Tuesday, September 28, 2021

అనుభవ గృహ వైద్యము--1

 

అనుభవ గృహ వైద్యము

రచన : కీ:శే: పోలిచర్ల పిచ్చయ్య గారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. కడప

 

16 Dhanwantri ideas | hindu gods, god pictures, hindu deities

ధన్వంతరి

 

 

ప్రార్థన

ఓ నాథా నీవే మానవ జీవనమునకు లక్ష్యము

 మా కోరికలు ఆత్మోన్నతికి ప్రతి బంధకములై వున్నవి

 నీవే మా ఏకైక స్వామివి, దైవమవు

 నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము

 

   శ్లో॥ నమామి ధన్వంతరి మాదిదేవం

       సురాసురైర్వన్దిత పాదపద్మమ్

       లోకే జరారుగ్భయ మృత్యునాశం 

       దాతారమీశం వివిధౌషధీనామ్

 

   శ్లో॥ అసతోమా సద్గమయా

          తమసోమా జ్యోతిర్గమయా

         మృత్యోర్మా అమృతంగమయా

         ఓం శాంతి ! శాంతి !! శాంతి:!!!

 

నామాట

 

నేను ముందు పల్లెటూరులో జన్మించి అక్కడ తెలుగు మాత్రం వ్రాయను, చదవను నేర్చుకొంటిని. నేను ఆయుర్వేద వైద్యునిగా కావడానికి కారణం మా ఇంట్లో పూర్వము మా పెద్దవారు సేకరించిన తాళపత్ర గ్రంథములు. అవి చదివి వాటిలో గల ముఖ్యమైన యోగములు ఎత్తి వ్రాసుకొని అందులో తెలియని విషయాలు అనుభవ వైద్యుల వద్ద చెప్పించుకొని మూలికలతో కొన్ని ఔషదములు చేసి ఉచితంగా యిస్తూ కొంచెం అనుభవం గడించితిని. తర్వాత నేను కడపకు వచ్చి సంసారము చేయుచూ ఒక చిన్న ఉద్యోగము సంపాదించుకొంటిని. ఉద్యోగం చేస్తూ తీరిక సమయంలో, సెలవు దినములలో కొన్ని మందులు చేసి కొన్ని ఉచితమగును, కొన్ని డబ్బులు తీసుకొని ఇస్తూ యుండెడివాడిని. నేను వైద్యుడనని కోపరేటివ్ డిపార్టుమెంటులో అందరికి తెలుసును. తర్వాత 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి 1991వ సంవత్సరములో రిటైర్మెంటు అయి నాకు తెలిసిన విద్య అనుభవమైన మూలికలతో పల్లెలలోనూ, పట్టణాలలోనూ ప్రతి గృహములో వారికి వచ్చే వ్యాధులకు వారే తయారు చేసుకొనులాగున అనేక గ్రంథముల నుండి, అనుభవ వైద్యుల నుండి అనగా సముద్రంలో మునిగి ముత్యములు తెచ్చినట్లుగా నేను అందరి అనుగ్రహము వలన యీ చిన్న పుస్తకం వ్రాసితిని. ఇందులో ప్రమాదము లేనటువంటి అనగా రస, విష పాషాణములు లేకుండా చెట్ల మూలికలచే తయారు చేసుకొని చేయించుకొని ఆరోగ్యవంతు లయ్యేదరని తలంచుచున్నాను.

 

                                                                                   రచయిత

                                                                                                పోలిచర్ల పిచ్చయ్య

                      రిజిష్టర్ మెడికల్ ప్రాక్టీషనర్, కడప.

 

 

 

 

మనవి

మనము మానవులుగా జన్మించినాము. మనము పురుషార్ధ చతుష్టయము సాధించుటకు శరీరమే ఆదిమూలము. ఇది రక్త, మాంస, అస్తి, చర్మయుక్తమై పూర్వ జన్మ పాపంబుల వలన పలు తెరంగుల రోగంబులచే బాధింపబడును.కావున ప్రాణంబులుండు వరకు దానిని కాపాడుకొనక తప్పదు.అట్లుగాకున్న యెంతటి మనో నిశ్చిలత్వము గలవారైనా రోగపీడ చేజిక్కి తన్మూలమున మోక్ష సాధన, కార్య విఘ్నములు కలుగును. ఎంతటి ధనవంతుడైన, ఎంత సుందరుడైన, ఎంత విద్యావంతుడైన, యోగియైన శరీర ఆరోగ్యము లేకున్న రోగపీడితుడై దు:ఖించుచుండును. గాన అట్టి రోగంబులను పోగొట్టి ఆరోగ్యవంతుల చేయుటకు మహాఋషులు మనకు ఆయుర్వేదము, ఆయువును వృద్ధి చేయునట్టి గ్రంథములను ప్రసాదించినారు. అట్టి ఆయుర్వేదములోని చికిత్సలు చేసుకొని చేయించుకొని ఆర్యోగవంతులు అగుటకు అనుభవమైన మూలికలతో ఈ చిన్న పుస్తకము వ్రాసితిని. అందుకొనండి- నమస్తే.

--పి.పిచ్చయ్య R.M.P


విషయ సూచిక


వ.నెం. 

1.జ్వరలక్షణములు

2. జ్వరలుహరించే ఆహారము                                                                                                             

3. జ్వర చికిత్స

4. సన్ని విషదోష చికిత్స

5. మదమూర్చకు చికిత్స

6. గుండెశూల చికిత్స

7. నేత్రరోగ చికత్స

8. క్రిందినాలుక పడిన

9. పైత్య వ్యాధులు

10. పసరికలు- కామెర్లు

11. వాతరోగ నివారణ

12. మోకాళ్ళు, నడుము

13. కడుపు నొప్పి

14. పక్షవాతం

15. ఉబ్బసం, శ్వాసకాసలు

16. మేహములు

17. బహుమూత్రం

18. మధుమేహం

19. బి.పి.రక్తపోటు

20. అజీర్ణం

21. కలరా

22. మొలలవ్యా ధి

23. నోటిరోగములు

24. వడిశ గడ్డలు

25. గోరుచుట్టు

26. నుసిమిర్లు

27. పులిపిరికాయలు

28. యవ్వన పిటికలు

29. శోభిమచ్చలు

30. గండమాలలు

31. తలనొప్పి

32. ధనుర్వాతం

33. పడిపోయేవ్యాధి

34. ముక్కువ్యాధులు

 35. చెవి వ్యాధులు

 36. ఇంద్రియనష్టం

37. అతిసారం

 38. మేకులు గచ్చుకొన్న నొప్పులకు శూలలకు

39. ఎక్కిళ్ళు

40. సూతికా కషాయం

41. స్త్రీ రోగములు

 42. వాంతులు

43. నిద్రకు

44. గర్బిణీ వ్యాధులు

45. ముట్టురాని స్త్రీలకు

46. బాలింత చికత్స

47. చనుబాలు పడుటకు

48. సంతానం

49. కుసుమవ్యాధి

50. యోని రక్తము

51. పిల్లల వ్యాధులు

52. గర్భనిరోధక చిట్కా

53. అంటువ్యాధి నివారణ

54. ప్లేగు

 55. అండ వృద్ధి

 56. నారిపుండ్లు

 57. కొరుకుడుపుండ్లు

 58. చెల్లి 59. మేహజిల, మూగతీట

60. గజ్జి

61. తేలు విషం

 62. పిచ్చికుక్క కాటు

 63. ఎలుక విషం

 64. తొండ విషం

 65. పాము విషం

66. బొల్లి

 67. ఆనెలు

68. కాళ్ళు, చేతులు మంట

69. కడుపులో మంట

 70. నత్తి

71. నరముల బలం

72. జ్ఞాపకశక్తి

 73. వెంట్రుకలకు

74. పార్శపునొప్పి

 75. అరచేతులు, కాళ్ళు పొరలు ఊడుట

76. సుఖనిద్రకు

 77. చెవుడు

78. పొడిదగ్గు

79. కడుపునొప్పి

80. నేలతంగేడుయోగం

 81. చింతయోగం

 82. జిల్లేడు యోగం

83. మర్రియోగం

84. కడుపులో పుండ్లు

 85. క్షయ

86. సునాముఖియోగం

 87. కరక రసాయనం

88. నిమ్మపండు చిట్కా

89. గుంటగలగర

90. వేప

91. ఎలక్ట్రిక్ జీవామృతం

92. గృహ వైద్యం

1) రేచీకటి

2) వాపు

3) వెంట్రుకలు

4) తులసి

 5) కుంకుడు

6) మజ్జిగ

 7) నువ్వలనూనె

 8) శనగలు

 9) కొర్రలు

10) అల్లం

 11) మెంతులు

 12) ధనియాలు

13) వేపనూనె

92.  గృహవైద్యం

14) రాగిచెట్టు

 15) మునగ

 16) నిమ్మ

17) అవిశ

18) కానగ

19) మేడి

 20) కుసుమ

21) జిలకర

22) పసుపు

23) ఇందువ

24) వాము

25) బెల్లం

 26) బెండ

27) ఆముదం

 28) సున్నం

 29) తమలపాకు

30) పోకచెక్క

 31) ఇనుపముక్క

32) మంచిగంధం

33) తులసి

34) చింతకాయ

 93. అనుభవ గృహవైద్యం

1) నరములకు బలం

2) స్తనముల వాపు

 3) వీర్యవృద్ధి

4) రుతుదోషం

5) చర్మవ్యాధి

 6) దెబ్బలు, గాయాలు

7) వాపులు

8) నేత్రరోగాలు

 9) మూలవ్యాధి

10) సెగవ్యా ధి

11) విషపుకాట్లు

 12) బోదకాలు

13) ఎలుకవిషం

14) మసూచికం

 94. దేహరక్షణతంత్రం 

95. కీళ్ళనొప్పులకు తంత్రం 

96. విషముల విరుగుళ్లు

 97. బలానికి 

98. సర్వవ్యాధి సంహారణ

 99. స్నానచూర్ణం

100. ఆరోగ్య సూత్రములు

 

   

జ్వర లక్షణములు:

 తాపము గల్గించుట, చమట పట్టకుండుట, శరీరమంతటను నొప్పులు, విరుపులు వుండుట, పులకరము ఇవి జ్వరము వచ్చుటకు పూర్వ రూపములు. అందు వాత జ్వరంలో ఆవులింతలు వుండును. పైత్యజ్వరంలో కన్నులు మండుచుండును. శ్లేష్మజ్వరమునకు అరుచి యుండును.

వాత జ్వరములు: శరీరం వెచ్చగను, ముఖము నల్లగను, గగుర్బాటు, నడుము బలహీనం, శోష, ఎగవూపిరి, వాంతి, దురద, తిమ్మిరి, మూత్రం పచ్చగా, నోరు తీపు, అరుచి, వడలు యిరుపులు, ఆవులింతలు, మలమూత్రం బంధన గలిగియుండును.

పైత్య జ్వర లక్షణాలు:

 తలనొప్పి, చేతులు, కాళ్ళు మంటలు, శరీరమతా మంట, త్రిప్పినట్లుండుట, శరీరం వేడి, ఎర్రని మూత్రం, ఎర్రగా మలం వెడలుట, అరుచి, అతి సంభాషణ, ఆకలి లేకుండుట,దుస్వప్నములు, నోరుచేదు, విరేచనాలు, మిక్కిలి నిద్రయుండును.

శ్లేష్మ జ్వర లక్షణాలు:

 శరీరం వెచ్చగను, ముఖము నల్లగను, గగుర్బాటు, నడుము బలహీనం, శోష, ఎగవూపిరి, వాంతి, దురద, తిమ్మిరి, మూత్రం పచ్చగా, నోరు తీపు, అరుచి, వడలు యిరుపులు, ఆవులింతలు, మలమూత్రం బంధన గలిగియుండును.

పైత్య జ్వర లక్షణాలు:

 తలనొప్పి, చేతులు, కాళ్ళు మంటలు, శరీరమతా మంట, త్రిప్పినట్లుండుట, శరీరం వేడి, ఎర్రని మూత్రం, ఎర్రగా మలం వెడలుట, అరుచి, అతి సంభాషణ, ఆకలి లేకుండుట,దుస్వప్నములు, నోరుచేదు, విరేచనాలు, మిక్కిలి నిద్రయుండును.

శ్లేష్మ జ్వర లక్షణాలు:

 తల నొప్పి, ముఖము తెల్లబారియుండుట, నోరుతీపు, వల్లు విరుపులు, ఎక్కిళ్లు, అతిదాహం, అగ్నిమాంద్యం, తాపము, దగ్గు రొమ్ము నొప్పి, గొంతు ఎండుట, ఎగవూపిరి, గొంతులో గురక, ఉబ్బసం, శరీరం పచ్చబారి యుండుట.

జ్వరాలు హరించే ఆహారం:

 100 గ్రామలు బియ్యం,  50 గ్రాములు పెసలు యీరెండు వేయించి తర్వాత మెత్తగా చూర్ణించి జల్లెడ పట్టి రవ్వలాగా చేసి, పొయ్యి మీద ఎసరు పెట్టి నీళ్లు బాగా కాగిన తర్వాత యీ పొడివేసి కలుపుతూ బాగా వుడికిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ, సైంధవలవణం, ధనియాల పొడి, బిర్యానిఆకు, సొంటి, పిప్పలి, మిరియాలు యీ 7 దినుసులు కల్పి పొడిగొట్టి పై పాత్రలో కలుపవలెను. బాగా వుడికిన తర్వాత దించి జ్వరము వచ్చినవారికి యిస్తే బాగ తాగుతారు. దీనివలన జ్వరం తగ్గుతుంది. మరియు శరీరములోని  త్రిధాతువులు క్రమబద్దము అవుతాయి. ఉదరాలు హరించును.

పిల్లల జ్వరాలు,దగ్గులకు: 

 తులసి ఆకుల రసం 100 గ్రాములు, కలకండ పొడి 25 గ్రాములు ఈ రెండు కలిపి పాకంగా కాచి పూటకు 2 గ్రాముల చొప్పున రోజు రెండు పూటల కొంచెం నీళ్ళు కలిపి తాగించిన పిల్లల దగ్గులు,జ్వరాలు పోవును.

త్రిదోష జ్వరాలకు:

 విష్ణుకాంత, పులిమిరి, జిల్లెడు, చిత్రమూలం, పిప్పళ్లు, మునగ వేరు, వెల్లుల్లి వీనిని కషాయంగా కాచి యిచ్చిన మానును.

అభిమాత జ్వరానికి:

 జిల్లెడివేరు పట్ట చూర్ణించి పూటకు 10 గోధుమ గింజల ఎత్తు అయిదారు పూటలు తీసుకొన్న హరించును.

అమిక జ్వరము:

 ధనియాలు, లవంగాలు, సొంఠి సమభాగాలు చూర్ణించి కొంచెము ఉడుకు నీళ్ళతో సేవించిన మానును. .

త్రామిక జ్వరము:

 వాయువిడంగాలు, బాలింతబోలు, తిప్పతీగ,రక్తచందనం, సొంఠి వీనిని కషాయం బెట్టి యిచ్చిన మానును.

జ్వరాలకు చికిత్స:

 గానుగ గింజ పప్పు నీళ్ళతో నూరి రసం తీసి జ్వరము రావడమునకు అరగంట ముందుగా రెండు చుక్కలు ముక్కుల యందు వేసిన ఆ రోజుననే చలిజ్వరం రాదు. గానుగ గింజల పచ్చికాయగాని యెండిన కాయగాని నూరి వాసన చూచుచుండిన జ్వరము రాదు. పైన చెప్పిన కాయ నూరి శనగలవలె మాత్రలు చేసి జ్వరము రావడమునకు అరగంట ముందుగా నీళ్ళతో ఒక మాత్ర మింగిన చలి జ్వరం రాదు.

చలి జ్వరాలకు:

 మూడు తమలపాకులు యందు అయిదు ఉత్తరేణి ఆకులు పెట్టి నమిలి మింగవలెను. ఇట్లు మూడు పూటలు తినేది చలిజ్వరం రాదు. ( అన్నం తిని పండుకొనేది)

మన్య జ్వరాలకు:

మిరియాలు 3, వెల్లుల్లి రెబ్బలు 2 కల్పి నూరి రెండు పూటల తినిన జ్వరం రాదు.

చలి జ్వరానికి:

ఉత్తరేణి ఆకులు, తగు మాత్రం మిరియాలు, తెల్లపాయలు కలిపి నూరి గచ్చకాయంత మాత్రలు కట్టి చలి జ్వరం రాకముందు తినిన జ్వరం రాదు.

మరియు

 పిప్పళ్లు నూరి పాతబెల్లం కలిపి తిని నీళ్లు త్రాగిన జ్వరం విడుచును.

మరియు

 7 జొన్నగింజలు, దొండాకులు 3  కల్పి నూరి తినిన జ్వరం రాదు. వావిలిఆకు పసరు ఒక వైపు చెవిన పిండిన జ్వరం రాదు.

నాల్గునాళ్ళ జ్వరానికి:

 కుక్కతులసి ఆకు రసంలో పిల్లవాండ్ల మూత్రం కల్పి తాగిన 4 నాళ్ళకు వచ్చే జ్వరం రాదు. పత్యం చారు అన్నం.

వెల్లుల్లి పొట్టు, ఎండ్రకాయల బొప్పట్లు, కారింగువ,వామ్ము పొట్టు, కుక్క తులశాకు ఇవి పొగవేసిన సీతజ్వరాలు మానును.

