఊపిరాడని స్థితి
అస్పీడో స్పెర్మా-Q: నాలుగడుగులకే ఆయాస పడతాడు. గాలి ఎక్కువగా పీల్చుకో వలసి వస్తుంది.
ఆర్శనికం ఆల్బం30, నేట్రం సల్పు-30: రెండూ మార్చి మార్చి వాడ
వలెను. చలి గాలి, తేమ, ఊపిరి తిత్తులలో తేమతో బాధ లెక్కువగా వుండును.
ట్యూబర్ కులినం1M: అప్పుడప్పుడు ఒక డోసు వేయ వలయును.
3.రక్తపోటు-B.P.
అకోనైట్-30: అకస్మాత్తుగా ఏదైనా ఘోరం జరిగితే పెరిగిన రక్తపోటును తగ్గిస్తుంది.
రవల్ఫియాసర్పెంటైనాQ: రాత్రిళ్ళు ఒక కప్పు నీటిలో 10 చుక్కలు కలిపి త్రాగవలెను రక్తపోటు తగ్గి అదుపులోనికి వచ్చును.
బరైటాకార్చ్-200: త్వరగా ముసలితనం వచ్చిన వారిలో వచ్చు రక్తపోటుకు.
బరైటామూర్ 30: గుండె ఎక్కువగా సంకోచించి, వ్యాకోచము తక్కువగా నుండి రక్తపోటు కలుగును.
విస్కమ్ ఆల్బ్Q : తల తిరుగును. నాడి నిదానంగా కొట్టు కుంటుంది. గుండెను పట్టి పిండినట్లు నొప్పి వుండి, రక్తపోటు తగ్గిపోయినప్పుడు వాడాలి.
జెల్సిమియం-30: గుండె అవకతవకలుగా ఆడుతుంది. గుండె నిలిచి పోతుందనే భయం కలుగుతుంది. అందు కొరకు కదులుతూ ఉండాలనిపిస్తుంది. రక్తపోటు తగ్గి వుంటుంది.
4. దగ్గు-పడిశం
యూకలిప్టస్-30 పడిశం దగ్గులకు అన్ని దశలలో పనిచేయును.:
ఆంటింటార్ట్-30: గళ్ళలు తెగి వచ్చి ఉపశమనం గలుగును.
రూస్టాక్సు-30 గాలి పీల్చినపుడు దగ్గు వచ్చును.
కాలి బిచ్-30: రొంప తీగలవలె సాగును.
స్పాంజియా-30: పొడిదగ్గు - రంపం కోత శబ్దంతో దగ్గును.
హెపార్ సల్ఫ్-30 : చలిగాలి వల్ల వచ్చిన దగ్గు గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుండి మింగడం బాధ కలిగించును.
స్టానం -30: గళ్ళ పసుపు పచ్చగా వుండి రొమ్ము పట్టుకొనిగాని దగ్గలేని
బలహీన ముండును.
5. మలబద్దకం
ఆంటింక్రూడమ్-30: మలబద్దకం- విరేచనాలు మార్చి మార్చి వస్తూ వుంటాయి.
బ్రయోనియా-30: గట్టిగా కాల్చి నట్లు నల్లని పొడవాటి మలం వచ్చును.
వారమైనా మలబద్దకం బాధించదు.
అల్యూమినా-30: పలుచటి మలమైనా రావటం కష్టం .
నక్సు వామికా-30: ఆకలి మందగించి మలబద్దకం వస్తుంది.
కోలన్సోనియా-30: బ్రయోనియా తర్వాత వాడుకొన వచ్చును.
వెరాట్రం ఆల్బం-30 : ఎక్కువగా ముక్క వలసి వచ్చును. తద్వారా నొసట
చెమట పట్టును.
ఓపియం -30: గొర్రె పెంటికల మాదిరి గట్టి వుండలుగా మలం వచ్చును.
(రాత్రి ఉప్పు గాని చెక్కరగాని కలుపని ఒక కప్పు నిమ్మకాయ రసం తాగాలి.)
6. జివ్వు జివ్వుమను నొప్పులు.
కుప్రమ్ మెట్-200 :కాళ్ళలో నొప్పులు వున్నప్పుడు.
బ్రయోనియా-200: కడుపులో, పొత్తి కడుపులో వచ్చే నొప్పులకు.
మెగ్నీషియాపాస్30: విడచి విడచి వచ్చే నొప్పులకు.
