హోమియో తత్త్వశాస్త్రము
(సంక్షిప్తము)
డా|| శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్యప్రదాత)
రచన: శ్రీపి.సుబ్బరాయుడు, కెంట్ హోమియో అసోసియేషన్, కడప
హోమియో తత్త్వశాస్త్రము
హోమియోపతీ అంటే......
గ్రీకు భాషలో హోమోస్ అంటే "అదేవిధమైన" పాథాస్ అంటే "బాధలు". ఈ మాటల కూర్పుతో హోమియోపతి అను పదము పుట్టినది. దీనిని సారూప్యౌషధ విధానము అని అనవచ్చును. ఈ వైద్య శాస్త్రమునకు ఆద్యుడు జర్మనీ దేశస్తుడైన డా||శామ్యూల్ హనిమాన్ (1755-1843). ఒక పదార్యం సేవిస్తే శరీరంలో కొన్ని వికారాలు కలగవచ్చు. అలా ఏ వికారాలు ఒక పదార్థం దేహంలో కలిగించిందో అదే పదార్థము శరీరములో ఉత్పన్నమైన అదే విధమైన వికారాలను (దుర్గుణాలను) బాగు చేయగలుగుతుంది. "ఉష్ణం ఉష్ణేన శీతలహః" అనునదొక వైద్యశాస్త్ర సూత్రం. అంటే వేడి తగ్గడానికి వేడి నీళ్ళు వాడాలి అందువల్ల వేడి తగ్గి చల్లబడుతుంది. ఈ సూత్రం పైననే హోమియోపతి వైద్యం ఆధారపడి యున్నది. అల్లోపతి వైద్యం దీనికి భిన్నమైనది. అంటే వేడి తగ్గటానికి చన్నీళ్ళు వాడటం వంటిది.
హోమియోపతీలో వ్యాధి అంటే......
హోమియోపతి ప్రకారము ప్రతి జీవిలోను ప్రాణాశక్తి లేక జీవశక్తి (వైటల్‌ఫోర్స్) యున్నది. అది శరీర అవయవములన్నింటిని సమస్థితిలో నుంచుతున్నది. అందువల్ల అవయవములు వాటి వాటి పనులను చక్కటి సమన్వయముతో నిర్వర్తిస్తూ ఎట్టి అసౌకర్యము లేక పని చేయుచున్నవి. ఇదే ఆరోగ్యము. ప్రాణశక్తి ఆస్తవ్యస్తమై వక్రత చెందినచో అవయవముల పనితీరులో మొదట వున్నటువంటి చక్కని అనుసంధానము, సమత భంగపడును. దానితో శరీరము రోగగ్రస్థమగును. ఇందుకు అనేక కారణములుండవచ్చును. శీతోష్ణస్థితులు, రోగ కారక క్రిములు, రోగి అలవాట్లు, ఆలోచనా తీరు, జీవితములో ఎదుర్కొను సమస్యలు ఇలా ఎన్నైనను వుండవచ్చును. ఇంతకంటే ముఖ్యముగా మనిషి అంతర్గత స్థితి రోగమును తనలో మననిచ్చుటకు అనుకూలముగా కూడా వుండుసు (ససెప్టబిలిటి). అప్పుడే వ్యాధి సంభవించును.
ఆరోగ్యమంటే......
అస్తవ్యస్తమైన లేక వక్రత చెందినట్టి ప్రాణశక్తిని సరిదిరి తిరిగి పూర్వస్థితికి తేవలెను. అనగా అవయవములకు, ప్రాణశకికి గల సమన్వయము తిరిగి పునరుద్ధరింపబడవలెను. అదియే ఆరోగ్యము.
వ్యాధిని గుర్తించడం - వైద్యం చేయడం......
ప్రాణశక్తి కుంటువడిన తోడనే అవయవముల సమన్వయము తప్పి వ్యాధికి లోనగుదుముగదా! ఆవ్యాధి కొన్ని లక్షణములు లేక వేదనల (బాధల) ద్వారా బహిర్గతమగును. అంటే ప్రాణశక్తి తనలో కలిగిన అస్తవ్యస్తతను కొన్ని వేదనల రూపమున వ్యక్త పరచును. అది గమనించి జీవునకు సారూప్యముగల ఔషధమిచ్చి ప్రాణశక్తి తన్ను తాను పునరుద్దరించుకొనుటకు సహాయపడవలెను. అలా ఔషధ శక్తి సహాయమున తన్నుతాను శక్తివంతముజేసికొన్న ప్రాణశక్తి రోగమును శరీరము నుండి బయటికి తోసివేయును. కనుక మందు అంతర్గత మనిషికే గాని రోగమునకు కాదు. అల్లోపతి వైద్యశాస్త్రములో ఆ వేదనలను బట్టి మలేరియా, టైఫాయిడు, రుమాటిజం, డయోరియా, డీసెంటీ అని పేరిడి వైద్యము చేయుదురు. హోమియోపతిలో వ్యాధి పేరుతో సంబంధము లేకుండా వేదనా సముదాయమును బట్టి ప్రాణశక్తి వక్రతను గమనించి వైద్యము చేయుదురు. ఉదాహరణకు ఒకనికి జ్వరము వచ్చినది. అందులో దేహమంతా నొప్పులు, కదలలేని పరిస్థితి, విరేచనబద్దము, విపరీతమైన దప్పిక గలిగి, ముడుచుకొని పరుండును.