సీత జ్వరాలకు నశ్యం :

 వెల్లుల్లి, మిరియాలు, గలిజేరు ఆకురసంలో నూరి రసం తీసి రెండు ముక్కులలో పిండిన చలిజ్వరం రాదు.

మరియు

 తెల్లగంటెనవేర్లు, మిరియాలు చేర్చి నూరి ముక్కులకు నశ్యం వేయ సీత జ్వరం రాదు.

మరియు

సైందవలవణం, వెల్లుల్లి, మిరియాలు, జిల్లెడాకు రసంతో నూరి ముక్కులకు పిండిన నానా జ్వరాలు మానును.

చలితో వచ్చే వరస జ్వరాలకు :

 నేలకొరిమిడాకు, వెల్లుల్లి, మిరియాలు నూరి వరస జ్వరం వచ్చే రోజు యిచ్చిన వరస జ్వరం రాదు.

మరియు

 దేవదారి ఆకు పిడికెడు తెచ్చి జిలకర 1 తులం వేసి నూరి మాత్రలు చేసి మూడు రోజులు తినిన చలితో వచ్చే వరస జ్వరం రాదు.

వాత పైత్య జ్వరానికి :

నేలవేము, పర్పాటకము, శొంఠి, తిప్పతీగ, తుంగముట్టెలు ఇవి సమభాగాలు కషాయం పెట్టి యిచ్చిన వాత పైత్య జ్వరాలు మానును.

నాల్గు నాళ్ల జ్వరానికి అవిశాకు రసం 6 చుక్కలు ముక్కులకు వేయ 3 రోజులు నాల్గునాళ్లతో వరస జ్వరం రాదు. జ్వరంలో ఎక్కువ చమట గల్గిన వులవలు చూర్ణం తిని పైన పూత పూసిన తగ్గును. శిశువుల వాంతులు జ్వరానికి తుంగముట్టెలు, కర్కాటక శృంగి, అతివస వీటి చూర్ణమును తేనెతో కల్పి నాకించిన వాంతులు జ్వరం మానును.

వాత పైత్య జ్వరానికి నేలవేము, పర్పాటకము, శొంఠి,తిప్పతీగ, తుంగముట్టెలు ఇవి సమభాగాలు కషాయం పెట్టి తాగిన వాత పైత్య జ్వరాలు హరించును.

అంతర్గత జ్వరాలకు  కరక, ఉసిరిక, తాండ్రకాయల బెరడు, పిప్పళ్ళు ఈ నాలుగు చూర్ణించి తేనెతో తినిన అంతర్గత జ్వరాలు మానును.

వాత జ్వరానికి ద్రాక్షాదిపాకం ద్రాక్ష, తిప్పతీగ, మేడి బెరడు ఈ మూడు సమభాగాలు కషాయం బెట్టి ఇచ్చేది.

సన్ని విషదోషములకు:

 చేదు బీర విత్తనాలు,మిరియాలు, శుద్ధి చేసిన నాభి ఇవి సమభాగాలు నూరి ముక్కులకు నశ్యం వేసిన సన్నిపాతం ఆరోజే విడుచును.

ఆముదపు పప్పు, ఇంగువ ఇవి సమభాగాలు నిమ్మపండ్ల రసంతో నూరి కన్నులకు కలికం వేయ సన్నిపాతము మానును.

సైందవలవణం, సొంఠి, ఆవాలు, పిప్పళ్లు,కరదువ, అక్కలకర్ర,వజ, మిరియాలు, వెలిగారం ఇవి అన్ని నూరి తేనెతో నాలుకకు పూయ తక్షణం జన్ని మానును.

సన్ని పిశాచ, సర్ప విషాలకు:

 మిరియాలు 30 నేపాలపు పప్పు 24 ఆరుద్రపురుగులు ఇవి ఏకము చేసి మేక చేదున నూరి కనికలు చేసి ఒక పూట కండ్లకు కలికం వేసిన సన్ని పిశాచ సర్ప విషజ్వరాలు మానును.

 జిల్లెడి మొగ్గలు, మిరియాలు వేడి నీళ్ళలో నూరి ఆ రసం ముక్కులలో పిండిన సన్ని విష దోషములు మానును. కాకరాకు, తుమ్మిఆకు, నల్లవావిలి ఆకు వీటి రసం తీసి ముక్కులలో చుట్టబెట్టి పిండిన సన్ని విష దోషాలు మానును.

 పచ్చమనిసిల కూకుడు పండ్ల రసంతో కూకుడుపండ్లు చనుబాలుతో నూరి రసం తీసి ముక్కులలో వేయ మిట్టిపడెడు విష దోష సన్నిపాతాలు మానను.

నల్లమందు, ముసాంబ్రము, నాభి, చిత్రమూలం, వాయింటి రసంతో నూరి మాత్రలు చేసి, చిత్రమూలం వెల్లుల్లి రసములతో మాత్రసాది పునికకు రాసిన జన్ని మానును.

 మిరియాలు, నాభిగంధం ఇవి కలయ నూరి నాలికకు పూసి కన్నులకు కలికం వేసిన జన్ని మానును. మిరియాలు, కూకుడుపండు, మంగవిత్తులు రెండుపాళ్లు విడిగా నొక్కక్క భాగము నిమ్మపూలతో నూరి కనికలు చేసి కండ్లకు కలికం వేసిన సుఖ సన్ని దోషాలు మానును. .

మద మూర్చకు చికిత్స:

 వేయించిన పిప్పళ్లు, రసకర్పూరం (శుద్ధి చేసినవి), లవంగాలు, పిప్పి ఆకు, వామిటాకు, అన్ని సమభాగాలు నూరి మాత్రలు చేసి యిచ్చిన మూర్చావాతం మానును.

 మిరియాలు, తెల్లబాయలు, గొర్మిడాకు నూరి ముక్కుల యందు పిండిన ముదిరిన మూర్చలు కూడా మానును.

 గంగిరాగి విత్తనాలు నిమ్మపుల్పున నూరి ముక్కులలో మూడు చుక్కలు పిండిన మూర్చలు మానును. కుంకుడుకాయ వావిలాకు రసాన నూరి రసం తీసి ముక్కులలో వేసేది. మరి కొంచెం తాపిన మూర్చలు మానును.

కుందేటి వెర్రికి:

 చుంచెలుక చర్మం చిత్తిలో మిరియాలు వేసి ఎండించి చూర్ణం చేసి కుందేటి వెర్రి వచ్చినప్పుడు ముక్కులకు నశ్యం వేయ మానును.

కాకిసోమాలు మదమూర్చకు:

 తెల్లగడ్డలు 3 పొట్టువలసి నున్నగా నూరి ఇంగువ, మినప గింజంత కల్పి తిని పులుపు మానిన కాకిసోమాలు మద మూర్చ మానును.

గుండె శూలలకు:

 కాకరాకు పసరు, నిమ్మపులుపు కలిపి తాగిన కఠినమైన గుండె నొ ప్పి అయినా మానును.

వాము రసం తాగిన గుండె శూల మానును.

 మిరియాల పొడి పావలా ఎత్తు, వామిడివేర్లు దంచి తీసిన రసం 5 తులాలు కలిపి తాగిన గుండె శూల మానును.

సున్నం,తేనె కల్పి పట్టు వేసిన గుండె నొప్పి మానును.

వట్టివేర్లు, మోడి ఈ రెండు సమభాగాలు చూర్ణించి ఆవు నెయ్యితో తినిన హృదయ శూల మానును.

 వేయించిన జిలకర 3 గ్రాములు, పచ్చి జిలకర 3 గ్రాములు,పంచదార 5 గ్రాములు కలిపి తింటూవున్న గుండె అదురు తగ్గిపోవును.

 పిప్పిలికట్టె, యాలకగింజలు రెండు సమభాగాలు చూర్ణించి పూటకు బేడెత్తు నేతితో కల్పి తింటూ వున్న గుండె జబ్బులు హరించిపోవును.

పండిన గంగరావి ఆకుల రసం 50 గ్రాములు, కలకండ 30 గ్రాములు కలిపి నిత్యము త్రాగుతూ వున్న కఫరోగం హరించి గుండెకు బలము గలుగును.

 జింకకొమ్ము బస్మం పూటకు ముక్కాలు గ్రాము ఆవు మూత్రంలో గానీ మేక మూత్రంలో గాని ప్రతి దినము త్రాగుచుండిన గుండె నొప్పి వీపు నొప్పి హరించిపోవును.

వాము రసం త్రాగుతూ యున్న గుండె నొప్పి హరించును.

 

నల్లగొంగడి బస్మం, తెల్లగడ్డలు, గజ్జెరు, సన్న పిప్పళ్లు, గచ్చపప్పు, సొంఠి, కురాసాని వాము, జిలకర,ఇంగువ ఇవి సమపాళ్ళు నూరి మాత్ర చేసి ఇచ్చిన గుండె నొప్పి మానును.

వాత సంబంధ హృద్రోగము:

సైందవలవణం, మంచితేనె,నిమ్మపండ్ల రసంతో కలిపి త్రాగేది.

నేత్రరోగాలకు:

చిల్లగింజ, పచ్చకర్పూరం తేనేతో నూరి కండ్లకు వేయ బహు నిర్మలముగా కనపడును.

రేచీకటి:

 అవిశాకు మెత్తగా నూరి కుండలో వేసి వుడికించి రసం పిండి ఆ రసం 10 గ్రాములు ఎత్తు త్రాగిన రేచీకటి మానును.

 వజ నిమ్మపులుపుతో సాది కండ్లకు వేయ రేయిచీకటి మానును.

 కాకరాకు పసరు నూనెలో మగ్గించి కండ్లకు వేయ రేచీకటి మానును.

అవిశ పూల రసం కంట్లో వేసిన మానును.

తమలపాకులు రసం కంట్లో వేసిన మానును.

 నీరుల్లిపాయలు రసం కంట్లో వేసిన మానును. ఇది ప్రారంభదశ యందు వేసినచో చాలా మంచిది.

కండ్ల కలకలలు:

 కొత్తిమీర రసం చనుబాలతో కండ్లకు వేయ కలకలు మానును.

కంటి పువ్వులకు:

 కర్పూరం మర్రిపాలలో నూరి కంటికి కలికం వేసిన పెద్ద పెద్ద పూలు కూడా కరిగిపోవును.

నేత్ర ప్రకాశ ఆర్కం:

40 గ్రాములు సురేకారం, పొంగించిన పటిక 15 గ్రాములు, పచ్చకర్పూరం 2.5 గ్రాములు ఈ వస్తువులు ఒక సేరు నీళ్ళు పట్టె సీసాలో వేసి దాని నిండా పన్నీరు పోసి ఎండలో ఒక రోజు పెట్టి తరువాత పరిశుభ్రమైన వస్త్రములో వడపోసి వేరొక సీసాలో పోసి బాగా బిగించి భద్రపరచి కావలసినప్పుడు కంట్లో మూడు చుక్కలు వేయవలెను. ప్రతి దినము ఈ ప్రకారం కంట్లో వేయుచున్న కంటి వ్యాధులు ఎన్నడూ కలుగవు. చిన్నలు, పెద్దలు, స్త్రీలు పురుషులు అందరికీ కండ్లకు హితకరమైనది.

మూత్రమున గాని,ముడ్డిన గాని, ముక్కున కారే రక్తము కట్టును. అతి దాహం మానును.

మూత్రమున గాని,ముడ్డిన గాని, ముక్కున కారే రక్తము కట్టును. అతి దాహం మానును.

క్రిందినాలుక పడినందుకు:

 అతి మధురం, పచ్చకర్పూరం, చక్కెర, సమభాగాలు చనుబాలుతో నూరి క్రిందినాలుకకు బాగా రుద్ది ముక్కులో నశ్యము వేయ నాలుక తిరిగి సక్కగా వచ్చును.

పైత్య వ్యాధులకు:

 అల్లం,జిలకర, నెయ్యితో వేయించి ఉదయంపూట తినిన పైత్యములు హరించును. ఉసిరిక పండ్లు నేతిలో వేయించి మెత్తగా నూరి శిరస్సుకు పట్టు వేయ మహా ప్రదరములు ముక్కున కారే రక్తం కట్టును. సంశయంలేదు

పైత్యశూల:

 ఉసిరిక పండ్ల రసంలో చక్కర కల్పి త్రాగిన తక్షణం పైత్యశూలలు మానును.

పిల్లల వాంతులకు :

నేలముల్క పండ్ల రసంలో కొంచెం తేనే కల్పి తాపిన వాంతులు కట్టును. ( త్రాగినపాలు త్రాగినట్లు కక్కిన పిల్లలకు మంచిది)

వాంతులు నిలుచుటకు:

 కరేపాకు, యీనెలు, చిక్కుడాకు కషాయం బెట్టి కొంచెము త్రాగిన కొంత పుక్కిలించి పూసిన  జ్వరం వాంతి నిలుచును.

పండు నిమ్మకాయ కాల్చి మసిచేసి తేనెతో కల్పి నాకిన వాంతి నిలుచును.

తల తిరిగే పైత్యానికి:

 అల్లంరసం, నిమ్మపులుపు, తేనె కలిపి ఉదయాన్నే 3 రోజులు త్రాగి పచ్చిచింతాకు చారు అన్నం తినిన తల తిరిగే పైత్యం మానును.

పూటకు అరతులం వెల్లుల్లిపాయలు,తులం తేనెలో కల్పి తినిన ( రోజు రెండుపూటల) పైత్యము హరించును.

పసరికలకు :

తక్కలాకు నూరి గచ్చకాయంత పెరుగు క్రింద మీద వేసి మూడు దినములు తిని, చప్పిడి పత్యం వుండిన పచ్చ పసిరికలు మానును.

మరోకయోగం:

 ఆరతి కర్పూరం, సున్నం కలిపి నూరి రేగుపండంత చింత పండులో పొదిగి ఆదివారం, బేస్తవారం బర్రె చల్లతో మింగించేది. పచ్చ పసరికలు మానును. గ్యారంటీ. ఉప్పు లేకుండా మజ్జిగ అన్నం ఆ రోజున తినవలెను. మరోకయోగం:

ఆముదపుఆకు ఇగుర్లు లేక తెల్లగలిజేరు ఆకు లేక ఉసిరిక ఆకు వీటిలో ఏదైనా ఒకటి. మిరియాలు తెల్లబాయలు వేసి నూరి తిని ఆవుపాలు అన్నం తినవలెను. ఆదివారం, గురువారం.

పాండుకామిల శోభలకు:

అడ్డసరపాకు, చింతాకు, పాత ఇనుప చిట్టెం కషాయం బెట్టి మోడి పిప్పళ్లు కలిపి త్రాగి పత్యం చప్పిడి యున్న కామెర్లు వాపులు మానును.

మిరియాలు, తెల్లబాయలు, కరదువ, ఆముదపు ఆకు,సున్నం నూరి రేగుగింజంత మాత్రలు చేసి ఆదివారం,బేస్తవారం ఉదయాన్నే ఇచ్చి ఆవుపాలు అన్నం తినిన లేక ఆవిటికుడుము, వెన్న తినిన తెల్లకామెర్లు, పసరికలు మానును.

 కామెర్లకు:

 చేదు బీరకాయ తెచ్చి నలగగొట్టి రసం తీసి మక్కులలోనైనా, కండ్లలోనైనా వేసిన కామెర్లు మానును.

రాతిసున్నం ముద్ద 2 ఛిన్నాలు 10 గ్రాములు వెన్నయు పెట్టి తినిపించాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి వంతున వారం రోజులు తినిన పచ్చకామెర్లు, పాండురోగాలు పూర్తిగా హరించును.

పెసరబేడంత ఇంగువ నీళ్ళతో సాది కండ్ల వేసిన( రాత్రిపూట) అసాధ్యమైన కామెర్ల రోగాలు మానును. తెల్లగలిజేరు వేరు తెచ్చి ఆవుపాలలో వుడికించి బాగా కడిగి దానిని గంధం తీసి కండ్లకు వేసిన తెల్లకామెర్లు వాపులు మానును.

కుంభ కామెర్లు పసరికలకు:

ఆముదపు పప్పు, బర్రె పేడ రసాన గంధం తీసి కన్నులకు వేయ కామెర్లు పసరికలు మానును. ఆదివారం, బేస్తవారం మజ్జిగ అన్నం తినేది.

గంటుసికాయ గంధం తీసి కంటికి వేసిన తలనొప్పి భారము సీతలము పసిరికలు,తెల్లకామెర్లు బాగుపడును. తక్కలాకు నూరి గచ్చకాయంత పెరుగు క్రింద,మీద వేసి 3 రోజులు తింటూ చప్పిడి పత్యం వుండిన పసిరికలు మానును.

ఈగను బెల్లంలో పెట్టి మింగించేది కామెర్లు మానును. మూడు రోజులు ఇచ్చేది.

 తెల్లగట్లేరు, తుమ్మిఆకు,మిరియాలు, తెల్లవాయ నూరి మూడు వుంటలు చేసి మింగి ఆవుపాలు అన్నం తినిన కుంభ కామెర్లు వాపులు బాగౌను.

సమస్త వాత రోగములకు:

మూతి తిరిగే వాతానికి , గవ్వ కాల్చు పొడియు, వెల్లుల్లి పాయలు, మిరియాలు 7 కల్పి నూరి మారు ముక్కున మారు చెవిన వేసిన మూతి తిరిగే వాతం తగ్గిపోవును.