7.నిరాశా నిస్పృహ
సిలీనియం-200: మానసిక శ్రమవల్ల విసుగు వ్యధ.
అనకార్డియం-200: జ్ఞాపకశక్తి తగ్గిపోవును. తొందరగా అపార్ధం చేసుకుంటారు. ఎవరిని నమ్మరు. ఆత్మ విశ్వాసం ఉండదు. ఆత్మల ఘోష విన్నా మంటారు.
కాలిపాస్-6: నిద్ర సరిగా రాదు. నరాల బలహీనత ఆత్రుత ఎక్కువ.
అల్యూమిన-200: నిరాశా నిస్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు.
ఆరంమెట్-200: జీవితం వృధా అనిపిస్తుంది. అత్మహత్యకు పాల్పడుతాడు.
ఇగ్నీషియా-200: జరగరాని సంఘటనలు, వినదగని మాటలు వినడం వల్ల దిగులు, వ్యధ, క్షణం క్షణం ఆలోచనలలో మార్పు.
ఆసిడ్ పాస్-30: చాలా కాలంగా ఉన్న దిగులు, మానసిక ఆందోళన - నిస్సత్తువ.
ఓపియం -200: భయం వల్ల రకరకాల వ్యాదులు.
8. నీళ్ళ విరేచనాలు
పోడో పైలం-30: ఈడ్చి కొట్టినట్లు ఎక్కువగా విరేచనాలు.
ఆంటింక్రూడం-30: విరేచనాలు మలబద్దకం మార్చి మార్చి అవుతూ వుంటాయి.
నక్సువామికా-30: జీర్ణం కాక విరేచనాలు.
ఆర్సనికం ఆల్బం: చెడిపోయిన ఆహారం తినడం వల్ల విరేచనాలు వాంతులు.
9. చీము బేదులు
మెర్కుసాల్-30: చీముతో కలసి విరేచనాలు, ముడ్డి పీకుడు.
మెర్కుకార్-30: చీముతో కలసి రక్తం పడును.
అలోస్-30: తెల్లటి గుజ్జుతో విరేచనాలు, గ్యాస్ ఎక్కువ, విరేచనానికి తొందర ఉండును.
కోలోసింత్-30: కడుపులో నొప్పితో విరేచనాలు.
10. అజీర్ణం - ఆకలి తగ్గుట
ఆంటింక్రూడం-30: అదుపి తప్పి తినుటవల్ల అజీర్తి, నాలుకపై తెల్లని పూత.
నక్సువామికా-30: తిన్న గంట తర్వాత ఇబ్బంది, మాంసాహారం అరగక ఇబ్బంది.
పల్సటిల్ల-30: నూనె పిండి పదార్థాలు అరగక అజీర్తి.
11. వాపులు
ఆసిడ్ ఫ్లోర్-30: కాళ్ళు చేతులు వాపులు.
ఎపిస్ మెల్-30, నేట్రం మూర్-30: ముఖము పాదములు వాపు.
లాక్ డిప్లరేటం-30: దీర్గకాలం మూత్రంలో సుద్ద, కాలేయం వ్యాది వల్ల కడుపువాపు.
అపోసైనం క్యాన్Q:-దప్పిక -మూత్ర బంధం, దీర్గ రోగాల తర్వాత కడుపు వాపు.
12. చిక్కిపోవుట
బరైటా కార్చ్-200: కొవ్వు కరిగి డీలా పడతారు.
స్టాఫి సాగ్రియా-30, ఆసిడ్ పాస్-30, ఆసిడ్ పికికం-30 : డీలాపడి పోతారు. బలహీనంగా వుంటారు.
13.కడుపుబ్బరం
ఆంటిం క్రూడం-30: మితి మీరి తినడం వల్ల అజీర్తితో కడుపుబ్బరం.
కార్బో వెజ్-30: గాలి పైకెగదట్టు చుండును.
లైకోపోడియ-30: గాలి క్రిందకు నెట్టు చుండును. పొత్తి కడుపులో గాలి.
చైనా-30 : పొట్ట మొత్తం ఉబ్బరించును.
14. తల త్రిప్పుట
బ్రయోనియా-30: లేవగనే తల తిప్పుట.
కోనియం-30: కనులు కదిల్చితే తలత్రిప్పు వచ్చును.
కాల్కేరియా పాస్-30: బలహీనంగా ఉండి తలత్రిప్పు వచ్చును.
ఫెర్రం పాస్-30 : పారేనీరు చూస్తే తల తిరుగును.