కదలడానికొప్పుకొనడు, నీళ్ళు ఎక్కువగా తాగును. ఈ వేదనలను బట్టి “బ్రయోనియా” అను మందునిత్తురు. అదే జ్వరము మరొకరికి వచ్చి, నొప్పులు ఒకచోటగాక శరీరములో ఒక్కోసారి ఒక్కోచోట వుంటూ మారుచుండును, దప్పిక వుండదు. రోగి విరిచనములు కూడా ఒక్కోసారి పలుచగను మరోసారి గట్టిగాను, ఒకసారి పసుపుపచ్చ గాను, మరోసారి తెల్లగాను ఒకసారి పున్నట్లు మరోసారి వుండదు. రోగి ఏడ్చుస్వభావము గల్లియుండును. ఇతని పేదనల ననుసరించి “పల్సటిల్లా” మందు నిచ్చెదరు. ఇలా రోగిని వేదనలను బట్టి గుర్తింతురు. జ్వరం అనగానే అల్లోపతిలో "పారాసెటమాల్" ఇచ్చుట అలవాటు. వారికి వేదనల తీరుతో పనిలేదు. కానీ హోమియోపతిలో అలా కుదరదు, వేదనా సముదాయాలే మందును (హోమియోలో) సూచించును. కనుక హోమియో వైద్యము ప్రకారము మందుపేరు రోగికి, రోగనామం వైద్యునికి తెలియనవసరంలేదు. హోమియోపతిలో రోగిని ఔషధ నామంతోనే పిలుచుట పరిపాటి. ఉదాహరణకు అతడు నక్స్వమికా పేషెంటు లేక పల్సటిల్లా పేషెంటు అని పిలుస్తారు.
హోమియో మందులు
హోమియో మందులను మూలికలు, రసాయనికాలు, లవణాలు, కొన్ని పురుగులు, జంతువులు, వాటి విషాలు మరియు లోహములతోనూ తయారుచేస్తారు. ఇవి కాక జబ్బుమాలిన్యాల ( క్షయ వ్యాధిగ్రస్తుని గళ్ళ, గనేరియా వ్రణములరసి వంటివి) తో కూడా మందులు తయారు చేస్తారు. వీటిని "నోసోడ్పు" అంటారు. మూలికలతో (వృక్ష సంబంధ మగు ఆకులు, పూలు, బెరడు, వేరు) చేసిన మందులు చాలామటుకు ఆపాయరహితములు. రసాయనిక, విషాల, లోహాలతో చేసిన మందులు ఒకదాన్ని మించి మరొకటి లోతుగా పనిచేస్తాయి. కనుక వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ఔషధ పదార్థములను, నేరుగాగానీ లేక సూక్ష్మీకరించి (పొటెర్టైజేషన్ చేసి) గాని, మొదట ఆరోగ్యవంతుడైన హోమియో తెలిసిన వ్యక్తిపై ప్రయోగిస్తారు. అలా ప్రయోగించినపుడు అతని ఆరోగ్యములో కలిగే మార్పులను, దుష్టవేదనలను అడిగి తెలుసుకొని, వాటిని అతనిపై వాడిన పదార్థపు ఔషధగుణములుగా వాసికొనెదరు. అలా పలుమార్లు స్త్రీ పురుషులపై జరిపిన ప్రయోగాల మూలంగా, వాడిన పదార్థాలను, ఆ పదార్థాలు ఉత్పాదించిన లక్షణసముదాయాన్ని కూర్పుజేసి వ్రాసిపెడతారు. దాన్ని వస్తుగుణదీపిక (మెటీరియా మెడిక) అంటారు. దీన్నే తిరగద్రిప్పివేదనలు, వాటి నుత్పాదించిన ఔషధములను వాసికొని "రెపర్డి" అంటారు. వీటి సహయముచేతనే రోగి వేదనల సముదాయమును, అవేవేదనల నుత్పాదించు సారూప్వౌషధములను, పోల్చి చూసుకొని మందులను హోమియో విధానములో వాడుకుంటారు.
మందుల తయారీ మరియు సూక్ష్మీకరణ
సాధారణంగా శుభ్రపరచిన సారాయిలో ఔషధములను నానబెట్టి వడగట్టి మాతృదావణములు (క్యూ) తయారుచేస్తారు. ఇందులో సారాయి 90% వరకు కూడా వుండవచ్చు. సారాయిలో కరుగని పదార్థాలను సారాయిలో ముంచి అరగరుదుట ద్వారాను లేక
పదార్థానికి చక్కెర కలిపి మర్ధన చేయుట ద్వారాను మందులు తయారుచేస్తారు. పూర్వము వైద్యులు మంచి నీటితో ఔషధ పదార్తమును పలుచబరచి మర్దన చేసి వడగట్టి కుదింపులిచ్చి వాడుకొనేవారు. ఔషధ పదారము ఒకపాలు 9 పాళ్ళు చెక్కెర లేక శుద్ధసారాయి కలిపి నూరి కుదుపులు కలిగించి 1x అంటారు. అలాకాక ఒకటికి 99 పాళ్ళు చెక్కెర లేక శుద్ధ సారాయి కలిపి చేసిన మందును 1c లేక 1 అంటారు. ఇలా తయారైన 1x మందుకు , 9పాళ్ళు సారాయి కలిపి కుదిపితే 2x అవుతుంది. అలానే 1. మందుకు 99 పాళ్ళు సారాయి కలిపి కుదిపితే 2c లేక 2 అవుతుంది. ఈ పద్దతిలో సూక్ష్మీకరణ చేస్తూ 3, 6, 12, 30, 200, 1000 (1M), 10M,CM,DM, ల వరకు శక్తిని పెంచి మందులు వాడుదురు. ఇవన్నీ ఇప్పుడు యంత్ర సహాయంతో తయారగుచున్నవి. ఇందులో గమనించదగ్గ విషయమేమంటే ఔషధ పదారమును సూక్ష్మీకరణ ద్వారా తగ్గిస్తూ పోతే అందులో శక్తి పెరుగుతూ పోతుంది. ఆరు పొటెన్సీ తర్వాత మనకు అందులో ఔషధము యొక్క జడత్వము పోయి ఔషధశక్తి మాత్రమే పుంటుంది. దాన్ని మరింత సూక్ష్మీకరించడం ద్వారా మరింత శక్తి వంతమౌతూ పోతుంది.