 గచ్చపప్పు వేయించి మెత్తగా నూరి ఆవు వెన్న కలిపి తినిన రక్తమేహం పోవును.

అతివస నూరి తేనె కలిపి తినిన మూతి తిరిగే వాతం మానును. జిల్లెడాకుల రసం,నిమ్మపులుపు కల్పి ముక్కులకు పిచకారి చేసిన మూతి తిరిగే వాతం మానును. జీవితంలో మరి ఎప్పటికి రాదు.

బాలింత వాతానికి సొంటి,పిప్పలి, మిరియాలు,గంటుబారంగి, మోడి, జిలకర, బాలింతబోలు తెల్లబాయలు వేసి నూరి మింగింన సూతికా వాతం తొందరగా మానను.

తిమ్మిరి వాతానికి ముష్టిగింజలు చూర్ణం 3 పాళ్ళు శుద్ధి చేసిన సవ్వీరం 1 భాగం చిర్రి ఆకురసంతో నూరి మిరియాలంత మాత్రలు చేసి ఒక మాత్ర తినిన తిమ్మిరి వాతం తొందరగా మానును.

మేక పంచితం 2 పళ్లు వేప ఈనెలు దంచినవి 1 పావు శనగలు 1 పావు వేసి వుడికించి శనగలు తీసి తింటూ యున్న తిమ్మిరి వాతం మానును.

 

తిమ్మిరి వాతానికి పట్టు:

 ఉమ్మెత్తకాయలో పసుపు సున్నం పిప్పలి, అన్నం పెట్టి పైన పేడ మెత్తి కుమ్ములో వుడికించి నూరి తిమ్మిరిగల తావున పట్టు వేసిన తిమ్మిరి వాతం మానును.

మరియు తైలం:

 జెముడు, ఉమ్మెత్త, జిల్లెడు, చేదు బీర, దొండ, వావిలి, కాటుక, అడ్డసరం యీ ఆకులన్ని రసం తీసి దానికి సమం ఆముదము కల్పి తైల పక్వముగా వండి దానిని పైనపూత మర్దన చేసిన తిమ్మిరి వాతాలు మానును.

ఆరెదొండాకు యీనెలు 2 పేర్లు తవ్వడు అనగా కొత్త అర్ధ సేరు వామ్ము 2 పేర్లు, పరంగి చక్క 1 సేరు కుండలో వేసి తవ్వెడు నీళ్ళు పోసి తవ్వెడు శనగలు వేసి బాగా వుడికించి తీసి శనగలు తినిన తిమ్మిరి వాతాలు మానును. (పత్యం కొర్ర అన్నం కందిపప్పు) ( తవ్వెడు అనగా కొత్త అర్ధసేరు).

శూల నొప్పులకు ఆముదపు చెట్టు వేరు, గోరింట వేరు, తిప్పతీగ వేరు,ఈశ్వరివేరు, శొంఠి వీనిని కషాయం పెట్టి అందులో సైందవ లవణం కల్పి చక్కర తేనే కొంచెం కలిపి త్రాగిన హృదయశూల, పక్కశూల ముడ్డిన వీపున గల శూలలు నొప్పులు మానును.

కీళ్ల వాతానికి:

ముసాంబ్రము మంచిది 1 భాగం,వామ్ము రెండు భాగాలు, నిమ్మ పుల్సుతో నూరి పూటకు రేగుపండంత 7 రోజులు తినిన కీళ్ళ నొప్పులు మానును.

నల్లవావిలి, తక్కలి, తెల్లవామిటాకు, యిగురువామ్ము, మిరియాలు మోడి, కటుకరోహిణి, వెల్లుల్లి ఇవి నూరి కడుపులోనికి యిచ్చి పత్యం కొర్ర అన్నం తినిన వాత నొప్పులు మానును.

మోకాళ్ళ నొప్పులకు:

ఆరె విత్తనాలు వుడుకు నీళ్ళతో నూరి పట్టు వేసిన రోజు 2 పూటల 3 దినములు చేయ మోకాలు నొప్పులు మానును.

పాత నొప్పులకు:

తిప్పతీగ, రేలఆకు, అడ్డసరము, ఈ నెలు, నీళ్ళు కాచి వంచుకొని ఆముదము కలిపి త్రాగిన పాత నొప్పులు మానును.

వీపు నొప్పికి వూపిరికుట్టుకు:

చిక్కుడాకు పసరు, సిందుప్పు, వామ్ము, నీళ్ళు కాంచి వడగట్టి త్రాగిన మానును.

నడుము నొప్పికి:

 మినపపిండి ఆవుపాలతో కలిపి 3 రోజులు 2 పూటలాతినిన మానును. (పత్యం పెసర పులగం, నెయ్యి).

 జిలకర, మెంతులు, మునగపట్ట,కరేపాకు నీళ్ళతో నూరి మాత్రలు చేసి 2 పూటల తినిన నడుం నొప్పులు మానును.

వాత పైత్య శూలలకు:

 అల్లం రసం, తెల్లబాయల రసం కల్పి పూటకు 10 గ్రాములు త్రాగిన శూలలు మానును.

సర్వ శూలలకు:

గచ్చపప్పు, ఇంగువ, శొంఠి, సైందవలవణం,వెల్లుల్లి,సన్నరాష్ట్రం నూరి రేగుపండంత తినిన మున్నూరు శూలలు మానును.

మెడిమ శూలకు:

 పాపరపండ్ల రసం, ఆముదం సమభాగాలు కలిపి తైలపక్వంగా వండి దించి కాలి మెడిమలకు మర్దించిన శూలలు మానును.

వాత పైత్య శూలలకు:

తెల్లగడ్డల రసం బెల్లం కలిపి పూటకు 10 గ్రాములు తినిన శూలలు మానును.

కీళ్ళ నొప్పులకు:

 పత్తి లేత ఆకు, ఆముదాన వేచ్చ చేసి కీళ్ళ నొప్పులకు కట్టిన మానును.

ముద్ద వాతం కీళ్ళ నొప్పులకు:

  కానుగాకు రసం, మంచి నూనె, 9 మిరియాలు, 5 తెల్లబాయలు నూరి తినేది.

నడుము నొప్పికి:

జిలకర, మెంతులు, మునగపట్ట నీళ్ళ చేత మెత్తగా నూరి మాత్రలు చేసి 3 రోజులు 2 పూటల తినేది ఆముదపు గింజల పప్పు మొదటిరోజు 1 గింజపప్పు, రెండవ రోజు 2 గింజల పప్పు ప్రకారం 7 రోజుల వరకు తిని 7వ రోజు నుంచి ఒక్కొక్క గింజపప్పు తగ్గించుకొంటూ ఒకటవ గింజ వరకు తినిన కీళ్ళ నొప్పులు తప్పక నివారించును.

గసాలు నీళ్ళలో నానబోసి ఆ నీళ్ళు త్రాగుతూ వున్న కీళ్ళ నొప్పులు మానును.

వామ్ము నూరి మంచి నూనెతో కలిపి మర్ధన చేయుచున్న కీళ్ళు నొప్పులు మానును.

గన్నేరు ఆకులు నీళ్ళతో మరగబెట్టి నూనెలో కలిపి రాసిన యెడల మోకాళ్ళ నొప్పులు నయమగును.

కడుపు నొప్పికి:

 వామ్ము, మిరియాలు, ఉప్పు ఇవి సమపాళ్ళు పరగడుపున నమిలి తిని నీళ్ళు త్రాగిన నొప్పిపోటు,విరేచనాలు నయమగును.

పక్షవాతానికి :

నీరుల్లి రసం, అల్లంరసం, తేనే సమభాగాలు కలిపి పూటకు 50 గ్రాములు త్రాగుతూ వున్న పక్షవాతం మానును.

అక్కలకర్ర నూరి చూర్ణించి తేనే కలిపి తింటూ వున్న అర్ధికవాతం, పక్షవాతం, స్తంభనవాతం, కంపన వాతం, మెడలు లాగుట, రొమ్ము నొప్పి, పిరుదులు మొదలుగా గల పాదముల వరకు గల నొప్పులు మానును.

శరీరంలో కుడి ప్రక్క వాతం వచ్చిన ఎడమ చెవిలోను, ఎడమ ప్రక్క వచ్చిన కుడిచెవిలోను దూలగొండి చెట్టు సమూలం దంచి రసం తీసి ఉదయం సాయంత్రం చెవిలో పసరు పోయవలెను. అదే రసం అరతులం కడుపులోనికి తాపేది. ఈ విధముగా చేసిన నిశ్చయముగా పక్షవాతం మానును.

సొంటి, సైందవలవణం సమభాగాలు నూరి వస్త్రగాలితం చేసి ముక్కులతో నశ్యంగా వాడవలెను.

గోమూత్రం, సిలాజిత్తు 8 గింజల ఎత్తు తేనెతో కలిపి రోజుకు ఒక పూట ప్రకారం 40 రోజులు తినిన పక్షవాతం మానును.

అతిమధురం, చెక్కర, హారతి కర్పూరం ఇవి సమభాగాలు చూర్ణించి చనుపాలతో నూరి పిండి రసం తీసి ముక్కులలో వేసిన మాటలు వచ్చును.

 

బలానికి:

పెన్నెరుగడ్డ, నూగులు, మినుములు చూర్ణించి చెక్కరపాకంతో చేర్చి 7 రోజులు త్రాగిన బలం వచ్చును.

పక్షవాతం రాకుండా వుండుటకు క్రియ:

 ప్రతిరోజు ఉదయం పండ్లు తోముకోగానే ఒక నిమ్మపండు రసం, రెండు టీస్పూనులు తేనె అరగ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగుతూ వున్న పక్షవాతం, దరిదాపుకు కూడా రాదు. కఫం దగ్గు, పైత్యం, ఎక్కిళ్ళు, వాంతులు, బలహీనతలు నయమగును.

నీరసానికి:

 రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో 30 ఎండు ద్రాక్షపండ్లు 1 ఎండు కర్జూరపు పండు విత్తనం తీసి యీ రెండు వేసి ఉదయాన్నే త్రాగిన నీరసం రాదు.

నడుము నొప్పులకు:

 ఆముదపు పప్పు పాలతో మెత్తగా నూరి ఆ ముద్ద పాలతో కాచి త్రాగించిన అసాధ్యమైన నడుము నొప్పులు కూడా నయమగును.

ఉబ్బసం దగ్గులకు:

 బొంతజముడు కాడలో బొందజేసి మిరియాలు పోసి సీలమన్ను యిచ్చి చిన్న పుటంవేసి తీసి ఆ గింజలను పూటకు 4 వంతున తినిన ఉబ్బసం మానును.

 ప్రతిరోజు ఉదయాన్నే ఒక అంజూరపు పండు తింటూ ఉన్న ఉబ్బసం, ఆయాసం, గుండెదడ తగ్గును.

 వెల్లుల్లి రసం 6 చుక్కలు గోరువెచ్చని నీళ్ళతో వేసుకొని త్రాగిన తక్షణం ఉబ్బసం వ్యాధి నిర్మూలించును

 చిమటను రెక్కలు తీసి వేసి మింగిన ఉబ్బసం మానును.

 పలుకు సాంబ్రాణి నూరి తమలపాకులో వేసి నమిలి మింగిన శ్వాసకాసలు మానును.

నల్లకోడిమలం, మిరియాలు సమభాగముగా నూరి గురిగింజ పాటి మాత్రలు చేసి తిని కొర్రగంజి అన్నం తిని పత్యము జేసిన ఉబ్బసము మానును.

జుట్టపాకు రసము సొంఠి, వస,కరక బొప్పటి, కల్లుప్పు కలనూరి అన్నింటికి సమం బెల్లం చేర్చి వుచ్చికాయంత మాత్రలు చేసి తినిన ఉబ్బసం మానును.

శ్వాసకు గంటుబారంగి, కరక,సొంఠి,పసపు, అడ్డసరము, ధనియాలు, తిప్పతీగ జిల్లేడివేర్లు, అన్ని సమాన భాగాలు కషాయం కాచి త్రాగిన కటినమైన శ్వాసకాసలు మానును.

కుంకుడుకాయ గింజలలోని పప్పు అరతులం ప్రతి నిత్యం తినిన 3 వారములలో ఉబ్బసం హరించును.

 అల్లం రసములో తేనె కల్పి త్రాగిన శ్లేష్మ దగ్గులు ఉబ్బసం, పడిశం శ్రీఘ్రముగా హరించును.

వెర్రి పుచ్చకాయ తెచ్చి అందులో గింజలు తీసివేసి మిరియాలు పోసి సీలు చేసి పొయ్యిలో జానడులోతు గుంత తీసి అందులో పెట్టి పూడ్చి 8 రోజులు వుంచి తీసి పూటకు 3 మిరియాలు వేడినీళ్ళతోగాని, మజ్జిగతోగాని తినిన దగ్గు ఉబ్బసం మానును.

ఊపురితిత్తుల్లోని శ్లేష్మం పోవుటకు ఆలుబకర పండ్లు తినిన ఊపిరితిత్తులల్లోని కఫము తగ్గును.

మొగలి పువ్వుల రసం తేనె కల్పి అర్ధఔన్సు త్రాగిన సమస్త వాతాలు పోయి ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గును.

ఉబ్బసం దగ్గులకు గంటుబారంగి, పిప్పళ్ళు, సొంఠి సమభాగాలు పొడి నూరి వుడుకు నీళ్ళలో వేసి త్రాగిన ఉష్ణవాత ఉబ్బసం మానును.

వెల్లుల్లి, మిరియాలు, గచ్చకొన యిగుర్లు నూరి రేగిపండంత మింగిన ఉబ్బసం చాలాఏండ్ల నుంచి యున్నా బాగుపడును. ( పత్యం చప్పిడి)

 జిల్లేడిపూవులు, అడ్డసరము, శుద్ధి చేసిన వుమ్మెత్త గింజలు, సన్నరాష్ట్రం, త్రికటకములు, గంటుబారంగి ఇవి సమభాగాలు నల్లకాబాకు రసంతో నూరి కందిగింజలంత మాత్రలు చేసి తినిన ఉబ్బసం మానును.

 జిల్లేడుచెట్టు విగుర్లు 1.5 తులం, వాము తులం, బెల్లం 1.5 తులం, కలిపి నూరి రెండు గురిగింజల ఎత్తు మాత్రలు చేసి 2 పూటల నోట్లో వేసుకొని రసం మింగుతూ ఉన్న కొద్ది రోజులలో ఉబ్బసం నిశ్చయముగా హరించును.

ఊపిరితిత్తులలో పిల్లికూతలు:

మునగచెక్క కషాయంలో తేనె కల్పి త్రాగిన పిల్లికూతలు తగ్గును.

 లవంగాది మాత్రలు:

మిరియాలు, లవంగాలు, తాండ్రకాయవలుపు వీనిని సమభాగాలు గాను వీనికి సమం చండ్రచెట్లచేవ చేర్చి అన్నింటిని నల్లతుమ్మచక్క కషాయంతో నూరి మాత్రలు చేసి తినిన ఒక జాములోపల కాసలు నివారించును.

దగ్గు జ్వరాలకు :

వెలిగారం, నల్లమందు చెక్కర,ముసాంబ్రము అన్ని సమాన భాగములు మేక చేదు చేత నూరి మినుములంత మాత్రలు చేసి యిచ్చిన దగ్గుజ్వరం మానును

సర్వ దగ్గులకు :

కటుకరోహిణి, త్రిఫలాలు, త్రికటుకములు, తుమ్మగింజలు సమభాగాలు చేర్చి అడ్డసరం ఆకు రసంతో నూరి చింత పిచ్చలంత మాత్రలు చేసి తినిన సర్వదగ్గులు మానును.

పూటకు గింజ ఎత్తు కస్తూరి వేపనూనెలో కల్పి రోజు రెండ పూటల త్రాగిన 5-6 రోజులలో పూర్తిగా ఉబ్బసం నివారించును ( పత్యం చప్పిడి).

ఒక ఫలం లవంగపుచెక్క మెత్తగా నూరి పూటకు రెండు అణాల ఎత్తు రెండు పూటల యిచ్చేది. పత్యం పులుపు, బెల్లం, చెక్కర,మజ్జిగ, పెరుగువాడరాదు. నిండా అనుభవం

శ్వాసకాసలకు ఉత్తరేణి కాడలు మొదళ్ళు,కొసలు తీసి మధ్య భాగం తీసుకొని కాల్చి మసి చేసి దానిని తేనెతో నెయ్యితో కల్పి తినిన శ్వాసకాసలు మానును.

త్రికటుకములు, చిత్రమూలం, దేవదారు,దుంపరాష్ట్రం, కరక్కాయలు, నాగకేసరాలు, తాండ్రకాయ, వుసిరిక (ఈరెండు వలుపు) తిప్పతీగలు, సమభాగాలు చూర్ణం చేసి తేనెతో గాని, చెక్కరతోగాని, సేవించిన సకలమైన దగ్గులు మానును.

జీర్ణించిన దగ్గులకు:

 కవిరి,జాజికాయ, యాలకగింజలు,కరకకాయ సమభాగాలు నూరి తేనెతో యిచ్చిన పురాణకాసలు తగ్గును 

దగ్గులకు:

మిరియాల చూర్ణం 3 చెంచాలునెయ్యి 1 చెంచా ,తేనె రెండు చెంచాలు పంచదార కలిపి రోజు రెండు మార్లు తీసుకొన్న అన్నిరకాల దగ్గులు నయమగును.