కాలీ పాస్-30: నరముల బలహీనత వల్ల. మానసిక శ్రమ వల్ల తల
తిరుగును.
15. చెవుడు
బరైటా కార్చ్-30: సరిగా వినబడదు.
కాష్టికం -30: పూర్తి చెవుడు.
పాస్పరస్-30: మనుషుల మాటలు మాత్రం సరిగా వినపడవు.
గ్రాఫైటిస్-30: మామూలుగా వినపడదు కానీ బస్సు, రైలు, కారు ప్రయాణంలో మాత్రం వినగలరు
మెగ్నీషియా కార్బ30: షాక్ వల చెవుడు.
16.మతి మరుపు
లైకోపోడియం- 30: జ్ఞాపక శక్తి తగ్గియుండును.
అన కార్డియం-30: మతిమరుపు ఎక్కువ.
ఆసిడ్ పాస్-30, కాలీ పాస్-30 : బలహీనతతో పాటి వినికిడి తగ్గి యుండును.
17. ముక్కు నుండి రక్తం
ఇపేకాక్-30 : ముక్కు నుండి ఎర్రని రక్తం.
అమ్మోనియా కార్చ్-30: ముఖం కడిగేటప్పుడు రక్తం కారును బ్రయోనియా-30 : కదిలితే రక్తం ఎక్కువగా కారును.
నేట్రం మూర్-30: మామూలుగా ఈ ఇబ్బందిగలవారు ముందుగా ఈ మందు వాడి మేలు పొందవచ్చును.
18.కీళ్ళనొప్పులు
బ్రయోనియా-30 : కదిలితే నొప్పి దప్పిక ఎక్కువ.
లెడంపాల్-200: నొప్పి, వాపు పైకి ఎగబ్రాకు నొప్పులు.
రూస్ట్రాక్సు-30: మొదటి కదలిక నొప్పి, తర్వాత నొప్పి తగ్గును.
క్యాషియా సఫేరా30: రూస్టాక్సు వలెనే పని చేయును. మడమ నొప్పిని కూడా నివారించును.
కోల్చికం-30: చిన్న కీళ్ళు వాపునొప్పి, చలికాలపు వాత నొప్పులు.
సింసిప్యూగా-30: పెద్ద కండరాల నొప్పి రాత్రులెక్కువ చలి వాతావరణం
సరిపడదు.
గయాకం-30: కీళ్ళవాతం - విపరీతంగా నొప్పి. ఎముకపై ముడులుగా ఉబ్బుట.
19. నిద్రలేమి
ఆర్నికా మాంట్- 200: శ్రమవల్ల వొళ్ళు నొప్పులు, నిద్ర పట్టక పోవుట.
కాఫియా క్రూడా-30, ప్లాసి ప్లోరా-Q: కలత వల్ల నిద్ర పట్టక పోవుట,
కాలీ పాస్-30: మెదడుకు విశ్రాంతి నిచ్చి నిద్ర పట్టించును. ఉదయం ఒక డోసు వేసుకోవలెను.
నక్సువామికా-200: అధిక మానసిక శ్రమ,కోపము వల్ల నిద్ర రాకుండుటను నివారించును. రాత్రికి ఒక డోసు వాడ వలెను.
ఆంబ్రాగ్రేసియా-30: నరముల బలహీనత, అలసట, చింత తొలగించి నిద్ర పట్టు నట్లు చేయును.
కెన్నబిస్ ఇండికా-30: మొండి, నిద్రలేమి -నరముల నిస్సత్తువ.
ఇగ్నీషియా-30: మానసిక వ్యధవల్ల కృంగి,చింత, దిగులు, కావలసిన వారి ఎడబాటు వల్ల దుఖ:ము వల్ల నిద్ర రాక పోవుట.
ఓపియం -30: చీమ చిటుక్కుమన్నా వినబడుతుంది, గడియారం శబ్దం
కూడా నిద్ర పట్టనీయదు.
20. మూత్రకోశ వ్యాదులు.
ఫెర్రం పాస్-30: మూత్రనాళం వాపు నొప్పిగా వుంటుంది.
జెల్సిమియం -30: వణుకు, మూత్రం పోయుటలో అదుపు వుండదు.
ఈక్విసేటం-30: మూత్రం సరిగా రాదు. కానీ ఎప్పుడూ వచ్చినట్లే ఉంటుంది.
సర్పపరిల్ల-30: మూత్రంలో తెల్ల సుద్ద. మూత్రంపిండంలో రాళ్ళు.