నివారణ కొఱకు ఔషధ పొటెన్సీ నిర్ణయించడం ఎలా?
దీనికి ఇదమిద్ధమైన పద్దతి అంటూ ఏమీలేదు. వైద్యుని అనుభవమును బట్టి పొటెన్సీ నిర్ణయించుకొంటాడు. లేదంటే బాహ్యమైన రోగ లక్షణాలకు తక్కువ పొటెన్సీలు (30 గానీ దాని లోపుగానీ) మానసిక లక్షణాలకు దీర్ఘ, చర్మరోగములకు ఎక్కువ (200 ఆపై) పొటెన్సీలు వాడటం ఒక పద్ధతి. కొన్ని లోతుగా పనిచేసే తూజా, సల్ఫరు, పాస్పరసు, లేకసిస్ వంటి మందులు, లోహ విష, సంబంధమైన మందులు రోగమాలిన్య (నోసోడ్) మందులూ ఎప్పుడూ ఎక్కువ పొటెన్సీలలోనే వాడుకొనవలెను. ఏది ఏమైనా రోగియొక్క సున్నితత్వము, వైద్యుని అపార అనుభవమునదే తుది నిర్ణయము.
వేదనల పట్టిక నిర్మాణము - వైద్యుని ప్రతిభ
వైద్యుడు ప్రశాంతంగా రోగిని ఆప్యాయతతో పలుకరించి అతని నుండి వేదనలను రాబట్టుకొనవలెను. ఇది నిజమునకు ఒక కళ. అతడు చెప్పు బాహ్య శారీరక వేదనలు (ఆకలి, దప్పిక, మలమూత్ర విసర్జనలలో తేడా, శరీరంపై దద్దుర్లు వంటివి) కాగితపు ఒక వైపు సగంలో వాక్యానికి వాక్యానికి మధ్య బాగా ఖాళీయుంచి వాసుకొనవలెను. మరోవైపు అతని మానసిక లక్షణములు (కోపము, నిద్ర, అనుమానము, చింత, అసహ్యము, దుఃఖము వంటివి) ముందుటి వలెనె దూరదూరంగ వాసుకొనవలెను. ఈ ఎడములో రోగి మరచిపోయి తర్వాత చెప్పువేదనలు వాసుకొనుటకు వీలుండును. ఆ తర్వాత రోగిలో గమనించదగిన ప్రత్యేక లక్షణాలు (బట్టలు వదులుగ లేకుంటే అసహనము, నీళ్ళు మింగలేక పోవడం, గట్టి సంగటి ముద్దలు సులువుగా మింగడం వంటివి) కాగితం క్రింది భాగాన ప్రత్యేకంగా వాసుకొనవలెను. ఇవిగాక తాను స్వతహాగా గమనించి చూచిన అవలక్షణాలను రోగికి సేవచేయు వారు చెప్పిన లక్షణములను గూడా జాగ్రత్తగా వాటి అవసరాన్ని బట్టి పైన వదిలిన ఖాళీలలో నింపుకొనవలెను. అంతేగాక రోగి పూర్వము అనుభవించిన దీర్ఘరోగములు వీరి రక్త సంబంధీకులైన పూర్వీకులు (తండ్రి, తాతలు) అనుభవించిన దీర్ఘరోగములు (క్షయ, కుష్టు, చర్మరోగములు, సుఖవ్యాధులు) వెనుక పేజీలో స్పష్టముగా వ్రాసుకొనవలెను. రోగిని ప్రశ్నించునపుడు ఔనా?కాదా? ఉన్నదా లేదా? అన్న ప్రశ్నలు వేసి రోగి నుండి బలవంతముగా చెప్పించుకొనక రోగిని మాటలలోనికి దింపి
తనకై తనే మాట్లాడునట్లు చేయవలెను. విషయము ప్రక్కదారి పట్టినపుడు మాత్రమే వైద్యుడు జోక్యము చేసుకొని మళ్ళీ విషయము వైపు మళ్ళించవలెను. ఇలా తయారు చేసుకొన్న వేదనల పట్టికను బట్టి ఎక్కువ వేదనలు ఏఔషధము క్రిందకు వచ్చునో మొదట రెపర్బరీ ద్వారా నిర్ధారించి తర్వాత వస్తుగుణదీపిక ద్వారా సరిచూచుకొని మందు నిర్ణయించ వలెను. ప్రత్యేక లక్షణములకు మానసిక లక్షణములకు అధిక ప్రాధాన్యతనిచ్చి మందు నిర్ణయించుట మంచి పద్దతి. సాధారణ వేదనలను వదలి వేసినను పరవాలేదు. వైద్యునకు అనుభవము పెరిగినకొద్దీ రెపరీనీ, మెటిరియా మెడికాలు వాడుకోవడం కొంత తగ్గిపోవును. ప్రతి రోగిని ప్రతిసారి క్రొం గొత్తగానే విచారించవలసి యుండును. ముందు బాగుచేసిన రోగులతో పోల్సి నిర్ణయమునకు వచ్చుట సరికాదు. కనుక హోమియో వైద్యునకు పుస్తకములు పరిశీలించుట తప్పనిసరి. ఇచ్చటనే వైద్యుని ప్రతిభ గానవచ్చును. కనుకనే హోమియో వైద్యవిధానము ఒక శాస్త్ర మే కాక గొప్ప కళయని కూడా వివేకవంతులైన పెద్దలు శ్లాఘించిరి.