దోరగా వేయించిన సొంటి, మిరియాలు చూర్ణించి ఆచూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా అరటిపండులో కలిపి తినిన అన్ని రకాల దగ్గులు హరించును.

 క్షయలకు:

 యాలకలు, లంగాలు, తళిసపత్రి, పిప్పలిమూలం, కోష్టు,సొంఠి, దుంపరాష్ట్రం, సేవ్యంశృంగి, కర్కాటక శృంగి, ఇవి సమభాగాలు చూర్ణించి చింతగింజల పరిమాం తేనేతో రెండు పూటల తినేది క్షయ, శోభ,జ్వరం, పాండురోగాలు మానును.

నోటి నుండి పడే రక్తానికి:

దానిమ్మ పై బెరడు చూర్ణించి పంచదార కలిపి తినిన నోటరక్తం పడుట మానును.

వర్ధమాన పిప్పిలి:

తొలిరోజు 3 పిప్పళ్లు, రెండవ రోజు 5 పిప్పళ్ళు, మూడవ రోజు 7 పిప్పళ్ళు, నాల్గవ రోజు 10 పిప్పళ్ళు యీ ప్రకారం క్రమవృద్ధిగా తినిన శ్వాసకాస, జ్వరం, ఉదరం, మొలలు, వాతరక్తం,క్షయ ఇవి బాధింపవు.

ద్రాక్షాది కషాయం:

ద్రాక్ష,పిప్పలి, సొంటి వీనిని కషాయం పెట్టి అందులో పిప్పలిచూర్ణం చేర్చి త్రాగిన శ్వాసకాసలు, అగ్నిమాధ్యం, జీర్ణజ్వరం, దప్పిక హరించును.

 జీర్ణించిన దగ్గులకు:

 కవిరి,జాజికాయ, యాలకగింజలు,కరకకాయ సమభాగాలు నూరి తేనెతో యిచ్చిన పురాణకాసలు తగ్గును 

 దగ్గులకు:

మిరియాల చూర్ణం 3 చెంచాలునెయ్యి 1 చెంచా ,తేనె రెండు చెంచాలు పంచదార కలిపి రోజు రెండు మార్లు తీసుకొన్న అన్నిరకాల దగ్గులు నయమగును.

దోరగా వేయించిన సొంటి, మిరియాలు చూర్ణించి ఆచూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా అరటిపండులో కలిపి తినిన అన్ని రకాల దగ్గులు హరించును.

పంచపత్రసార లేహం:

అడ్డసరం, గుంటగలగర,వావిలి, గోరింట, వాకుడు వీని ఆకుల రసం ప్రత్యేకముగా తీసి అందులో పిప్పలి చూర్ణంకల్పి తేనె చేర్చి సేవించిన తీవ్ర శ్వాస నివర్తించును.

ద్రాక్షాది లేహ్యం:

 ద్రాక్ష,కరక్కాయ, తుంగముట్టెలు, కర్కాటకశృంగి, దూలగొండి వీనిని చూర్ణించి నెయ్యి, తేనె కలిపి సేవించిన దారుణమగు శ్వాసలు మానును.

పిల్లల పొడి దగ్గులకు:

 తమలపాకుల రసం 5 గ్రాములు, తేనె 10 గ్రాములు కలిపి రోజు రెండు పూటల తినిపించిన దగ్గు హరించి పోవును.

పిల్లల దగ్గులు జ్వరాలకు తులసి ఆకుల రసం 100 గ్రాములు, కలకండ పొడి 25 గ్రాములు  కలిపి రోజు 2 పూటల 2 గ్రాముల చొప్పున యిచ్చిన దగ్గులు, జ్వరాలు మానును.

సకల మేహాలకు :

త్రిఫలాలు, తుంగముట్టెలు,వెదురాకు, విషబొద్ది వేర్లు వీటి కషాయం తేనెతో కలిపి త్రాగిన అన్ని మేహలు మానును.

త్రిఫలాలు,మామిడిపప్పు వీటిని చూర్ణించి ఆ చూర్ణానికి 4 రెట్లు శిలాజిత్తుబస్మం తేనెతో కలిపి తులం ప్రకారం తినిన 20 రకముల మేహాలు మానును.

 సమస్త మేహాలకు :

తంగెడు చెట్లు సమూలం తెచ్చి యెండించి చూర్ణించి పంచదార కలిపి 40 దినములు తినిన మేహములు మాని మంచి కాంతి నిచ్చును.

 శిలాజిత్తు చూర్ణం చెక్కర కలిపి పాలు చేర్చి ప్రాత:కాలమున 20 రోజులు త్రాగిన సర్వ మేహాలు మానును. బూరుగు వేర్లు రసము నందు తేనె కలిపి త్రాగిన ప్రమోహం మానును.

వూడుగ మొగ్గలు, ఉసరిక వలుపు, పసుపు వీనిని చూర్ణించి తేనేతో సేవించిన వింశతి మేహాలు నశించును. నేలతంగేడిపూలు లేక గింజలు చూర్ణం చేసి పాతబెల్లం కలిపి రాత్రి కాలమున తింటూ వున్న ప్రమేహాలు శాంతించును.

 బూడిద గుమ్మడికాయ రసం నందు వాయువిడంగాల చూర్ణం కలకండ చూర్ణం చేర్చి త్రాగిన రక్తమేహం శాంతించును.

పొంగించిన పటిక చూర్ణం పావుతులం, చక్రకేళి అరటిపండులో పెట్టి తినిన అసాధ్యమైన మేహ వ్యాధులు మానును.

గంధక యోగం:

 గంధకం, బెల్లం సమభాగాలు కలిపి తిని పాలు త్రాగిన వింశతి మేహాలు మేహ పిటికము నివర్తించును.

బహు మూత్రానికి:

 పాత గానుగపిండి, పాత రాగిపిండి, పాత బెల్లం అన్ని సమభాగాలు కలిపి పిడికెడంత తింటూ ఉన్న మూత్రం కట్టును.

 వేప బంక తెచ్చి వేయించి పొడి నూరి పంచదార కలిపి ఆవుపాలతో మూడు రోజులు త్రాగిన మూత్రం కట్టును. నేరేడు పండ్లు ఎండబెట్టుకొని చూర్ణించి చెక్కర కలిపి పూటకు అరతులం వంతున తినిన 20 రోజులలో రకరకాలుగా వచ్చే మూత్రం కట్టును.

 గోమూత్రశిలాజిత్తు వడ్లగింజంత ఆవుపాలతో కలిపి త్రాగిన సుఖజాడ్యం వల్ల వచ్చే అతిమూత్రం కట్టును.

యవక్షారం చూర్ణం, అడ్డసరపాకు రసంతో కలిపి త్రాగిన అతిమూత్రం కట్టును.

 వామ్ము,నూగులు, పేలాలు యివి సమభాగాలు చూర్ణించి తినిన బహు మూత్రం కట్టును.

జాపత్రి 6 గింజల ఎత్తు కలకండ 6 గింజల ఎత్తు మెత్తగా నూరి తినిన మాటిమాటికి వచ్చే అన్నిరకాల అతిమూత్రం అతిసారాలు మానును.

 తంగేడిపూలు నీడన ఆరబెట్టిచూర్ణము చేసి అందులో చెక్కర కల్పి పూటకు పావలా ఎత్తు 20 రోజులు తినిన అతి మూత్రం కట్టును.

 తంగేడి యిగుర్లు రసం తీసి త్రాగిన అతిమూత్రం కట్టును.

 అత్తపత్తి ఆకున్ను బెల్లం మెత్తగా నూరి వుసిరిక కాయంత మాత్రలు చేసి ప్రతిరోజు రెండు పూటల 20 రోజులు తినిన బహుమూత్రం మానును.

 కొబ్బరిపువ్వు మెత్తగా నూరి ఆవు పెరుగుతో కలిపి రోజు 3 మార్లు త్రాగిన అతిమూత్రం కట్టును.

తవుడుతో రొట్టె చేసి కాల్చి దానిని నెయ్యి రాసి తినిన అతి మూత్రం హరించును. శరీర బలం కలగును. అడ్డగెత్తు చోరుప్పు నిమ్మపులుసుతో కలిపి త్రాగిన కట్టును.

మూత్రం బిగించినన:

మంచి కలబంద గుజ్జును మంచినీళ్ళతో కడిగి కరక్కాయల పొడి కలిపి పిసికి వడగట్టి చక్కర కల్సి త్రాగిన మూత్రం వదలును.

మేహ చురుకులకు మేడికాయల రసం చెక్కర కలిపి త్రాగిన మూత్ర ఘాతం వదులును.

 తిప్పతీగ ఆవుచల్లతో దంచి రసం తీసి లవంగములు 10 గ్రాములు పంచదార కలిపి మింగిన చురుకు యిరుకు మూత్రం మానును.

బ్రహ్మమేడి మర్రి పండ్లు చూర్ణం, సూర్యకాంత చూర్ణం సమం చెక్కర కలిపి త్రాగిన మేహకాకలు మానును.

మంచి నవాసాగరం తెచ్చి పెంకులో వేయించి నూరి పెరుగులో వేసుకొని తినిన నాభిలో చురుకు మంట మానును.పులుసు వాడరాదు.

ఎంతో కాలం నుండి పీడిస్తున్న మోకాళ్ళు నడుము , తుంటి నొప్పులకు:

పచ్చి పొగాకు దంచి తీసిన రసం 50 గ్రాములు, నూగులనూనె 20 గ్రాములు ఈ రెండు కలిపి పొయ్యిమీద పెట్టి సన్నమంటతో పొగాకు రసం అంతా యిగిరే వరకు పెట్టి నూనె మాత్రమే మిగిలిన తర్వాత ఆ నూనెను వడగట్టి ప్రతిరోజు 2 పూటల ఈ నూనెను మోకాళ్ళు,నడుములు, తుంటి,పిక్కలు, తొడలు,మెడ, మెడిమెలు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మర్దన చేసి పైన ఆముదపు ఆకులు వేసి కట్టు కట్టాలి. ఈ మాదిరి పది రోజులు చేసిన ఎన్ని ఏండ్ల నుంచి వున్న పాత నొప్పులైనా హరించును.

వావిలి చెట్ల వేర్ల తాట తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీడన ఆరించి చూర్ణించి పూటకు 5 గ్రాముల వంతున రోజు రెండు పూటల కొంచెం నూగుల నూనెతో కలిపి తినాలి. దీనివలన , కాళ్ళవాతం నడుంనొప్పి సర్వాంగ వాతం,మోకాళ్ళ నొప్పులు సర్వవాత నొప్పులు హరించును

పక్షవాతానికి పట్టు:

 మిరియాలు నూగులనూనె కలిపి మెత్తటి గంధం లాగా నూరి పక్షవాతం వల్ల పడిపోయిన భాగం పైన పట్టు వేయాలి. దీని వలన పడిపోయిన భాగం మామూలుగా వస్తుంది. పక్షవాతానికి దీనికి మించిన మందు లేదు.

మూత్రఘాతం:

 సన్న జిలకర, రేవలచిన్ని, పేల్చిన వెలిగారం పెట్లుప్పు నూరి దుడ్డు ఎత్తు తిని పాలు తర్వాత నీళ్ళు త్రాగించి,  చారు, అన్నం తినిన మూత్రంలో మురికి వెడలును.

 జంబివేర్లు, ఈతవేర్లు సమము చేర్చి సన్నగా ముక్కలు చేసి మజ్జిగలో రాత్రి అంతయు నానబెట్టి మరునాడు ఉదయం త్రాగిన మూత్రం వెడలును.

 మూత్రం రాక బాధపడే వారికి రేవలచిన్ని నీళ్ళతో నూరి కొంచెం సురేకారం కలిపి పొత్తి కడుపుపై పట్టు వేసిన మూత్రం జారి అగును.

 వుసిరిక పండు మెత్తగా నూరి పొత్తి కడుపుపై వేసిన మూత్రంవచ్చును. ధనియాలు కషాయంలో రేవలచిన్ని కలిపి త్రాగిన మూత్రం వచ్చును.

నేలతంగేడు ఆకు ఆత్మజలాన నూరి యిచ్చిన రాయిపూడి మూత్రం వచ్చును.

 గానుగపప్పు ఆవుపాలతో నూరి త్రాగితే మూత్రములో రాళ్ళు పడిపోవును.

కర్పూరశిలాజిత్తు ఇంగువ నూరి మాత్రలు చేసి యిచ్చిన మూత్రములో రాళ్ళు పడును.

ముల్లంగి దుంపల రసంలో పంచదార కలిపి త్రాగిన రకరకాల ప్రమేహాలు మానును.

 బ్రహ్మ మేడికాయలు దంచిన ముద్దను మిరియాల ముద్దను ఈ రెండు కషాయం కాచి చెక్కర కలిపి త్రాగిన మూత్రం వచ్చును.

సన్నపల్లేరు కాయలు,ఆముదపు వేర్లు ,చల్లపిల్లి గడ్డలు వీనిని సమభాగాలు దంచి కషాయం కాంచి త్రాగిన వాతంచే జనించి పోట్లతో గూడియుండు మూత్రఘాతము నశించును.

 మరియు

పాలతో బెల్లం నెయ్యి వేసి త్రాగిన మూత్రకృశ్చలు అన్నియు నశించును.

మధుమేహం చికిత్స:

 తిప్పతీగ రసం రోజు రెండు పూటల త్రాగుతూ యున్న మధుమేహం తగ్గును.

 కాకరకాయ రసం రోజు 1 తులం త్రాగిన మధుమేహం తగ్గును.

మర్రి, రాగి, జువ్వి, నేరేడు,మేడి, మామిడి, చండ్ర, తుమ్మ వీని పట్టలు సమాన భాగాలు , అన్నింటికి సమానం పొడపత్రి ఆకు మెత్తగా నూరి కషాయం కాచి త్రాగిన మధుమేహం మానును. బహు శ్రేష్టమైన యోగం .

వంగబస్మం 10 గ్రాముల నేల వుసిరిక 20 గ్రాములు, మద్ది చెక్క 20 గ్రాములు రెండు కలిపి మెత్తగా నూరి అందులో కొంచెం చెక్కర కలిపి తినిన మేహం తగ్గిపోవును.

నేరేడు చెక్క కషాయం రోజు 5 తులాలు త్రాగిన మధుమేహం తగ్గును.

చాటడు బ్రహ్మదండి కాయలు తెచ్చి శేరు పాలు పోసి రుబ్బి 3 శేర్ల రసం ఎత్తుకొని ఆ రసం పొయ్యిమీద పెట్టి కాగునప్పుడు శేరు చెక్కర పోసి కలిపి దించుకుని దినము ఒకటింటికి తులం వంతున 40 దినములు తినిన మధుమేహం మానును.

మరియు

 దోసకాయ రసం 2 పాళ్ళు కలిపి త్రాగిన మధుమేహం తగ్గును.

 పచ్చి కుసుమాకులు 3, మిరియాలు 5 ఈరెండు కలిపి నూరి కొంచెం నీళ్ళు కలిపి గుడ్డలో వడబోసి ప్రతిరోజు ప్రాత:కాలమున త్రాగిన మధుమేహం కొద్దిరోజులలో హరించిపోవును.

 ప్రతిదినం కాకరకాయ రసం 1 తులం త్రాగి, గోదుమ రొట్టె,వెన్నె తినిన 3 వారాలలో చెక్కర వ్యాధి నివారించును.

దొండతీగ రసం గాని,ఆకురసం గాని ప్రతినిత్యం ఉదయం రెండు

తులాలు త్రాగుతూ యున్న రెండు మూడు మండలాల్లో చెక్కర వ్యాధి హరించును.

మారేడాకుల రసం రోజు 5 తులాలు ప్రతి ఉదయం త్రాగిన మధుమేహం హరించును.

పొడపత్రి ఆకు కషాయం 5 తులాలు గోమూత్రశిలాజిత్తు బేడ ఎత్తు కలిపి ప్రతినిత్యం ఉదయం త్రాగిన మధుమేహం హరించును.

 నేరేడు గింజల చూర్ణం పూటకు బేడ ఎత్తు మంచి నీళ్ళతో తినిన

మధుమేహం మానును.

మర్రిచెట్టు వేరుపై తాట వలిచి నీళ్ళలో వేసి కాంచి వడగట్టి త్రాగిన అతి మూత్రం మానును.

 కాకరాకు, పొడపత్రి, నేరేడు గింజలు నూరి కషాయం కాచి త్రాగిన షుగర్ వ్యాధి మానును.

కామంచి చెట్టు గింజలు చూర్ణించి కషాయం కాచి అందులో తేనె కలిపి త్రాగిన అతిమూత్రం మధుమేహం మానును.

మధుమేహం గలవారు ప్రతినిత్యం వుసిరిక వాడితే మంచిది.

పొడపత్రి ఆకుచూర్ణం 120 గ్రాములు,తిప్పసత్తు 60 గ్రాములు, నేరేడు గింజల చూర్ణం 60 గ్రాములు,సొంటి 20 గ్రాములు, గోమూత్రశిలాజిత్తు 10 గ్రాములు, లోహబస్మం 5 గ్రాములు వంగబస్మం 5 గ్రాములు కలిపి చూర్ణము చేసి పాలతో తినిన మధుమేహం హరించును.

బ్లడ్ ప్రజర్ లేక బి.పి.కి:

 సర్పగంధి మాత్రలు మాదీఫలరసాయనంతో సేవించిన తగ్గిపోవును.