లైకోపోడియ-30: మూత్రంలో ఎర్ర ఇటుకపోడివంటి సుద్ద వుండును.
బెరిబెరిక్ వల్గారిస్30: మూత్రనాళాలలో రాళ్ళు కదలివచ్చి మూత్రంతో పాటే బయట పడును. మూత్రనాళం చాలా నొప్పిగా ఉండును.
21. కంటి చూపు
కాల్కేరియా ఫ్లోర్30: తొలి దశలో పొరలు కరిగించును. మలి దశలో పొరలు ముదరకుండా నిలుపును.
ఆరంమెట్-200: కంటి నరాలకు బలము చేకూర్చును.
యూఫరేషియ -30: కంటికి కలిగిన శ్రమను తగ్గించును. మదర్ టించర్ 10% ద్రావణంగా నీళ్ళతో పలుచబరచి కంటిలో చుక్కలుగా వేసికొన వచ్చును. కలకలు కూడా మానును.
బెల్లడోనా-200: కన్నుకుట్టి ఎర్రగా వాపుతో నొప్పిగలిగియుండును
ఎపిస్ మెల్-30: కంటిలో ఇసుక పోసినట్లు నొప్పి, చన్నీళ్ళతో కడిగిన నొప్పి తగ్గును.
22. చర్మ వ్యాధులు
సల్ఫర్ 30,200: చర్మం మంట, నవ, తలకు వేసుకునే రంగుల వల్ల : దురదకు పని చేయును. స్నానం అయిష్టం - మెండి వాదనలు చేయును.
గ్రఫయిటిస్-30: తేనెవంటి స్రావంగల నుసిమిర్లు
రూస్టాక్సు-30 : పొడి నుసిమిర్లు, దద్దుర్లు.
ఆర్టికాయురేన్స్-30: చర్మంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, నవ.
బొవిస్టా-, లూనా-30: చేతి వెనుక భాగంలో చర్మం దురద, నుసిమిరి.
కాలీ బైక్రోమికం-30: నడినెత్తిలో నుసిమిరి, జిల..
పెట్రోలియం-30: చంకలలో, గజ్జలలో నవ, ఫంగస్.
సోరినం-200: పొడి నుసిమిరి, ఏనుగు చర్మం పొట్టురాలు చర్మవ్యాధి.,
ఆసిడ్ క్రయిసో-30 : మొండి గజ్జి, జిల.
గన్ వుడర్-6: రక్తం శుభ్రపరచి నవలు మాన్సును.
హైడ్రోకోటైల్6: కుష్టు, మొటిమలు మాన్సును.
23. ఇతర వ్యాదులు
బెరైటా కార్చ్-200, కాల్కేరియా ఫ్లోర్-30: ప్రోస్టేటుగ్రంధి వాపు తగ్గును.
సబల్ సరులేటా-Q: రాత్రి ఒక కప్పు నీటిలో 10చుక్కలు కలిపి త్రాగిన ప్రోస్టేటుగ్రంధి వాపు తగ్గును.
కోనియమ్-200: ముసలి బ్రహ్మచారుల ప్రోస్టేటుగ్రంధి వాపు తగ్గును.
కెలాడియ0 -200, టబాకం-200: రోజుకు ఒకటి రెండు మోతాలు ఒకవారం, రోజులు వాడితేడితే, పొగ త్రాగాలనే తుత్తం పో తుంది.
అవినా సతీవా-Q, క్వరికస్-Q, స్పిరిటస్-Q ఇవి తాగుడు మాన్పుటకు: ఉపయోగ పడును. రోజూ ఉదయం, రాత్రి 10 చుక్కలు కప్పు నీళ్ళలో కలిపి త్రాగం వలెను.
డఫ్ నే ఇండికా-1M: వారానికి ఒక డోసు వేయడంవల్ల త్రాగుడు మాన్పును.
హైడ్రాసిటీస్-Q: వయస్సు పైబడటం వల్ల వచ్చిన గురక మాన్సును.
ఓపియం -30: నిద్రలేమివల్ల వచ్చిన గురక మాన్పును.
కాల్కేరియా పాస్12x, కాలీ పాస్-3x, నేట్రం మూర్-3X: ఈ బైకో మందులు రోజూ 3x2=6 మాత్రలు రెండు పూటలా వాడితే గుండె నొప్పి రాదు.
సమాప్తం
No comments:
Post a Comment