ఔషధ సేవనం వలన కలుగు మార్పులు - వైద్యుని పరిశీలన
ఔషధ సేవనం వలన రెండు రకముల చర్యలు జరుగును. ఒకటి ప్రధమ గుణము (ప్రైమరి ఆక్షన్)- మందు సేవించిన తర్వాత ఆ మందు ప్రాణశక్తిని చేరి దానిని కదిలించి ప్రభావిత మొనర్చును. రెండవది ద్వితీయగుణము లేక ఉపక్రియ. ఇది మందు ప్రాణశక్తిని కదిలించ యత్నించినపుడు ప్రాణశక్తి తన బలముతో దానిని ప్రతిఘటించును. ఇది వ్యాధి నివారణకై పుట్టించు కల్లోలము. ఈ ప్రతిఘటన కాస్తా తీవ్రమైనచో రోగలక్షణములు తాత్కాలికముగా హెచ్చును. దీనినే "అగ్రవేషన్" (ఉద్రిక్తత) అందురు. అటు గాక వ్యాధి తీవ్రతకు తగిన పొటెన్సీ నిర్ణయమైతే ఎట్టి ఒడిదుడుకులు లేక వ్యాధి శాంతించును. దీనినే "అమిలియొరేషన్" అందురు. ఈ అమిలి యొరేషన్ శాశ్వతమైతే రోగము నివారణమైనట్లే. కనుక తగిన పొటెన్సీ నిర్ణయం ఇందులో అతి ముఖ్యాంశం. నిద్రిస్తున్న జాగిలాన్ని లేపడానికి ఒక చిన్న గులకరాయి చాలు, అంతేగాని దానిపై పెద్ద బండ పైచినచో అది మేల్కొనుటటుంచి చచ్చి పూరకుండును. ఇదే సూత్రము పొటెన్సీ నిర్ణయమునకూ వర్తించును. ఇందు గమనించవలసిన మరో ముఖ్యాంశమేమనగా ఔషధము వలెనే రోగము ప్రాణశక్తిని తాకినపుడు కూడా ప్రాణశక్తి స్పందించి తన బలముతో రోగమును బయటికి నెట్టివేయును. దానితో మనకు తెలియకుండానే ఎన్నో రోగములు నివారణమగు చున్నవి.
దీర్ఘ వ్యాధులు లేక మియాజములు
జబ్బు నయమై మరలా తిరిగి కొన్నాళ్ళకు అదే జబ్బు రావడం గమనించిన హనిమాన్ అందుకు కారణమన్వేషించి ఈ దీర్ఘ రోగములను (మీయజంలను) కనిపెట్టను. ఇవి శరీర తత్వరూపమున దేహములో లోతుగ పాతుకొనిపోయి వుండి జబ్బులను పూర్తిగా నయము కానియ్యవు. అవి సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని మూడు రకములు. ఇవి మూడూగాక టూబరుకులాయిడ్ మియాజంను కూడా తర్వాతి శాస్త్రజులు చేర్చిరి. ఇది సోరా, సిఫిలిస్ ల ముడిగా గుర్తించిరి.
సోరా: ఇది వేలాది సంవత్సరాల క్రితమే మనిషిలోనికి ప్రవేశించింది. దీనినే దురద మరియు మానసిక దురద అనవచ్చును. దీనికి దురద క్రిమి ఒక్కటే కారణం కాదు. ఇది పూర్తిగా ఆంతరంగిక వ్యాధి. రోగజనక స్థితి. తరుణ వ్యాధులు దీర్ఘవ్యాధులుగా మారుటకిదే కారణము.స్థిమితము లేని మనస్సు, అసంతృప్తి, గ్రాహకశక్తి నశింపు, కోపము, విసుగు, భయము, కోపానంతర పశ్చాత్తాపము. అమావస్య, పూర్ణిమలలో ఉద్రేకము. స్త్రీల ఋతుసమయములలో మానసిక క్షోభ పంటివి వీటి మానసిక లక్షణములు. తలత్రిప్పు, దృష్టిలో పాలు, శరీరంలో నొప్పులు, చెవుడు, నోటి పుండ్లు, కలవరింపులు, గర్భస్రావములు, అతి మూత్రము, నపుంసకత్వము, బట్టతల, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, నిద్రలేమి, పీడకలలు మొదలైనవన్నీ సోరా శారీరక లక్షణములు. దీనికి విరుగుడుగా సల్ఫర్, సోరినం, కాషికం, ఎనకార్డియం, కాల్కేరియాకార్చ్ వాడవలసి వచ్చును.
సైకోసిస్: గనోరియా వ్యాధిని శరీరములో అణచిపెట్టుట వలన ఈ స్థితి శరీరమునకు కలుగును. తర్వాత ఇది వంశపారంపర్యముగా ఏపాపమెరుగకున్నను తరతరములకు ప్రాకి వచ్చును. ఈ మియాజములో అనుమానం, రహస్యచింతనం, తగవులాడుతత్వం, కల్లలాడుట, సెక్సు సంబంధిత ఆలోచనలు, మతిమరుపు మానసిక లక్షణములుగా వుండును. అండ వృద్ధి, తరచూ జలుబు చేయుట, రక్త హీనత, వాపులు, దుర్వాసనగల సావములు, ఊబశరీరం, పులిపిరికాయలు, చలికాలం ఉద్రేకించు ఊపిరితిత్తుల మరియు యితర వ్యాధులు, శారీరక వ్యాధులుగా నుండును. దీని నివారణకు తూజా, మెడోరినం, ఆర్సనికం, నైటీఆసిడ్ లాంటి మందులు వాడవలసి వచ్చును.