కొత్తిమీర ఆకు తింటూ వున్న తగ్గిపోవును.

 వెల్లుల్లిపాయలు ఒలిసి పాలలో వుడికించి చెక్కర కలుపుకుని తినిన వాతం వల్ల బుట్టిన రక్తపోటు తగ్గిపోవును. ఆకుకూరలు తినుట, అరటిపండ్లు, ఉర్లగడ్డలు,తులసీదళములు తినిన తగ్గును.

మద్దిచెక్కపట్ట, పెన్నేరు దుంపలు, వుసిరిక వలుపు, సర్పగంధి, తిప్పసత్తు ఈ వస్తువులు సమభాగములు చూర్ణించి పూటకు 4 ఛిన్నములు రోజు రెండు పూటల తిని పాలు గాని, నీళ్లు గాని త్రాగేది, దీనివలన బ్లడ్ ప్రజర్ వ్యాధి నిశ్చయముగా హరించిపోవును. పత్యం వేడి వస్తువులు, విచారం,నిద్ర మేలుకొనుట పనికిరాదు.

రుద్రాక్ష పెద్దది గాకుండా,చిన్నదిగాకుండా మధ్య రకం కలది చేతికి కట్టుకొన్న బి.పి. తగ్గుతుంది.

అజీర్ణవ్యా ధికి చికిత్స:

 కొత్తిమీర ఆకు నూరిన ముద్ద 15 గ్రాములు తినిన అజీర్ణంమానును.

 పొదీనా ఆకు పచ్చడి తినిన అజీర్ణం మానును.

 అరటికాయ చూర్ణం 1 గ్రాము చిన్నపిల్లలు తినిన వారి అజీర్ణము మానును.

 శొంఠి చూర్ణం 2 గ్రాములు వంతున రోజుకు 3 సార్లు భోజనానంతరం తినిన అజీర్ణం తగ్గును

వామ్ము,మిరియాలు, ఉప్పు సమభాగాలు కలిపి పరగడుపున తినిన అజీర్ణం కడుపునొప్పి పోయి జీర్ణం బాగా అగును.

 కరక, సొంఠి బెల్లం సమభాగాలు కలిపి ఉదయం తినిన అగ్నిమాంద్యం వాతం పైత్యము,కఫము వీనిని పోగొట్టి కాయసిద్ధినిచ్చును.

జిడ్డువెంపలి నల్లేరు చిక్కుడు తీగగెనుపులు, మిరియాలు అర్ధతులం తినిన అగ్నిమాంద్యం అజీర్ణం మానును. ఆరుద్ర పురుగులు, సాంబ్రాణి సమభాగాలు నూరి మినపగింజంత మాత్రలు చేసి 1 మాత్ర వాడిన పిల్లల దగ్గులు పడిశం పొట్ట ఉబ్బు మొదలగు రోగాలు మానును.

కలరా లేక అజీర్ణ బేదులు:

 మిరియాలు 6 గురిగింజల ఎత్తు కంది ఆకు 10గ్రాములు మెత్తగా నూరి పావు నీళ్ళలో కలిపి త్రాగిన కలరా లేక బేదులు తొందరగా మానును.

 ఇంగువ ఆరతికర్పూరం , పిప్పల్లు యివి సమాన భాగాలు తుంగముట్టెలు 2 భాగాలు నూరి,జిలకర రసంతో కలిపి త్రాగిన కలరా గాని ప్రబలమైన అజీర్ణ బేదులు గాని నిలుచును.

మిరప విత్తనాలు నల్లమందు హారతి కర్పూరం కాటికాకురసంతో నూరి శనగలంత మాత్రలు చేసి తినిన కలరా విరేచనాలు మానును.

తుమ్మచెట్టు ఆకుకూర వండుకొని తినిన అజీర్ణం పోయి ఆకలి బాగా కలుగును.

అల్లం ముక్కను కుమ్ములో వుడికించి పావలా ఎత్తు రసం తీసి దానిలో ఉప్పు కలిపి త్రాగిన ఆకలి బాగా అగును.

నోటికి రుచికలుగుటకు:

 అల్లం రసంలో తేనే కలిపి త్రాగిన అరుచి శ్వాసకాలు దగ్గు, పడిశం నయమగును.

 అల్లం బెల్లం నూరి ప్రతిదినం తింటూ యున్న అజీర్ణాలు వాతాలు, పైత్యాలు హరించి నోటికి రుచి కలిగించును.

సొంటి బర్రె పెరుగులో 3 రోజులు వూరబెట్టి ఎండించి మెత్తగా పొడి చేసి అందులో చెక్కర కలిపి తింటూ యున్న పైత్యముపోయి నోటికి రుచి కలిగింగును.

అజీర్ణానికి కరకపెచ్చుల చూర్ణం, సైందవలవణం రెండు సమభాగాలు చూర్లించి రోజూ రెండుపూటల పూటకు పావుతులం మంచి నీళ్ళతో తినిన అన్నిరకాల అజీర్ణాలు మానును

కలరా వ్యాధి:

 సోకకుండా వుండుటకు నీరుల్లిగడ్డలను ముక్కలు ముక్కలుగా చేసి మనం నివసించే ఇంటిలో చల్లిన ఆ ఇల్లంతా వాసన వచ్చునట్లు చేసిన యెడల ఆ ఇంటిలో నివసించే వారికి కలరా సోకదు మనము నివసించే వూరిలో కలరా ప్రబలముగా యుండినప్పుడు చేయవలెను..

మరియు

15 గ్రాములు నీరుల్లిపాయలు మిరియాలు 7 ఈ రెండు కలిపి నూరి రసం పిండి అందులో అరకప్పు మంచినీళ్ళు కలిపి కలరా తగిలిన రోగికి తాపిన ఈ మందు గొంతులోకి దిగగానే వెంటనే దాహము కట్టును. కడుపులో ఆరాటం తగ్గును. విరేచనాలు నిలుచును. అవసరమైతే రెండవదఫా ఇవ్వవచ్చును. కలరా వ్యాధి హరించును. ఇది చాలా గ్యారంటీ ఔషదం. ఇందులో కొంచెం కలకండ పొడి కలిపి ఇవ్వవచ్చును.

వాంతి కట్టుటకు నలగగొట్టిన నీరుల్లిపాయను వాసన చూచుచుండిన వెంటనే వాంతి నిలుచును.

సర్వ రోగహరము:

 తుంగముట్టెలు,పర్పాటకము, వట్టివేర్లు, శ్రీగంధం, కురువేరు ఇవి సమభాగాలు దంచి కషాయం బెట్టి త్రాగిన సర్వరోగములు మానును.

మొలల వ్యా ధికి :

సొంటి, పిప్పలి, మిరియాలు, నేలతంగేడు ఆకు సమూలం చూర్ణించి వుడుకునీళ్ళలో ఉదయం తినిన మొలలు కరిగిపోవును.

కరకబొప్పటి, పెన్నేరుగడ్డ, సొంటి, తుంగముట్టెలు వాయు విడంగాలు తెగడ, ఉసిరిక పప్పు సమభాగాలు చూర్ణించి చక్కర కలిపి తినిన మొలలు కరిగిపోవును.

మేకమేయని ఆకు మెత్తగా నూరి ముద్ద చేసి మొలలకు కట్టిన 3 రోజులుకు మొలలు వూడిపోవును.

పాత చింతపండు కొత్త సున్నం మంచినీళ్ళు కలిపి కడుపులోకి యిచ్చిన, దొండ ఆకు ఆముదంలో వేయించి కట్టిన మొలలు వ్యాధి మానును.

రక్తమూలలకు గ్రంధిత గరం చూర్ణంలో క్రింద మీద పెరుగు వేసి తినిన రక్తం కట్టును.

 నల్లనూగుల చూర్ణం పూటకు 2.5 తులం, 3 తులాలు నెయ్యి కలిపి రెండు పూటలు తినిన రక్తం పడే

మొలలు వ్యాధి హరించును.

 నాగకేశరాలు చెక్కర వెన్నతో కలిపి తినిన రక్తం పడు మొలలు మానును.

 తెల్ల వుల్లిగడ్డ కుమ్ములో వుడికించి నమిలి మ్రింగిన మొలలు మానును.

 లక్క నలగనూరి పొగ వేయ రక్తం కట్టును.

 వేప ఆకు రాగి ఆకు మెత్తగా నూరి పిలకలపైన వేసి కట్టిన వూడిపడును.

 ముల్లంగి ఆకు రసంతో సురేకారం నూరి పిలకలకు పట్టించిన పిలకలు వూడి పడును.

కరక్కాయ చూర్ణం బెల్లం కలిపి వుండలు చేసి తింటూ యున్న మొలలు వ్యాధి మానును.

నిత్యం భోజనానంతరం 96 గింజల ఎత్తు కరక్కాయ చూర్ణం పుల్లని మజ్జిగతో కలిపి త్రాగిన మొలలు వూడిపోవును.

జుట్టపు ఆకుపాలు దూది తడిపి పిలకలపై వేసి కట్టిన పిలకలు వూడిపడును.

సూరణాది లేపనం:

కందపసపు, చిత్రమూలం వెలిగారం బెల్లం వీనిని కలితో నూరి లేపనం చేసిన త్రిదోష మొలలు బలిష్టములైనవి పోవును.

 మర్రి వూడలను కాల్చి మసి చేసి నూనెలో కలిపి మర్దించి లేపనం చేసిన మొలలు నివారించును.

చక్కర కేళి అరటిపండులో నల్లిని పెట్టి మ్రింగిన ఒక రోజులో మొలలు వ్యాధి పోవును.

యర్రనేలలో యుండే వానపామును తెచ్చి ప్రాణముతోనే బెల్లములో పెట్టి 3 రోజులు ఉదయం పూట మ్రింగిన మొలలు వ్యాధి మానను3 నెలలు తీపు తినరాదు.

కానగపప్పు చూర్ణం పావుతులం వంతున ప్రాత:కాలమున మంచి

నీళ్ళు అనుపానములో తినిన 21 రోజులలో మూలవ్యాధి హరించిపోవును. కలకండ పొడి కలిపి తినేది.

జిల్లేడుపాలు, జెముడుకాడ, చేదుసొర ఆకు,కానగవేరు ఇవి మేక మూత్రముతో నూరి లేపనం చేసిన స్రావముతో కూడిన మొలలు హరించును.

మొలల వ్యాధి ఒక రోజులోనే పోవు చికిత్స :

8 శేర్ల చేదుపుచ్చ కాయలు తెచ్చి తుంటలుగా చేసి నోరు వెడల్పు గల పాత్రలో వేసి నోటికి చేదు తగిలేవరకు రోగిచేత ఆ పాత్రలో దిగిరెండు కాళ్ళతో తొక్కుతూ యుండమని చెప్పేది. నోరు చేదు గలిగిన తర్వాత పక్కకు వచ్చి ఒక గంట వుండిన వాసనతో కూడిన విరేచనమగును. దీనితో మూలవ్యాధి ఒక రోజులోనే నివారణ యగును.

ఉత్తరేణి పూలను బియ్యం కడిగిన నీళ్ళతో నూరి ఆ రసాన్ని ఉదయం సాయంత్రం 1 స్పూన్ మోతాదులో తింటే మూల వ్యాధి హరిస్తుంది. రక్త మూల వ్యాధి కూడా హరిస్తుంది.

 

అరటి దుంప తెచ్చి మూడు భాగాలుగా నరికి మూడు రాత్రిళ్ళు పందిరిమీద మంచులో పెట్టి మరునాడు ఉదయాన్నే దంచి రసం తీసి పిండి వడగట్టి 5 వరహాల ఎత్తు మంచి కలబంద తగు మాత్రం జిలకర నూరి పై రసమును కలిపి త్రాగవలెను. ఇట్లు 3 రోజులు చేసిన లోపల మొలలు వెలి మొలలు రక్త మొలలుమానిపోవును.

నోటి రోగములు:

 నూనె, నెయ్యి, గుగ్గిలము, మైనము,సన్నరాష్ట్రము, బెల్లం, సైందవలవణం, కావిరాయి వీనిని సమభాగాలు నూరి తైలము కాచి పెదవులకు లేపనం చేసిన పెదవి చిగుర్లు, వ్రణములు బాగుపడను.

 గుగ్గిలము,మైనం, బెల్లం వీనితో నూనె కాని నెయ్యి కాని వేచి కాని పెదవులకు లేపనం చేసిన చర్మపీడ గరగరలాడుట పోట్లు, చీము, రక్తం కారుట వీనిని హరించును.

దంత రోగాలు జీరకాది చూర్ణం:

 జిలకర, ఉప్పు,కరక్కాయ, బూరుగముండ్లు వీనిని సమభాగాలు చూర్ణించి దానిని వస్త్రఘాళితం చేసి ప్రతి దినము దంతములకు తోము చుండిన, దంత వ్రణములు, దంతపు పగుళ్ళు,పోట్లు, రక్తం కారుట, దంతచలనము,వాపు వీనిని శీఘ్రముగా హరించును.

పిప్పళ్ళు, సైందవలవణం, జిలకర వీనిని చూర్ణించి దంతములకు రుద్దిన దంతములు కదులుట, వాపు,పోటు, రక్తం కారుట శీఘ్రముగా హరించను.

చెంగల్వకోష్టు, మానిపసుపు, లొద్దుగ, తుంగముట్టెలు, మంజిష్ట అగరు. సొంటి, కటుకరోహిణి, చాగ, పసుపు వీనిని చూర్ణించి పండ్లు తోమిన రక్తంకారుట, దురద, పోట్లు హరించును.

పండ్ల నొప్పులకు తెల్లగలిజేరు,జిలకర, సొంటి,నూగులు, వామ్ము, గోరింటపూలు, జాపత్రి, పిప్పళ్ళు చూర్ణించి పండ్లు తోముచుండిన క్రిములు,వాసన, నొప్పులు, వాపులు మానును.

పచ్చివామిటివేర్లు, మిరియాలు చేర్చి నూరి వుంట చేసి పుక్కిట , పెట్టుకొన్న పండ్ల నొప్పులు మానును. నవాసాగరం, ఉప్పు, పటిక, బొగ్గుపొడి కలిపి పండ్లు తోముచుండిన దంతముల కాశమానును.

పొంగించిన పటిక, కూకుడుకాయలలోని గింజలు కాల్చిన మసి ఈ రెండు కలిపి పండ్లు తోమిన ఎటువంటి పండ్లు నొప్పి అయినా వెంటనే తగ్గును.

నోటికి రుచి కలుగుటకు:

 అల్లం రసంలో తేనే కలిపి త్రాగిన అరుచి, శ్వాసకాస, దగ్గు,పడిశం నయమగును.

అల్లం,బెల్లం నూరి ప్రతిదినం తింటూ వున్న అజీర్ణాలు, వాతాలు, పైత్యాలు హరించి నోటికి రుచి కలిగించును. సొంటి బర్రె పెరుగులో 3 రోజులు వూరవేసి ఎండించి మెత్తంగా నూరి అందులో చెక్కర కలిపి తింటూ వున్న పైత్యము తగ్గి నోటికి రుచి కలిగించును.

 మర్రి చిగుర్లు నూరి నాలుకకు రుద్దిన నోటిపూతలు హరించును.

ఆకలి కలుగుటకు:

 కరకబెరడు, సొంటి,బెల్లం సమపాళ్ళు నూరి ఉదయం తినిన అగ్నిమాంద్యం,వాతం, భ్రమ, పైత్యం ,కఫం వీనిని పోగొట్టి ఆకలి కలిగించును.

 తుమ్మచెట్టు కూర వండుకొని తినిన అజీర్ణం పోయి ఆకలిబాగా కలుగును.

అల్లం ముక్కను కుమ్ములో వుడికించి పావలా ఎత్తు రసం తీసి దానిలో ఉప్పు కలిపి త్రాగిన ఆకలి బాగా అగును.

వడిశగడ్డలకు చికిత్స :

టెంకాయచెట్టు ఆకులను మెత్తగా నూరి దానిలో ఉప్పును కలిపి బిల్ల చేసి దానిని గడ్డపై వేసి కట్టిన 6లేక 8 గంటలలో కోసి వేయును. బాధ ఉండదు.

కొబ్బరికోరు వెచ్చచేసి కట్టిన ఎటువంటి బాధయున్న వెంటనే తగ్గును.

నేలకొర్మిడాకు వేర్లు మేకపాలతో నూరి రసం పిండి ఉదయం సాయంత్రం త్రాగిన వడిశగడ్డలు కరిగిపోవును. చప్పిడి పత్యం ఉండవెను

సవాయి గడ్డలకు గోరింటపూల రసంతో రసకర్పూరం కలిపి రాసిన పుండ్లు మానును. కుష్టువులుకుడా తగ్గును.

గోరుచుట్టుకు కాటికాకు మెత్తగా నూరి వెన్న కలిపి కట్టిన చీము కుసమవచ్చి మానును.

పిల్లల కాళ్ళకు లేచు నుసిమిర్లకు:

గ్రంధితగరం, వజ, ఉల్లిగడ్డ, పసుపు, సామువులు, మునగ చెక్క సమభాగాలు నూరి ఆవునెయ్యి, ఆముదం, నూనె కలిపి పక్వముగా వండి 3 రోజులు పట్టు వేయ నుసిమిర్లు మానును.