సిఫిలిస్: ఇది కూడా సుఖవ్యాధి సంక్రమణమే. సిఫిలిస్, షాంకర్ ఒడిశగడ్డలు, అణచిపెట్టుట ద్వారా శరీరములో స్థానమేర్పరచుకొని, వంశపారంపర్య జబ్బుగా మారి పీడించును. దీనివల్ల మందగొండి, సోమరితనం, దయాదాక్షిణ్యములు లేని కరత్వం, ఆత్మహత్యాతలంపు, మొండితనం, మూర్ఖత్వం, స్వార్థం, ఒంటరిగా నుండగోరుటవంటి మానసికలక్షణము లేర్పడును. రాత్రిళ్ళు బాధలెక్కువగుట, దుర్వాసన గల స్రావములు. శరీరంలోని ధాతువులు తినివేయు తత్వము, నోటి పుండ్లు, నిద్రలో చొంగగార్చుకొనుట, కుష్టు మొదలగు శారీరక వ్యాధులు దీనివల్ల గలుగును. దీనిని నివారించుకొనుటకు మెర్కుసాలు, ఆరంమెట్, లేకసిస్, సిఫిలినం, సాధిసాగ్రియా, టూబర్కులినం వంటి మందులు వాడవలసి వచ్చును.
ఈ మూడు మియాజములలో సోరా దుష్పచింతనమైతే, సైకోసిస్ దానికి తగిన వ్యూహరచన చేయును. ఇక సిఫిలిస్ ఆ వ్యూహరచనను కార్యరంగమునకు తెచ్చి అమలు జరుపును. అనగా ఒకణ్ణి హత్య చేయవలె నను దురాలోచన సోరా. అందుకు కావలసిన ఉపాయాలన్నీ ఆలోచించడం సైకోసిస్. ఇక రంగంలోకి దిగి హత్యచేయ్యడం సిఫిలిస్ తత్వంగా భావించవచ్చును. ఇవి ఒకదానికంటే మరొకటి తీవ్రమైనవి. వైద్యుడు వీటిని గమనించి ఈ మియాజంలకు తగిన మందు పాచ్చు పొటెన్సీలో మధ్యమధ్యలో వాడుచూ వేదనా సముదాయములు సూచించు సరియగు ఇతర మందులను వాడి సంపూర్ణ ఆరోగ్యమును సాధించవచ్చును.
ఇవికాక డా||గ్రావొగల్ అనువైద్య నిపుణుడు ఈ మియాజంలను (తత్వములను) ఇంకొక విధముగ వివరిస్తూ ఆయన ఈ మూడు తత్వములు చెప్పెను.
1. హైడ్రోజినాయిడ్ తత్త్వము: ఇది నీటి తత్త్వము. వాతావరణంలో తేమ, వర్మంలో తడవడం, ఏటి ఒడ్డున లేక తేమగల యిళ్ళలో నివసించడం, నీరు ఎక్కువగాగల పళ్ళు, కూరగాయలు తినడం వల్ల వీరికి ఆరోగ్యం చెడును. వీరికి చేపలు, గుడ్లు, పాలు సరిపడవు. వీరికి మెదడు, నాడీమండలం వ్యాధులు, చలిజ్వరము తరచూ వచ్చు చుండును. దీనికి తూజా, అమోనియం మందులు హెచ్చుపొటెన్సీలో అప్పుడప్పుడూ వాడవలసి యుండును.
2. ఆక్సిజనాయిడ్ తత్త్వము: వీరిలో ప్రాణవాయువు ఎక్కువ ప్రభావితమై యుండును. శరీర ధాతువులు తినివేయు స్వభావము వీరిలో ఎక్కువ. ఎముకలు అరిగిపోవును. సిఫిలిస్ వచ్చే ప్రమాద మున్నది. ఈ తత్త్వము వంశపారంపర్యంగా కూడా వచ్చును. వీరు బాగా చురుగ్గా చెలాకీగా కనబడుదురు. వీరికి మెర్కుసాలు, నేట్రంసల్పు హెచ్చు పొటెన్సీలలో అప్పుడప్పుడు వాడవలసి వుండును
3.కార్బోనైట్రోజనాయిడ్ తత్త్వము: వీరిలో శరీర పోషణ సరిగ వుండదు. రక్త క్షీణత కలుగు చుండును. విశ్రాంతిలో వీరి వేదనలు పెరుగును. ఆక్సిజను తక్కువుగా వుండే సినిమాహాళ్ళ వంటి చోట్ల వీరు తాళలేరు. మూత్రంలో ఆల్బుమిన్, ఫాస్పేట్లు ఎక్కువుగా పోతాయి. ఆహారం, సంభోగం ఎక్కువైతే వీరు జబ్బుపడతారు. ఆయాసం వీరికి తరచూ వస్తుంది. వీరు ఉప్పు ఎక్కువ తింటారు. వీరికి ఆర్స్ఆల్బ్, అర్జంటం నైట్రికం మందులు అప్పుడప్పుడు వాడవలసి వస్తుంది.
వీటిని అనుసరించి కూడా కొందరు హోమియో వైద్యులు వైద్యము చేసి మంచి ఫలితములనే పొందుచున్నారు.
ప్రకృతి వైద్యశాల - ఒక పరిశీలన
దీర్ఘ వ్యాధులుగా గుర్తింపబడిన సోరా, సైకోసిస్, సిఫిలిస్ బలంగా శరీరంలో నాటుకొని పోయివుంటే వాటి ప్రభావము నకు వాటితో పోలిక లేని యితర అంటు వ్యాధులను అవి సోకనీవు. ఉదాహరణకు సోరా శరీరంలో బలంగా నాటుకొని వుంటే పొంగు, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు శరీరంలోనికి చొరబడలేవు. అంతేగాకుండా కొన్ని బలమైన నైసర్గిక వ్యాధులు నయమై వెళ్ళిపోవునపుడు వాటితో పాటే వాటికి దగ్గరి సంబంధంగల చిన్నచిన్న వ్యాధులను కూడా వాటి వెంట గైకొని బయటికి వెళ్ళిపోవును. ఉదాహరణకు మశూచితోపాటు చెవుడు బాగైన దాఖలాలు గలవు. అట్లే ఆటలమ్మతోపాటే చర్మ వ్యాధి నయమైపోయినది. మరొక
విషయమేమంటే శరీరంలో ఈ సోరా, సైకోసిస్, సిఫిలిస్ ఒకటిగాని లేక రెండు, మూడు గాని ఒకేసారి పాతుకొనిపోయి వ్యాధి నివారణకు చిక్కులు కలిగించుచుండును. వైద్యుడు గమనించి వీటిని ముందు చాకచక్యముగా తొలగించిగానీ ముందుకు పోవుటకు సాధ్యపడదు.
మందుల పనితీరు - వైద్యుని కర్తవ్యము
హోమియో మందు నాలుక పై చప్పరించిన తర్వాత శరీరములో మార్పుయేమియూ లేకనూ పోవచ్చును లేదా మార్పు కలుగనూ వచ్చును.
మార్పేమీ లేదంటే - అందుకు కారణం
1.ప్రాణశక్తి బలహీనంగా వుండి రోగి మందగించి వుండవచ్చును. అప్పుడు పెద్ద పొటెన్సీ మందులు లోతుగా పనిచేయు మందులతో గాక మాతృదావణము (Q)లతో గాని తక్కువ పొటెన్సీలతో గానీ వైద్యము చేయవలెను.
2. మియాజమాటిక్ అడ్డంకివుండవచ్చును. అప్పుడు లోతుగా పనిచేసే మియాజమాటిక్ మందులు, అనగా సల్పర్, తూజా, మెర్క్ సాల్, మేడోరినుం,సిఫిలినుం వంటి మందులు పెద్ద పోటేన్సిలో ఒకటిరెండు మోతాదులు వాడి, తిరిగి వేదనాసముదాయమునకుసరిపోలు మందులు వాడుకోనవలెను.
3.అసలు ఎన్నుకున్న మందు సరియైనది కాకపోవచ్చును. అప్పుడు తిరిగి ఆలోచించి మందును ఎన్నికచేసి వాడుకొనవలసి వచ్చును.
ఇక ఇచ్చిన మందువల్ల మార్పు కానవచ్చిన యెడల అది
1) రోగి ఎక్కువ సున్నిత స్వభావుడు కావడం వల్ల మందు నిరూపణ (ప్రూవింగ్) దిలో వెళ్ళుచుండవచ్చును. అట్లయిన పెద్ద పొటెన్సీలకు పోక చిన్న పొటెన్సీలతోను మాతృదావణంతోను (Q) ప్రయత్నించవలెను.
2) అది వ్యాధి నివారణదిశగా వుండవచ్చును - అట్లయిన వేదనలు తిరిగి అగుపించు వరకు ఆగి మందు మరల వాడవలెను. వేదనలు తిరిగి రాని ఎడల ఇక మందులు మానివేసి ఆరోగ్యము సమకూరినదని భావించవచ్చును.
3) మందు దారితప్పి (హెర్రింగ్ సూత్రమునకు విరుద్దముగా) పని చేయుచుండవచ్చును - ఇట్టి సందర్భములో మందు కేవలం బాహ్యవేదనల ఆధారంగా మాత్రమే నిర్ణయమైనదని భావించి యిచ్చిన మందుకు విరుగుడు మందు యిచ్చి కొత్త మందును ఎన్నిక చేసుకొనవలెను. (డా.హెర్రింగ్ సుత్రములు తదుపరి పుటలలో వివరించడమైనవని గమనించ గలరు)
4) ఉన్న వేదనలు గాక నూతన ఎదనలు మొదలు కావచ్చును. ఇట్టి పరిస్థితులలో ఎన్నిక లోపభూయిష్పమని గ్రహించి ఇచ్చిన మందుకు విరుగుడు మందు యిచ్చి తిరిగి మందును జాగ్రత్తగా ఎన్నిక చేసుకొనవలెను.
మందు ఉపయోగించిన తర్వాత కలిగెడి ఉద్రేక (అగ్రవేషన్) శాంతుల (ఆమిలియోరేషన్) పై ఆధార పడి కూడా వైద్యుడు కొన్ని నిర్ణయములు చేసుకోవలసి వచ్చును.
వేదనలు ఉదేకించుట (ఆగవేషన్) మూడు రకములుగా వుండును.
1. చాలా సమయము ఉద్రేకము కొనసాగి రోగి మరింత డీలా పడితే: పెద్ద పొటెన్సీలకు వెళ్ళక దాన్ని సందేహించ వలసిన కేసుగా భావించి చిన్న పొటెన్సీలతోను, మాతృ దావణము (Q) లతోను ప్రయత్నించ వలెను.
2. చాలా సమయం ఉద్రేకించినా మానసికంగా కోలుకొంటున్నటు రోగి అనుభూతి చెందితే: దాన్ని చివరి హదులకు లోబడియున్న కేసుగా గుర్తించి జాగ్రత్తగా గమనిస్తూ అదేమందును కొంత నిదానించి 'అవసరమని వైద్యుడు భావించినప్పుడే అదే పొటెన్సీలోగానీ, కాస పెంచిన పొటెన్సీలో గానీ వాడి ఆరోగ్యవంతుని చేయవలెను.
3. ఉద్రేకం కొద్దిగాను కోలుకోవటం ఆశాజనకంగా వుంటే: వైద్యుడు సరైన పొటెన్సీని మందును ఎన్నుకొనెనని భావించవలెను. వేదనలు తిరిగి కనబడిన సమయంలోనే మందు తిరిగి వాడవచ్చును. లేదా అంతటితోనే ఆరోగ్యము కుదిరినదని భావించవచ్చును
ఇక మందువల్ల రోగం శాంతించడం గురించి ఆలోచిద్దాం:
1. పూర్తిగా వేదనలు శాంతించడం: అంటే మందు మరియు పొటెన్సీ సరిగ్గ కుదిరినదని అర్థము చేసుకొనవలెను. ఇక వ్యాధి నివారణమైనట్లే.