నల్ల ఉమ్మెత్త, తులసి ఆకు కలయదంచి రసంతీసి పూత పూసిన మానును.

పులిపిరి కాయలకు:

 నేలవేము మెత్తగా దంచి వస్త్రఘాళితం చేసి తర్వాత తేనే వేసి నూరి శనగగింజలంత మాత్రలు రోజుకు రెండు వంతున పది రోజులు తినిన పులిపిరి కాయలు ఎండి రాలిపోవును.

 జుట్టపాకు రసం,సున్నం, తెల్లబాయనూరి పులిపిరికాయలకు పూసిన తెగి పడిపోవును.

సోడాపొడి, కొత్త సున్నం ఈ రెండు నూరి పిలిపిరి కాయలకు పూసిన వూడి పడిపోవును.

తమలపాకుల రసం, సున్నం కలిపి పూసిన వూడి పడిపోవును.

జీడిమామిడి గింజల నూనె పూసిన పులిపిరికాయ పడిపోవును.

ఉత్తరేణి సమూలం కాల్చి ఆ బూదిలో హరిదలం కలిపి పట్టించిన పులిపిర్లు పడిపోవును.

సురేకారం పొట్లము జోబిలో పెట్టుకొంటే పులిపిర్లు రాలిపోవును.

యవ్వన పిటికలు:

 మంజిష్ట, మద్దిపట్ట, అడ్డసరము, ఇవి తేనెతోను, ఆవుపాలతోను లెస్సగా నూరి ముఖమునకు లేపనం చేయుచున్న ముఖము నందు జనించిన మొటిమలు మానును.

నేలపురుగుడాకు రసం పూసినను, బాదంపప్పు రసం పూసినను మొటిమలు మానును.

శోభి మచ్చలకు:

 పసుపు కొమ్ముల రసం తీసి ముఖము పైన శోభి మచ్చలకు రాసిన మానును.

పసుపు, మానిపసుపు, మంజిష్ట, తెల్ల ఆవాలు, స్వర్ణగైరికము, వీనిని మేకపాలతో మెత్తగా నూరి నెయ్యి చేర్చి ముఖమునకు లేపనం చేసిన ముఖము కాంతి నిచ్చును.

సిబ్బెమునకు:

 ఉత్తరేణిగాని, అరటిపట్టగాని, క్షారం చేసి నూగుల నూనెలో వేసి పట్టించేంది.

మంగుకు:

 హరిదళం, చిత్రమూలం, రేలజిగురు, గోమూత్రమున నూరి పూసిన చంపల, ముక్కుమీద గల మంగు మానును.

గండమాల గడ్డలకు:

 తేళ్ళు 20 నూనెలో వేసి మాడకాంచి తేళ్ళను తీసివేసి ఆ నూనె గుడ్డకు పూతవేసిన గండమాలలు మానును.

మరియు

 చుండెలుకను ఎండించి పొడి చేసి నూగుల నూనెలో వేసి కాంచి 3 దినములు పూసిన గండమాలలు మానును.

ఎదురు గుటికలు:

 తమలపాకులో కరదువ కొంచెం వేసి మడిచి నమిలి మింగిన, ఎంగిలి మింగ నియ్యకుండా చేయు ఎదురు గుటికలు మానును.

ఎదురు గుటికలు తలదిమ్ముకు వామిటాకు పసరు చెవిలో పిండిన ఎదురు గుటికలు మానును.

 


మిరియాలు, తెల్లబాయలు తుమ్మెఆకు పసరుతో నూరి ముక్కులో పిండిన మానును.

 వావిలాకు పసరు చెవిలో పిండిన ఎదురు గుటికలు మానును.

ఆసనగండ మాలలకు:

 వేపపప్పు మెత్తగా నూరి బాగా పేరిన నెయ్యిలో పది దినాలు సేవించిన మేహరణాలు ముడ్డిగండమాలలు మానును.

గండ మాలలకు సహదేవి వేరును ఆదివారం తెచ్చి రోగి చెవి రంధ్రములో కట్టిన గండమాలలు హరించును. -

శిరస్సుల చికిత్స :

బాదం నూనె తలకు వ్రాసుకున్న తలనొప్పి మానును.

 సొంఠి చూర్ణం నశ్యంగా పీల్చిన తలనొప్పి పార్శపు నొప్పి మానును.

 తిప్పసత్తు ధనియాల కషాయంలో త్రాగిన శిరో వ్యాధులు మానును.

 కుక్క వాయింటాకు రసం కొబ్బరినూనె యందు కలిపి కాచిన తైలం తలకు రుద్దిన తలపోటు మానును.

కడుపులో పురుగులు లేక ఏలికపాములు పడుటకు :

వేపచెట్టు యిగుర్లు, వామ్ము నూరి తినిన అన్ని రకాల క్రిములు వూడి పడును.

సీతాఫలము గింజల పప్పు నూరి బేడెత్తు తేనెతో తినిన పురుగులు పడును.

రోజు రెండు పూటల 4 రోజులు. వాయు విడంగాలు దోరగా వేయించి పొడి చేసి తేనె కలిపి తినిన క్రిములు వూడి పడును.

కురసాని వాము చూర్ణించి పావు తులం మొదలు 1/2 తులం వరకు ముందు బెల్లం తిని తర్వాత పై మందు తిని నీళ్ళు త్రాగిన కడుపులో క్రిములు వూడి పడును.

చేతరాసివేర్ల రసం, నూనె, మిరియాలు నూరి కలిపి త్రాగిన కడుపులో ఏలికపాములు పడిపోవును.

 తీటకోవెల నూగును తీసి చింతపండు పులుసు,బెల్లం చేర్చి ఉదయం పూట చారెడు త్రాగిన కడపులోని పురుగులు పడిపోవును.

గచ్చపప్పు, వెల్లుల్లి నూరి కొంచెము ఇంగువ కలిపినీళ్ళతో త్రాగిన కడపులోని క్రిములు పడిపోవును.

కందగడ్డ ఉడికించి పై పొట్టు తీసి బెల్లం నెయ్యి, ఈ మూడు కలిపి తినిన బేదిలో క్రిములు పడును.

ధనుర్వాతమునకు:

 మారేడువేరు, ఆముదపు వేరు, ములకవాకుడు, పాదరసము, సైందవలవణం, సొంటి, మిరియాలు,పిప్పలి ,ఇంగువ మాధీఫలము తొక్క ఇవి సమభాగాలు కషాయం బెట్టి త్రాగించిన ( విల్లువలె) వంగజేయునట్టి ధనుర్వాతం నివారించును.

పడిపొయ్యే వ్యాధికి చికిత్స:

కిర్మాని అనే జిలకర, వామ్ము ఒక్కొక్కటి 10 గ్రాముల కషాయం బెట్టి అందులో గోమూత్రశిలాజిత్తు రెండు గింజల ఎత్తు కలిపి త్రాగిన నయమగును.

జబ్బులు రాకుండా యుండుటకు సోంపు చూర్ణమును ప్రతి నిత్యం తేనెతో కలిపి తింటూ వున్న రోగములు రావు.

ముక్కు రోగాలు:

పీనస రోగాలకు నశ్యం - పిప్పళ్ళు,సొంటి, పసుపు వీటిని వేడినీటిలో నూరి నశ్యమొనర్చిన పీనసలు మానును.

పాపరపండు రసం నశ్యం చేసిన పీనసలు హరించును.

 పిప్పలి, సైందవలవణం వీనిని వేడి నీటితో నూరి నశ్యం చేసిన పీనస, చెవి నొప్పి, కంటి రోగములు హరించును.

నల్లజిలకర గుడ్డలో మూటకట్టి వాసన చూస్తూ ఉన్న పీనసలు హరించును.

 పసుపు పొగ దగ్గు తక్షణం హరించును.

 వాయువిడంగాలు,సొంటి, పిప్పలి,మిరియాలు, గుగ్గిలం, మనిశిల, కరక్కాయ వీనిని సమభాగాలు చూర్ణించి పిల్చిన పీనసలు హరించును.

బెల్లం, సొంటి గాని లేక సైందవలవణం,పిప్పలి వేడినీటిలో నూరి నశ్యం చేయించిన లేక వేడినీటిలో నెయ్యి కలిపి నశ్యం వేసిన పీనస హరించును.

 గుంటగలగర, దొండ, వావిలి, అల్లం, అడ్డసరం,పసుపు, ఉసిరికాయ, దుంపరాష్ట్రం, మిరియాలు, సొంటి అను వానిని నూరి అందులో నూనె కలిపి తైలపక్వంగా వండి నశ్యం చేయ పీనసలు హరించును. కుంకుమపూవు నేతితో బాగా నూరి వెచ్చచేసి ముక్కులకు పీల్చిన నాసా రోగములు మానును. . తెల్లజిలకర పొడిలో పంచదార చేర్చి పీల్చిన చీముకారుట మానును.

జాజిపూలు, మల్లెపూలు,యర్రగన్నేరుపూలు రసం తీసి వీటికి సమానం నూగులనూనె కలిపి తైలపక్వంగా పిండి ముక్కుల్లో వేయ రక్తము కారుట మానును.

 పెరుగులో మిరియాలు,బెల్లం చేర్చి త్రాగిన పీనస అతిశీఘ్రముగా హరించును.

 కోడిమలం, పుల్లకు దూదిచుట్టి ఆ మలములో అద్ది ముక్కులకు పూసిన పక్కులు వూడి పీనస మానును. మేకపాలు,

జిల్లేడిపాలు, మర్రిపాలు సమభాగాలు నూరి ఆవునెయ్యి చేర్చి సమభాగం బెల్లం, సైందవలవణం కలిపి పక్వంగా వండి ముక్కు రంద్రములలో వేసిన అయిదు విధాల పీనసలు హరించును.

వెర్రి కుసుమ ఆకు రసం తీసి ముక్కుల యందు వేయ ముక్కులు తెగదినె రోగం మానును.

చెవుడుకు చికిత్స:

 గువ్వగుత్తి ఆకు రసం చెవిలో పిండిన చెవుడు మానును.

 గచ్చాకు రసంలో మిరియాల పొడి వేసి రెండు దినములు కొక సారి చెవిలో పోసిన చెవుడు మానును. ఎర్రపత్తి ఆకు రసంలో మంచి ఉప్పు కలిపి చెవులో పోసిన చెవుడు మానును.

చేదు బీరాకు రసం చెవిలో పిండిన చెవిపోటు మానును.

నల్లతుమ్మాకు రసం పిండి చెవిలో వేసిన చెవిపోటు మానును.

మేకమూత్రములో సైందవలవణం కలిపి చెవినిండా పోసిన చెవిలో చీము కారుట, చెవిపోటు 2 ఘడియలలో నయమగును.

జాజిపూల రసం లేక జాజిచిగుర్ల ఆకురసం లేక ఆవు పంచితం చెవి నిండా పోసిన చెవినొప్పి ,చీము కారుట మానును.

 జింక తోలు, ఇంగువ,వెల్లుల్లి,రసకర్పూరం,పొగాకు ఇవి కలియ దంచి మంచి నూనె, వామిటాకు పసరు కలిపి తైలపక్వంగా వండి చెవులలో చెవుడు చీముకారుట మానును.

 వూరపంది రక్తం 3 చుక్కలు చెవులో వేసిన చీముకారుట చెవుడు మానును.

కాటికాకు రసం నూనె, ఇంగువ,బాలింతబోలు అన్ని కలిపి వండి ,చెవులలో వేసిన చెవి బాధలు మానును. పాము కుసము, మంచి నూనెలో వేసి కాంచి చెవుల యందు రోజు రెండు పూటల వేసిన 3 దినములలో చీము కారుచుండుట

మానును. 12. తెల్లబాయలు, ఇంగువ, సముద్రపు నురుగు ముక్కలు కొట్టి నూనెలో కాంచి చెవుల యందు వేయ గాఢమైన చెవిపోటు మానును.

పోకలు, చాగపట్ట ఈ రెంటిలో ఏదైనా ఒకటి కుమ్ములో ఉడికించి

రసం తీసి చెవుల యందు వేసిన చెవుడు, చెవిపోటు మానును.

బీరాకు పసరులో వస కలిపి చెవిన పిండిన చెవిలో పుండ్లు మానును.

చెవిలో జోరీగకు:

తోటకూర, నల్లేరు దంచి రసం తీసి మంచి నూనెలో వేసి కాంచి చెవులలో వేయ జోరీగ పోవును.

చెవులలో ఏదైనా పురుగు పోయిన మంచి తేనె కాచి చెవిలో వేసిన చెవిలో ఉన్న పురుగులు నేల పడిపోవును.

చెవిలో చీము, నెత్తురు కారునపుడు:

కోడిగుడ్ల బొప్పటి నూరి పొడి చేసి చెవిలో వేసి నిమ్మరసం పిండిన నెత్తురు కారుట మానును

మరియు

పండు జిల్లేడాకుకు నెయ్యి పట్టించి నిప్పుశెగ చూపి రసం పిండి కొంచెం వేడి ఉండగానే చెవిలో పోసిన కర్ణ శూలలు మానును.

దుందిలపు వేరు కల్కము చేసి నూనె కలిపి సన్నని మంటలో కాంచి చెవిలో వేసిన త్రిదోషములు, శూలలు శీఘ్రముగా హరించును.

ఇంగువ, సైందవలవణం, సొంటి, వీని కల్కములను తెల్లని ఆవనూనెలో కలిపి పక్వము చేసి చెవిలో వేసిన కర్ణ శూలలు హరించును.

సొంటి, సైందవలవణం, పిప్పళ్ళు, తుంగముట్టెలు, వజ, నీరుల్లి వీనిని నలగగొట్టి నూగుల నూనెలో వేసి పండు జిల్లేడాకు రసం, మోదుగరసం కలిపి చక్కగా కాంచి చెవిలో వేసిన కర్ణ రోగాలు మానును.,

ఉత్తరేణి క్షారం నీళ్ళు ఉత్తరేణి కల్కం వీనిలో నూగుల నూనె పోసి కలిపి చెవిలో వేసిన కర్ణ రోగాలు చెవుడు మానును.

పొంగించిన పటిక చూర్ణం 2 గురిగింజల ఎత్తు చెవులో వేసి వెంటనే నిమ్మరసం గాని లేక నీరుల్లి రసం గాని వేసిన వారం రోజులలో ఎటువంటి నొప్పి అయినా హరించును.

అల్లం రసం నందు కొద్దిగా సైందవలవణం కలిపి గోరువెచ్చగా చెవిలో వేసిన కర్ణ శూలలు మానును.

సముద్రపు నురుగు చూర్ణం చెవిలో వేసిన చీము,వ్రణము హరింపజేయును.

ఇంద్రియ నష్టం – చికిత్సలు:

 చిల్లగింజలు పాలతో నూరి త్రాగిన యింద్రియ నష్టం పోయి పుష్టి కలుగును.

స్వప్న స్కలనానికి:

 వామ్ము,కలబంద గుజ్జుతో నానబెట్టి దానిని ఎండించి చూర్ణం చేసి పూటకు 1/2 తులం తింటూ వున్న స్వప్నస్కలనం మానును.

 పిల్లి పీచర వేర్లు, బోడతరం వేర్లు, సొంటి, పిప్పలి, మిరియాలు నూరి తినిన స్కలిత గుణం మానును.

బ్రహ్మదండివేర్లు,

లేత బెండకాయ తినిన స్కలనం కట్టును.

బెండచెట్టు వేరు చూర్ణం చేసి చెక్కర కలిపి తినిన యింద్రియ నష్టం కట్టును.

 మామిడి పిందెలు ఎండించి చూర్ణం చేసి దానికి నాలుగింతలు చెక్కర కలిపి 40 దినములు ఉదయం పూట తినిన మూత్రంలో పోవు యింద్రియం కట్టును.

తంగెడి చెట్టు సమూలం చూర్ణించి చూర్ణానికి సమం చెక్కర కలిపి పూటకు పావుతులం తినిన యింద్రియ నష్టం కట్టును.

 పెన్నేరుగడ్డలు చూర్ణం 1.5 తులం ప్రతి దినము ప్రాత:కాలమున పాలు,నెయ్యి, కలకండ చూర్ణములు కలుపుకుని త్రాగుచుండిన కృశించిన శరీరమునకు బలము కలుగును.

 కొత్తిమీర ఆకు రసం పాలు,తేనె సమభాగములు రోజుకు 3 సార్లు త్రాగిన శుక్లనష్టం పూర్తిగా నయమగును.

చింతగింజలు నూరి లేహ్యం చేసి యిచ్చిన శుక్ల నష్టం కట్టును.

గులాబిపూలు ప్రతి దినం తింటూ వున్న శుక్ల నష్టం కట్టును.

ధనియాల కషాయంలో అరగ్లాసుపాలు 2 చెంచాలు పంచదార కలిపి రోజు వంతున 7 దినములు త్రాగిన శుక్ల నష్టం కట్టును.

మెంతులు చూర్ణించి పాలు పంచదారతో లేహ్యం వేసి కుంకుడు కాయంత తిని అరగ్లాసు పాలు త్రాగిన 11 దినములలో శుక్ల నష్టం కట్టును.

రసాయనం:

పెన్నేరు గడ్డల చూర్ణం, దూలగొండిగింజల చూర్ణం, శకాకుల,మిశ్రిచూర్ణం, గొబ్బిగింజలు యీ వస్తువులన్నీ సమభాగాలు చూర్ణించి యీ మొత్తానికి సమం కలకండ పొడిని కలిపి ప్రతి దినం ప్రాత:కాలమున ఒక తులం, సాయంత్రం ఒక తులం చూర్ణం ఆవుపాలతో త్రాగిన వీర్యము అమితముగా వూరును. స్తంభనశక్తి అధిక మగును. సంభోగములో ఆనందము కలుగును.

స్తంభనకు అనబగింజలపప్పు, పంచదరాతో కలుపుకొని తినిన వీర్యము గట్టి పడి స్తంభించును.

లింగ బలానికి తెల్ల గన్నేరు వేరు గాని, యర్రగన్నేరు వేరు గాని నెయ్యిలో వేయించి లింగ లేపనం చేసిన మిక్కిలి ధృడంగా యుండును.

అతిసారానికి చికిత్స:

నేరేడు ఆకు చిగుర్లు మామిడి చిగుర్లు రసం తీసి నెయ్యి, తేనె కలిపి త్రాగిన అతిసార బేదులు కట్టును.

సొంటి, ధనియాలు, తుంగముట్టెలు, నేరేడుపండు, కురువేరు కషాయం బెట్టి ఇచ్చిన మానును.

శ్లేష్మాతిసారానికి:

 పిప్పలి, మోడి, చిత్రమూలం ఇవి చూర్ణించి ఉడుకు నీళ్ళతో యిచ్చిన అతిసారం బేదులు మానును.

అతిసారానికి :

వెలిగారం, శుద్ధి చేసిన నాభి మామిడి పప్పు, తుంగముట్టెలు, కొడిశపాల ఇవన్నీ సమభాగాలు గంజాయి ఆకు రసంతో నూరి ఉలవగింజంత మాత్రలు చేసి అనుపానాలతో యిచ్చిన సర్వ అతిసారాలు మానును. చింతగింజలు,గచ్చ పలుకులు, ఆముదపు విత్తనాల పప్పు, వామ్ము, సొంటి, తంగేడి వేర్ల వలుపు నూరి నెయ్యితో వండి తినిన గ్రహణికలు కట్టును.

ఉత్తరేణి బంక, తుత్తురువేర్లు నూరి పెరుగులో కలిపి త్రాగిన బేదులు నిలుచును.

బంక నెత్తురు బేదులకు:

 నేలఉసిరిక, బెండాకు బాగా నూరి క్రిందా మీద పెరుగు చేర్చి 3 పూటలు తినిన బంక నెత్తురు బేదులు నిలుచును.

వేయించిన ధనియాలు, ఆవాలు, పిప్పళ్ళు, వరిబొరుగులు సమభాగాలు నూరి నీళ్ళతో వుడికించి 3 పూటలు త్రాగిన దాహం, రక్త బేదులు నిలుచును.

బాగా మాగిన మారేడుపండు గుజ్జు, తుంగముట్టెలు, అతివస, కురువేరు, కొడశపాల గింజలు సమభాగాలు దంచి కషాయం బెట్టి త్రాగిన కఠినమైన బంక నెత్తుర బేదులు నిలుచును.

 వూడుగ వేరు, బియ్యం ,కడిగిన నీటిలో నూరి రసం తీసి రెండు చెంచాలు ఎత్తు త్రాగిన సమస్త అతిసారాలు నిశ్చయముగా నిలుచును.

తంగేడిచెక్క మేడిచెక్క కలిపి కషాయం పెట్టి త్రాగిన సమస్త గ్రహణిలు కట్టును.

తులసి ఆకు రసం, కర్పూరం నూరి కందిగింజంత మాత్రలు చేసి

యిచ్చిన అతిసార బేదులు క్టును ( అనుభవము)

అన్ని రకములయిన విరేచనములు హరించుటకు మజ్జిగ చిట్కా:

 చిక్కని పుల్లని మజ్జిగ 1/2 శేరు పొయ్యిమీద పెట్టి సన్నని మంట చేత ఉడికించి గట్టి పడిన తర్వాత అందులో 1 తులం సొంటి చూర్ణం, పావు తులం బూరుగబంక కలిపి కల్వములో వేసి మెత్తగా నూరి రేగుపండంత మాత్రలు చేసి బాగా ఆరబెట్టి సీసాలో వేసి జాగ్రత్త పరచి కావలసినప్పుడు రోజు 3 పూటల మంచినీళ్ళతో ఒక మాత్ర మింగిన అన్ని రకాల విరేచనాలు పోవును. జిగట,రక్తవిరేచనాలు కట్టును. ఇది అనుభవపూర్వకమైన యోగం.

పిల్లలకు గాని, పెద్దలకు గాని, అన్నం తిన్న వెంటనే విరేచనాలు అవుతూ వున్న రోజుకు రెండు మూడు సార్లు విశేషంగా పల్చటి మజ్జిగ త్రాగిస్తే విరేచనాలు హరించును.

పెద్దలకు కడుపునొప్పికి నీళ్ళ విరేచనాలకు:

 మజ్జిగలో సైందవలవణం కలిపి 2, 3 సార్లు త్రాగిన కడు పునొప్పి,  రక్తబేదులు తగ్గును. నీళ్ళ విరేచనాలు తగ్గిపోవును.

కొడిశపాల విత్తులు దోరగా వేయించి చూర్ణించి చెక్కర కలిపి తినినరక్తవిరేచనాలు బాగావును.

మారేడిపండు గుజ్జును చెక్కర కలిపి తినిన రక్తబేదులు తగ్గును.

పిన్నులు, మేకులు, గాజు పెంకులు శరీరంలో గుచ్చుకొని రానియెడల:

 నీటి పిప్పలి లేక బొక్కినాకు, పాతబెల్లం సమభాగాలు నూరి ముద్దచేసి పూటకు 1/2 తులం చొప్పున 5 రోజులు తినిన యెడల వూడి పడిపోవును.

ఎక్కిళ్ళకు:

 గోరువెచ్చని నీళ్ళలో కరకచూర్ణం కలిపి త్రాగిన ఎక్కిళ్ళు తగ్గును.

 నల్ల జిలకర చూర్ణం పావలాఎత్తు వెన్నతో తినిన ఎక్కిళ్ళు తగ్గును.

ఎండ్రకాయ బొరకలోని నీళ్ళు యష్టిమధుకం చూర్ణం కలిపి త్రాగిన ఎంత ఘోరమైన ఎక్కిళ్లు అయినా మానును.

కాకరకాయలోని గింజలు ఎండబెట్టి చూర్ణం చేసి తేనెలో కలిపి గంటకు ఒకసారి తినిన ఎక్కిళ్ళు మానును.

నిమ్మరసం త్రాగిన ఎక్కిళ్ళు కట్టును.

త్రేపులు:

 పొదీనా ఆకు కషాయం కాచి త్రాగిన త్రేపులు మానును.

సూతికా కషాయం:

 సొంటి,పిప్పల్లు, మిరియాలు, నల్లజిలకర, కురసానివామ్ము, వాయువిడంగాలు, గంటుబారంగి, కటుకరోహిణి, యిసగండ్రిక ఆకు చాగొడిచాకు, తక్కలాకు, ఆవుపంచితం,మేకపంచితం, గాడిద పంచితం పై వస్తువులు చూర్ణించి ఒక కుండలో పోసి రెండు చెంబుల నీళ్ళు పోసి పొయ్యిమీద బెట్టి యెనిమిదోభాగం మిగులునట్లు కాచి వడగట్టి పై పంచితాలు పోసి 1/2 చటాకు వంతు తాపేది. పత్యం చప్పిడి. ఉప్పు వేయరాదు. గాలి తగలరాదు. ఈ విధంగా బాలింత వుండవలెను. వల్లు నొప్పులు, ఉదరాలు పాండువులు మానను.

స్త్రీలకు అంటు రోగాలు:

నేరేడుచెక్క అరటిపండ్లు కలిపి పిసికిన రసం వచ్చును. దానిలో కర్పూరశిలాజిత్తు బస్మం కలిపి యిచ్చిన తెల్లబట్ట మొదలుకొని సమస్త అంటు రోగములు హరించును.

కుసుమ వ్యాధికి:

ఏనుగపల్లేరాకు 7, మిరియాలు , తెల్లబాయలు 2 నూరి ప్రొద్దున యిచ్చిన కుసుమ వ్యాధి మానును.పత్యం పుల్గము, నెయ్యి.

తెల్ల చీరలకు:

 జిలకర,సాంబ్రాణి, మాచికాయ యీ రెండు నూరి నీళ్ళతో తినిన తెల్లచీరవ్యాధి మానును.పత్యం పుల్గము,నెయ్యి.

నాగకేశరములు,ఆవు మజ్జిగతో నూరి 3 రోజులు త్రాగిన తెల్లబట్ట వ్యాధి మానును.

రేగుకాయల చూర్ణం, అరటి పిందెల చూర్ణం, బెల్లం కలిపి తినిన సమస్త కుసుమ రోగాలు మానును. . బూరుగుబంక చూర్ణం, చెక్కర కలిపి తినిన రక్త కుసుమ తగ్గును. పుడకలక్క చూర్ణం తేనెతో తినిన రక్తచీరలు నిలుచును.

సూతికా వాతం గోరింటవేర్లు, వులవలు కషాయం కాచి చెక్కర కలిపి త్రాగిన సూతికా శూలలు జ్వరం హరించును. -

వాంతులు ఎండిన రావి పట్టను కాల్చి మసి చేసి నీళ్ళతో కలిపి తాపిన వాంతులు నిలుచును.

నిద్రకు గోరంటపూలు మూటకట్టి తలక్రింద పెట్టి పడుకొన్ని నిద్ర బాగా పట్టును.

చిట్టిపాపర, మిరియాలు నూరి ఉడుకు నీటిలో వేసి తాపిన సూతికావాతం జ్వరం, శూలలు మానును.

నేల గొర్మిడాకు, వెల్లుల్లి, మిరియాలు నూరి ఉడుకు నీటిలో త్రాగిన మొండి సూతికా జ్వరం అయినా మానును.

అతిసారానికి:

 దురదగొండివేరు, అల్లం వీనిని కషాయం బెట్టి అందులో పాలు కలిపి రాత్రులందు త్రాగిన గర్భిణీ స్త్రీ అతిసారాలు మానును.

గర్బిణీ వ్యాధులకు చికిత్స :

అతిమధురం, ద్రాక్షపండ్లు, ఉసిరిక పప్పు వీనిని పాలతో వాగును సిద్ధము చేసి త్రాగిన గర్భవతులకు గలుగు పిత్త వికారములు నిశ్చయముగా మానును.

కటుకరోహిణి, కరక్కాయ, గంటుబారంగి,సొంటి వీనిని కషాయం కాంచి అందులో బెల్లం కలిపి త్రాగిన గర్భవతికి కలుగు శ్వాసకాసలు శమించును.

మిరియాల చూర్ణం, తేనె, చెక్కర,నెయ్యి వీటితో కలిపి తినిన గర్బిణీ కాసలు హరించును.

వరిబొరుగులు, ఏలకలు రేగు గింజలలోని పప్పు వీనిని కషాయం కాంచి త్రాగిన గర్బిణీకి కలిగిన వాంతులు శమించును.

అడవివామ్ము , పెన్నేరు, పిప్పల్లు, గజపిప్పల్లు, జిలకర వీనిని సమభాగాలు చూర్ణించి తేనె, బెల్లం కలిపి తినిన గర్బిణీకి గలుగు అగ్నిమాంద్యం హరించును.

పల్లేరు, చిట్టాముట్టి వీని కషాయం త్రాగిన గర్భిణీకి గలుగు మూత్రఘాతం, మూత్రకృచ్ఛగా గల మూత్ర రోగాలు నివర్తించును.

ముట్టురాని స్త్రీలకు:

 పుల్లబచ్చలిగడ్డ నూరి ఆవుపాలు కలిపి 3 పూటలు త్రాగిన నెల నెలకు ముట్లు సరిగా వచ్చును.

వూడగ వేరు గంధము తేనెతో కలిపి మూడు ముట్లకు మూడు పూటలు యిచ్చిన చక్కగా ముట్లు వచ్చును. . హంసపాది ఆకు రసంతో రెండు గింజల ఎత్తు కుంకుంపూవు కలిపి చెక్కర నిమ్మపులుసుతో 3 ముట్లకు 3 పూటలు యిచ్చిన నెలనెలకు తప్పక ముట్టు వచ్చును.

ముట్టుకు కుట్టు నొప్పికి:

 గచ్చయిగురు ఆకు,వెల్లుల్లి, మిరియాలు నూరి రేగుగింజలంత మాత్రలు చేసి పూటకు 3 మాత్రలు తినిన నొప్పి మానును. గంటు సీకాయ, సొంటి, గచ్చపప్పు, మానిపసుపు, ధూపము, నిమ్మపండ్ల రసాన నూరి 3 పూటలు తినిన ముట్టు కుట్టునొప్పి హరించును.

బాలింతల చికిత్స: మాయ పడుటకు:

ముగనపూలు నీళ్ళతో నూరి తాపిన మాయ పడును. పూత పిందెకాయలుండె రాములక చెట్టు సమూలం తెచ్చి దంచి చిన్న పిల్లల మూత్రం పోసి అందులో మోడి, పిప్పలి చూర్ణం కలిపి త్రాగిన మాయ పడును.

కడుపులో చచ్చిన పిండం పడుటకు:

 బచ్చలాకు, ఆముదం కలిపి త్రాగిన చచ్చిన పిండం పడును.

 వెల్తురాకు,వెదురాకు కలితో నూరి త్రాగిన చచ్చిన పిండం వూడిపడును.

ఆవు పేడ కొంచెం నీటిలో కలిపి రసం తీసి తాపిన పిండం వూడి పడును.

చనుబాలు పడుటకు:

 నీరు,సాంబ్రాణి ఆకుకూర వండుకొని తేనే కలిపి 3 రోజులు తినిన పాలు పడును.

సుఖ ప్రసవానికి:

 ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీకి గుర్రపు లద్దెతో పొగ వేస్తే వెంటనే ప్రసవమవుతుంది.

బాలింత నాలిక పీర్పుకు:

 వేపపప్పు వేయించి నూరి బాలింతరాలి నాలికకు రుద్దిన దప్పిక పోయి నోట నీరు వూరును.

 దొండకాయ, వాడకొబ్బెర, రుద్రాక్ష నూరి నాలికకు పూసిన దప్పిక జ్వరం మానును.

బాలింతలకు చీరలు కాకుండా యుంటే అయ్యేటందుకు:

 మాచికాయలు 120 గ్రాములు, వాయువిడంగాలు 5 గ్రాములు , తాటిబెల్లం 10 గ్రాములు యీ వస్తువులు సారాయితో నూరి సారాయితో కలిపి త్రాగించేంది కడుపు మీద వేడి నీటితో కాచేది. తప్పక మురికి పోవును

మగ పిల్లవాడు పుట్టుటకు:

 గర్భము ధరించిన రెండు మాసముల తరువాత గర్భిణీ స్త్రీ పరగడుపున 8 గురిగింజల ఎత్తు గంజాయి గింజలనను ఉదయం పూట మంచినీళ్ళతో తినవలెను అటు తరువాత రాత్రి భోజనమునకు రెండు గంటల ముందుగా లింగదొండ గింజలు నాలుగింటిని మంచినీళ్ళతో తినవలెను. ఈ విధముగా నెలరోజులు ప్రతిరోజు చేయవలెను. ఈ రెండు రకముల గింజలను గింజలుగా ఉండే మింగవలెను. నమల కూడదు. నూరకూడదు. ఈ విధంగా చేసిన మగపిల్లవాడు పుట్టును.

సంతానమునకు :

తెల్లగలిజేరు వేరు నూరి ఆవుపాలను కలిపి నాల్గు దినములు త్రాగిన స్త్రీ గర్భవతియై పుత్రుని కనును.

 పాపర వేరుల చూర్ణం ఆవుపాలతో కలిపి త్రాగిన బిడ్డలు కలుగును.

 పెన్నేరు దుంప చూర్ణం 50 గ్రాములు పిల్లిపీచరగడ్డల చూర్ణం 50 గ్రాములు చిన్నయాలకల చూర్ణం 10 గ్రాముల కలకండ 50 గ్రాములు ఇవి కలిపి నూరి పూటకు అర తులం వంతున ఆవుపాలతో ఉదయం, సాయంత్రం 4 రోజులు సేవించిన రజస్సు పరిశుభ్రమై సంతానం కలుగును.

జుట్టపువేరు నేతిలో అరగదీసి ఆ గంధం ముట్టయిన 3 రోజులు అరతులం వంతున తినవలెను. బిడ్డలు కలుగుదురు. పత్యం పెరుగు అన్నం.

మర్రి యిగుర్లు పాలతో నూరి రసం తీసి అందులో పెసర గింజంత మమ్మాయి కలిపి రుతువు అయిన 3 రోజులు ఉదయం త్రాగిన వంద్యాదోషం పోయి సంతానం కలుగును.

ఎర్ర కుసుమ వ్యా ధికి:

 తుమ్మబంక వేయించి, కావిరాయి యీ రెండు ఒకటిగా చేర్చి కలనూరి చక్కర సమభాగం తినిన ఎర్రచీరలు మానును. పెసరపప్పు అన్నం నెయ్యి తినవలెను.

 బొక్కినాకు నూరి పోతును యీనిన ఎనుము పెరుగు కలిపి 5 పూటలు యిచ్చిన ఎర్రకుసుమ మానును. మజ్జిగ అన్నం తినవలెను.