2. శాంతించడం కేవలం తాత్కాలిక మైతే: మందును మళ్ళీ మళ్ళీ వేయవలసి వుంటుంది. కొంత ఎక్కువ పొటెన్సీకి మరియు లోతుగా పనిచేసే మియాజమాటిక్ మందులతో ప్రయత్నించవలెను.
3. ఏమిచేసినా శాంతించడం కేవలం నామమాత్రమైతే లేక అసలే శాంతించకపోతే: ఈ వ్యాధి హోమియోపతి పరిధిలోనికి రాదని నిర్ధారించుకొనవలెను. ఇతర వైద్యశాస్త్రజ్ఞుల వద్దకు పంపివేయవలెను. అసలు అవన్నీ అయిపోయి హోమియో వైపునకు వచ్చియుంటే వారికి కేవలం ఉపశమనం కోసం ప్రయత్నించవచ్చును. బాగుకాని జబ్బులకు ఉపశమనం తప్ప పేరు మార్గం లేదంటే హోమియోనే మంచిది. వారికి శాంతిదాయకమైన స్థితిని మరణ సమయమున హోమియో ప్రసాదించును. ఉదాహరణకు ఇక లాభము లేదని, మరణము తప్పదన్న క్యాన్సర్ రోగికి హోమియో వైద్యము ఆఖరుదినములలో ప్రశాంతత జేకూర్చును. .
ఆరోగ్య మార్గము చేకురు మార్గము-డా|| హెర్రింగ్స్ సూత్రములు:
అమెరికా వైద్యుడైన కాన్ స్టన్ టైన్ హెర్రింగ్ గారు హోమియో విధానంలో వ్యాధులు నయమగుచున్నవని గుర్తించుటకు కొన్ని సూత్రములను తెల్పెను. అవి:
1. వ్యాధి పైనుండి క్రిందికి దిగుతూ బయటికి వెళ్ళిపోవును (నయమగును): ఉదాహరణకు హృదయములోని బాధ భుజము చేయి నుండి చేతి వ్రేళ్ళ వరకు దిగివచ్చి నివారణయగును. తొడలలోని నొప్పి కాళ్ళు, పిక్కలు, పాదముల నుండి చివరి వ్రేళ్ళ దాక వచ్చి మాయమగును.
2. లోపలి నుండి బయటికి: ఉదాహరణకు ఊపిరితిత్తులలోని మంట గళ్ళలు గొంతు ద్వారా నోటిలోనికి వ్యాపించి బయటికి వెళ్ళిపోవును.
3. సున్నితమైన ప్రధాన అవయవముల నుండి అప్రధాన అవయవములకు ప్రాకి అక్కడనుండి బయటకు వెళ్ళిపోవుట: ఉదాహరణకు ఊపిరితిత్తుల వాపు, నొప్పి, టాన్సిల్సుకుమారి అక్కడనుండి నయమగుట.
4. వేదనలు కనబడుచూ వచ్చిన క్రమమునకు వ్యతిరేక దిశలో బయటికి వెళ్ళుట: ఉదాహరణకు మొదట దగ్గుగా వచ్చి తర్వాత శరీరముపై దద్దుర్లు కనబడిన యెడల, నయమగునపుడు, దద్దుర్లు ముందుగా నయమై తర్వాత దగ్గు బయటపడి నయమగును. ఇట్లు కాక దీనికి వ్యతిరేక దిశలో కనబడిన యెడల అది నయము కావడము లేదు, అని తెలుసుకోవలసి యున్నది.
రోగికి సూచించవలసిన జాగ్రత్తలు:
రోగికి హోమియో వైద్యవిధానము గురించి సంక్షిప్తముగా తెలియజేయుట ఎంతైనా శ్రేయస్కరము. దానితోపాటు రోగి ప్రస్తుతము బాధ పడుతున్న వేదనలకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణము కావచ్చును. ఉదాహారణకు సముద్రము గాలి ఒక రోగికి సరిపడక పోవచ్చును - మరొక రోగి సిమెంటు ఫ్యాక్టరీలో పని చేయుట వల్ల ఆ సిమెంటు ధూళి అతని వేదనలకు కారణం కావచ్చును. కొందరికి తేమగల యిళ్ళు, వాతావరణం వారి జబ్బుకు కారణం కావచ్చు. మరొకరికి గ్రామ కక్షల వల్ల భయంతో కంపిస్తూ వుండి జబ్బుపడవచ్చును. అటువంటప్పుడు వారిని ఆ ప్రదేశములు, ఆ పరిస్థితులకు దూరము చేయవలసి యుండును. లేనిచో మందుల దారి మందుంది, రోగముదారి రోగముది కావచ్చును. అంతేగాక కొన్ని మందులకు విరుగుళ్ళు రోగి ఆహారపు అలవాట్లయి వుండవచ్చును, అప్పుడు కూడా వారిని ఆ పదార్థములు మానవలెనని సలహా యివ్వవలెను. ఉదాహరణకు అలియం సీసా వాడునపుడు ఉల్లిగడ్డలు వాడరాదు. అటే చాలా మందులకు విరుగుడు కాఫీ, కనుక కాఫీ అలవాటును కొంతకు కొంతైనా మానమని చెప్పక తప్పదు. అట్లే మసాలా దినుసులు, పచ్చకర్పూరంతో తాంబూలం, పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ పంటి ఘాటు పదార్థాలు హోమియో సున్నిత మందులకు ఆటంకము. కనుక వాటిని మానమని రోగికి సలహా యివ్వవలసి యుండును.
బయోకెమిక్స్
ఇక బయోకెమిక్స్ మందుల గూర్చి కూడా కొంత తెలుసుకుందాం - ఈ మందులు 1:9 నిష్పత్తిలో తయారు చేయబడి 3x, 6x, 12x, 30x, 200x, పొటెన్సీలలో మార్కెట్లో లభ్యమౌతున్నవి. ఈ బైకో మందులను జర్మన్ దేశస్తుడైన డా|| స్కూస్ లర్ 1873 లో కనిపెట్టెను. ఈ సిద్ధాంతము ప్రకారము ఆరోగ్యము శరీరధాతువులలోని 12 లవణములు తగురీతిలో వుండడం వల్ల నిలకడగా నుండును. అవి ఉండవలసిన ప్రమాణంలో
వుండక హెచ్చు తగ్గులు కావడంతో మనిషి జబ్బుపడును. వైద్యుడు ఆ లవణముల లోపమును జబ్బు లక్షణముల ద్వారా గుర్తించి వాటిని తగు పొటెన్సీలో యిచ్చిన యెడల ఆరోగ్యము సమకూరును. ఈ లవణములు యిచ్చుట వలన రోగి తను భుజించు ఆహారములోని ఇదే లవణములు సులువుగా గ్రహించి రోగమునుండి బయటపడును. అందుకే మందులు పొటెంటైజ్ చేయబడిన వనుకోవచ్చును. ఏదియేమైనా ఈ వైద్యము "లోపముల సవరణ వైద్యముగా కనబడును. అంటే అలోపతిలో విటమిన్లు, ఖనిజలవణములు, ప్రోటీన్లు, సమకూర్చుట వంటిది. హనిమాన్, ప్రాణశక్తి కుంటువడుట వల్ల రోగము ప్రాప్తించునను సిద్ధాంతమునకు భిన్నముగ నున్నదనుట గమనించదగును- ఈ 12 మందులు 1)ఫెర్రంపాసు 2)కాల్కేరియాపాసు 3)నే ట్రంపాసు 4)కాలీపాసు 5)కాలీమూరు 6)నేట్రంమూరు 7)కాల్కేరియా ఫ్లోరు 8) సైలీషియా 9)కాల్కేరియా సల్పు 10)నేట్రం సల్పు 11)కాలి సల్పు 12) మెగ్నీషియాపాసు అయి వున్నవి. ఈ మందులు హోమియోలో కూడా 1:99 నిష్పత్తిలో తయారు చేసి 3c, 12c, 30c, 200c, 1M,10M, CM లలో కూడా వాడుకొనుచున్నారు. ఈ మందులలో కాల్కేరియా సల్పు మందును డా|| స్కూస్ లర్ గారు తన చివరి దశలో తొలగించి వేసెను. దీనికి బదులు నేట్రంపాసు, సైలీషియా కలిపి వాడిన సరిపోవునను నిర్ధారణకు వచ్చెను. కానీ ఈ కాల్కేరియా సల్స్ మందును తర్వాతి వైద్యులు తీసివేయక లోతైన పుండ్లు మాన్పుటకు చక్కటి మందుగా నేటికీ వాడుకొనుచున్నారు.
ముగింపున ముఖ్యాంశములు
1) హోమియో విధానమున రోగి మొత్త మునకు మందుగానీ, రోగమునకు కాదు
2) హోమియోవిధానములోనివారణ శీఘముగాను, సౌమ్యముగాను, సంపూర్ణముగాను జరుగును. అంతేగాక సులభముగా వివరింపదగు విధానమున జరుగును.
3) రోగి వేదనా సముదయమును, ఔషధము ఆరోగ్యవంతునిలో ఉత్పాదించిన వేదనా సముదయమును, పోల్చి చూచుకొనుటేగాక మియాజముల నడ్డు తొలగించుకొని, నేర్పుగా వైద్యము చేయువాడే గొప్ప హోమియో వైద్యుడగును. అందుకే ఈ విధానము గొప్ప వైద్యవిధానమే గాక అద్భుత కళ కూడా అయివున్నది.
4) విషపదార్థ సేవనమునకు హోమియోతో ప్రయత్నించక పోవుటే
మేలు. అట్టి సమయములలో వాంతికి చేయించుట, కడుపు శుభము చేయించుట వంటి ఉపచార క్రియలే ఉత్తమము. నైసరిక వ్యాధులను ఆపవచ్చుగాని విషపదార్థాల ప్రభావాన్ని ఆపలేము.
5) నైసర్గిక వ్యాధులకన్న సూక్ష్మీకరించిన ఔషధములు మరింత శక్తి వంతములు. కనుకనే ఔషధ శక్తి నైసర్గిక వ్యాధులను తమ అధీనములోనికి తీసుకొని కొలది సమయములోనే బయటికి నెట్టి వేయబడి రోగము బాగగును. సూక్ష్మీకరించిన ఔషధ శక్తికి అసలు రోగశక్తికి వలె లోతైన మూలముండదు, కనుకనే కృత్రిమమైన ఔషధశక్తి అధీనమునగల రోగవేదనలను మొత్తం, ప్రాణశక్తి బయటికి తోసివేయగల్గును.
6) శస్త్ర చికిత్స వరకు ముదరని అనేక వ్యాధులను హోమియో బాగు చేయును. కనుక వైద్యుడు గ్రహించి మితిమీరి, ముదిరి, శస్త్ర చికిత్స అవసరమని తోచిన వాటిని శస్త్ర చికిత్సకు పంపి, శస్త్ర చికిత్సానంతరము గాయము మాన్పుటకు హోమియో మందులు వాడవచ్చును
7) హోమియో మందులు ఎన్నిదినములు పనిచేసేది, ఆమందుల మియాజములు, ఆ మందులకు సహచరులుగా పనిచేయు మందులు, ఒక మందునకు ముందు వెనుక వాడదగిన, వాడదగని మందులు, మందులకు విరుగుడు మందులు మొదలైన విషయాలన్నీ డా|| విలియమ్ బోరిక్ వారి పాకెట్ మాన్యువల్ ఆఫ్ హోమియోపతిక్ మెటీరియా మెడికా అను గ్రంధము చివరిపాఠములుగా చేర్చబడియున్నవి. కనుక గమనించి వైద్యులు వాడుకొనవలెను.
సమాప్తం

No comments:
Post a Comment