 సీమతుమ్మాకు నూరి చింత పిచ్చంత మూడు వుంటలు చేసి బర్రె పెరుగుతో మింగిన రక్త చీరలు మానును.

తెలుపు ఎరుపు కుసుమలకు చిర్రివేర్లు, అతిమధురం, తిప్పసత్తు, శ్రీగంధం, పిల్లిపీచర గడ్డలు తామర కేసరాలు కలయనూరి చక్కర కలిపి సమభాగములు తినిన తెలుపు ఎరుపు కుసుమలు మానును.

నాల్గు విధముల కుసుమ రోగాలకు పాత అవిశకట్టె భస్మం పాచినీళ్ళతో  పూటకు 1 తులం 7 పూటలు త్రాగిన నాల్గు విధాల కుసుమ రోగాలు మానును. ఉప్పు లేకుండా మజ్జిగ అన్నం తినేది.

గర్భవతి యోని రక్తమునకు:

నేలగుమ్మడి గడ్డరసము తిప్పతీగ చూర్ణము చేసి గంటెలో పొంగించి త్రాగిన గర్భవతుల యోని రక్తం నిలుచును.

తీటకసివెంద ఆకు జిలకర చెక్కర చేర్చి నూరి రేగుపండంత మూడు నాళ్ళు రేపు మాపు యిచ్చిన యోనిరక్తం నిలుచును. పత్యం పెసర పుల్గము తినేది.

సంతానం కోరేవారికి:

 ఉత్తరేణి పూలు గింజలు ఆవుపాలతో మెత్తగా ఉడికించి ప్రతిరోజు ఉదయమే స్త్రీ పురుషులు తాగుతూ యున్న ఎంతకాలం నుంచి పిల్లలు పుట్టకుండా యున్న వారికైనా స్త్రీ పురుషుల దోషాలు పోయి సంతానం కల్గుతుంది.

గుంటగలగరాకు తలలో గాని జడలో గాని ధరించి సంభోగం చేసిన సంతానం కలుగును.

 రుతుమతియై స్నానం చేసి శుద్ధురాలై నాగకేసరములను ఆవు పాలతో నూరి త్రాగిన గర్భము దాల్చును (కొంతకాలము వాడవలెను).

 తామర పువ్వులో నుండు కేసరములు పువ్వు మధ్య నుండు దిండు కలిపి నూరి ఆవు పాలతో త్రాగిన గర్భవతి అగును.

గర్బిణీ విష జ్వర చికిత్స:

 సొంటిని మేకపాలతో నూరి త్రాగిన జ్వరం మానును.

మామడి పట్ట , నేరేడు పట్ట వీని కషాయంలో వరిపేలాల పిండి కలిపితినిన జ్వరాతిసారాలు మానును.

పండ్లు రాని పిల్లలకు :

సన్నని రాగికడ్డీని మాలలాగ చేసి పిల్లల మెడలో వేస్తే కొద్ది రోజులలోనే పండ్లు వస్తాయి.

ప్రసవించిన స్త్రీ పుష్టికి:

 సంవత్సరం పాటు నిలవ ఉన్న బెల్లం మితంగా తినిపించిన కొద్ది రోజులలోనే ప్రసవించిన స్త్రీలు సహజంగా శక్తిని పొందుతారు.

యోని శూలలకు:

 నల్ల జిలకర, పిప్పళ్ళు చూర్ణించి కల్లుతో వేయించి సైవర్ఛలవణం కలిపి త్రాగిన యోని శూలమానును.

శిశు రోదనమునకు:

 కరక, తాండ్ర, ఉసిరికలు,పిప్పలి యివి చూర్ణించి తేనె, నెయ్యి కలిపి శిశువుకు నాకించిన ఏడ్పు మాని సుఖముగా యుండును.

పసికూనలకు ధూపము:

 వేపాకు, ఆవాలు, వెల్లుల్లి, వస, చాగవేరు, పాముకుసుమ, మేకవెంట్రుకలు, మేక కొమ్ము,తేనే కలిపి ధూపము వేసిన పసిబిడ్డలకు గలుగు గ్రహబాధలు, జ్వరాలు తొలుగును.

పిల్లల వాక్శుద్ధికి:

 వస, యష్టిమధుకం, సైందవలవణం, కరక్కాయ, వామ్ము, సొంటి, చెంగల్వకోష్టు, పిప్పళ్లు, జిలకర యివి సమభాగాలు చూర్ణించి చిటికెడు నెయ్యిలో కలిపి పిల్లలకు నాకించిన మాటలు చక్కగా వచ్చును.

చన్నులు రాని స్త్రీలకు:

బోడతరం సమూలం నీళ్ళ కాచి గోఘృతములో కలిపి వండి రోజు రెండు పూటల పూసిన చన్నులు వచ్చును.

పచ్చికాగునవేరును తెచ్చి గంధం తీసి చన్ను మొనలకు చుట్టును పూసిన చన్నులు మొలచును.

 చిటిపాలవేరు నూరి ఆవుపాలతో కలిపి 10 రోజులు త్రాగిన చండ్లు మొలచును.

 చిన్నపిల్లల కాళ్ళు చేతులు సన్నగిల్లి, నడువలేకపోయిన:

పుట్టు చచ్చువాతం గల పిల్లలకు పచ్చి ఆవుపాలతో వెన్నతీసి అందులో గోరోజనం కొంచెము ఆ వెన్నెలో కలిపి కాళ్ళు, చేతులకు, పొట్టకు బాగా రుద్దుతూ వున్న కొన్నాళ్ళకు మంచి బలము కలుగును.

చిన్నపిల్లల సమస్త వ్యాధులకు:

 నెయ్యి 2 గ్రాములు, తేనే 4గ్రాములు, కలకండ 8 భాగాలు కలిపి తినిపించిన పిల్లల యొక్క సమస్త వ్యాధులు తేలికగా కుదురును.

జబ్బులు రాకుండా ఉండుటకు, గొర్రె దంతం దారంతో చుట్టి పిల్లల మెడలో కట్టేది.

మరియు

అక్కలకర్ర దారంతో చుట్టి మెడలో కట్టిన జబ్బులు రావు.

గర్భ నిరోధక చిట్కాలు:

 బహిష్టు అయిన రోజులలో ఆవాలు,నూగులు సమభాగాలు మెత్తగా నూరి 3 రోజులు త్రాగిన గర్భం రాదు. ఆముదపుగింజపప్పు బహిస్టు స్నానం చేసిన రోజున గొంతులో వేసుకొని మింగవలెను. ఈ విధముగా రోజుకు 1 గింజ వంతున 7 రోజులు మింగిన జీవితంలో సంతానం కలుగదు.

 బూరుగుపూలు పాలతో నూరి త్రాగిన గర్బం రాదు.

 నేల గొర్మిడాకు పసరు, ఇంగువ కలిపి త్రాగిన గర్బం పడిపోవును.

మూడు ఏండ్ల నాటి పాత బెల్లం తింటూ వున్న గర్బం రాదు.

చిరుబొద్ది కల్కమును బహిస్టు స్నానం చేసిన రోజున త్రాగిన గర్భం కలుగదు

 బహిస్టు అయినప్పుడు పిప్పల్లు,వాయువిడంగాలు, పేల్చిన వెలిగారం వీని చూర్ణములు సమభాగములు పాలతో కలిపి సేవించిన గర్భం రాదు.

చిర్రివేర్లు బియ్యం కడిగిన నీళ్లతో నూరి బహిష్టు స్నానం చేసిన రోజు నుండి 3 రోజులు సేవించిన గర్భం రాదు. రోజు ఒక పసుపుకొమ్ము ముక్కను 6 దినములు తినిన అనగా బహిష్టు అయిన 3 దినములు తర్వాత స్నానం చేసిన 3 దినములు సేవించిన గర్బం రాదు.

తాండ్రకాయ విత్తనములను అర్ధఫలము బియ్యపు కడుగుతో నూరి రుతుకాలమున త్రాగిన సంతానము కలుగదు.

చిత్రమూలం 1 కర్షం వావిలాకు రసంలో కల్వముగా నూరి తేనె కలిపి తినిన రండా స్త్రీ యొక్క గర్బం తక్షణమే బయట పడిపోవును.

స్రావములకు:

 వెంపలివేర్లను కర్షము బియ్యపు కడుగులో నూరి త్రాగిన అతి యోగముతో కూడిన అర్తవ స్రావము శాంతించును.

 ఉసిరిక పప్పు, మద్దిపట్ట, కరక్కాయ వీని చూర్ణం నీటిలో సేవించుటచే స్త్రీల రజస్సు శ్రోణితము నిలిచిపోవును.

గొడ్డు మందు:

 జనపగింజలు 10 గ్రాములు మజ్జిగలో వేసి 3 దినములు నానబెట్టి నానిన పిమ్మట అరసోలెడు ఆవు చల్లతో కలిపి ఒక పూట సేవించిన జారును. పత్యం వుడుకునీళ్ళ అన్నం మూడు రోజులు.

కలరా, మశూచికం, ఆటలమ్మ, :

ఈజాడ్యములు రాకుండా కాపాడుకొను విధము- కరక్కాయ పిక్కకు కన్నం వేసి మొగవారైన కుడి చేతికి ఆడవారైన యడమ చేతికి కట్టుకున్న ఎడల కలరా మొదలైన జాడ్యములు నిశ్చయముగా రావు. - యేనుగుదంతముతో చేసిన దువ్వెన వాడిన వారికి కలరా వ్యాధి యెన్నటికి రాదు.

జిల్లేడిపూలు తెచ్చి ఎండబెట్టి చూర్ణించి గురిగింజ ఎత్తు తినిన కలరా వ్యాధి నశించును.

బోడతరము కాయలు తెచ్చి దండగా కుట్టి మశూచికం గల వారి మెడకు గాని, చేతికి గాని కట్టిన మశూచికం మానును. మశూచికం ఎక్కువగా వున్న వారికి బోడతరం కాయలను తినిపించిన, మెడకు దండగా వేసిన బాగౌను. ఇది అనుభవ రహస్యము.

ప్లేగు జాడ్యము రాకుండుటకు:

మనము నివశించు చుట్టు పక్కల ప్లేగువ్యాధి కనబడిన వెంటనే వేడి నీటిలో కొంచెం సైందవలవణం కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున త్రాగవలెను. ఈ పద్ధతి ప్రతి వారుచేసిన ప్లేగువ్యాధి నుండి విముక్తులగుదురు.

మలేరియా:

ఉప్పు నీరు త్రాగిన మలేరియా జ్వరం నిశ్చయముగా పోవును. ఉప్పు నీరు చేయు పద్ధతి :- 3 లేక 4 ఔన్సులు త్రాగుటకు పనికివచ్చు నీరులో ఉప్పు కొంచెం ఆ నీటికి సరిపోవునంత కలుపవలెను. ఈ నీరు ప్రతిరోజుఉదయాన్నే త్రాగుచున్న,( పంచదార వేయకుండా తయారు చేసిన నీరు కూడా పై నీళ్ళ వలె పనిచేయును) మన్యపు జ్వరం, కడుపులోబల్లలు చేత జ్వరంగా వుండి బాధపడేవారు నయమగుదురు. సాయంత్రం కూడా పై చెప్పిన ప్రకారం త్రాగవలెను.

 అండ వృద్ధికి:

 మోదుగపూలు అండమునకు వేసి కట్టిన బహు ఆశ్చర్యముగా హరించిపోవును.

గచ్చపప్పు, ఇంగువ,వెల్లుల్లి సమభాగాలు దంచి కషాయం కాచి నెయ్యి తగుమాత్రం కలిపి త్రాగిన మానును. తిప్పతీగకషాయం కాచి తేనె, మైసాక్షి, చెక్కర కలిపి మూడు దినములు త్రాగిన అండవాతాలు మానును. పొగాకును నీళ్ళతో తడిపి బీజానికి వేసి కట్టిన గంటకు వాంతి అగును. భయపడరాదు. దీని వలన వరిబీజం తప్పక బాగు పడును.

 మానిపసుపు చూర్ణం 1 తులం, ఆవు పంచితం కలిపి త్రాగిన చిరకాలము నుంచి ఉన్న అండవాతం తప్పక హరించును.

వాత, కఫ అండ వాతానికి త్రిఫలాల బెరడు దంచి ఆవుపంచితాన కాంచి వడ గట్టి తగు మాత్రం త్రాగిన అండవాతం మానును.

 త్రికటుకములు, త్రిఫలాలు దంచి కషాయం కాంచి సైందవలవణం నవాక్షారం కలిపి త్రాగిన బేది అయి కఫవాతాన గలిగిన అండవాతం మానును.

 అత్తి,జివ్వి, పుల్లబచ్చలి నూరి పట్టు వేసిన మానును. ఇదే కషాయం బెట్టి త్రాగవచ్చును.

 ఉర్లగడ్డ కుమ్ములో ఉడికించి నూరి వేడి వేడిగా కట్టిన మానును.

సున్నం, కోడిగుడ్లసొన కలిపి నూరి పట్టు వేసిన మానును.

సన్న ఆవాలు, చిత్రమూలం, మెంతులు వెల్లుల్లి ఇవి సమభాగాలు నీళ్ళతో నూరి పట్టించేది.

పాపరవేరును చిట్టి ఆముదాన మెత్తగా నూరి ఆవు పాలతో కలిపి 3 రోజులు త్రాగిన అండవాతం నొప్పి మానును.

 ఆవుపాలు కాచి అందులో ఆముదం కలిపి ఒక నెల ప్రతిరోజు ఉదయం త్రాగిన అండవాతం మానును.

వజ, ఆవాలు నీళ్ళతో నూరి పట్టించేది.

గోధుమపిండి కోడిగుడ్డుజనతో నూరి కట్టేది.

ఉప్పుడు బియ్యం , తవుడు కలిలో ఉడికించి కట్టేది.

వులవలు, మిరియాలు, గానుగపిండి నూరి వెచ్చ చేసి కట్టేది.

గాడిద గడపాకు ఆవు పాలతో ఉడికించి కట్టేది.

గచ్చచిగుర్లు, ఆముదాన ఉడికించి కట్టేది.

గానుగపప్పు, గచ్చపప్పు, ఆముదపుపప్పు నూరి వెచ్చచేసి కట్టేది.

కోడిగుడ్డు తెల్లజన, ఇంగువ, రాతి సున్నం, ఇవి నూరి గుడ్డకు పట్టించి కట్టేది.

 జిల్లేడి ఆకులకు ఆముదం పూసి ఆముదంతో వెలిగించిన దీపానవెచ్చ చేసి గోరువెచ్చగా ఉండంగానే ఆకులను వేసి వ్రణములకు వేసి కట్టిన వాపుపోయి సహజస్థితికి వచ్చును.

అండ వృద్దులు హరించుటకు గొప్ప చిట్కా:

కరక పెచ్చులు, నేలవేము, ధనియాలు యీ వస్తువులు ఒక్కొక్క తులం,లవంగాలు 1.5 తులం, సునాముఖి ఆకు4 తులాలు, కలకండ 12 తులాలు యీ వస్తువులు అన్ని కలిపి దంచి అందులో 12 తులాల తేనె కల్పి లేహ్యం తయారు చేసి పూటకు కూకుడు గింజంత పరిమాణంలో రోజు రెండు పూటల తినిన యెడల అన్నిరకాల అండ వృద్ధులు హరించిపోవును. అండ వృద్దులకు దీనికి మించిన ఔషదము లేదు.

దానిమ్మ ఆకులను నూరి కట్టిన నరములాగుట మానును.

నారి పుండ్లకు చికిత్స:

 జిల్లేడిమొగ్గలు, బెల్లం చేర్చి 3 రోజులు కట్టిన పుండు మాని బాధ తగ్గును.

 నేల గొర్మిడాకు ఆదివారం తెచ్చి నూరి నారి పుండ్లపై పెట్టి మరునాడు నీళ్ళచే కడిగిన నారి వూడివచ్చును. జెముడుకాడలు జొప్పు, తమలపాకులు, వక్కలు,సున్నము మెత్తగా నూరి బిల్ల చేసి నారిపుండుపై వేసి కట్టిన నారి కట్టులోకి వూడివచ్చును.

 ఇంగువ, సీతాఫల ఆకు రసంలో నూరి పుండుకు పూసిన పురుగులు చచ్చి, పుండు మానును.

కొరుకుడు పుండ్లకు:

పొంగించిన పటిక, ముర్దారుసింగ్ రసకర్పూరం, ఇంగ్లీకంకల నూరి వెన్నతో కలిపి పూసిన పొక్కు, చెల్ది కొరుకుడు పుండ్లు మానును.

మేహవాత గడ్డలకు మలాం:

 గుగ్గిలం పల్కు, సాంబ్రాణి, ఆరతికర్పూరం అన్ని సమభాగాలు నల్లమందు కొంచెం వేసి మెత్తగా నూరి గడ్డలకు వేసి కట్టిన కరిగి మానును.

చెల్లి పుండ్లకు:

గాడిద గడపాకు రసంలో కొలత పావు శనగలు పోసి నానబెట్టి తీసి ఎండించి ఆ శనగలు ప్రతి దినం తింటూ వున్న చెల్లి పుండ్లు మానును ( చప్పిడి పత్యం కందిపప్పు అన్నం తినేది).

మేహజిల మూగతీట కురుపులకు:

 శుద్దిగంధకం పావు తులం తంగేడి ఆకు రసంలో కలిపి ఆదివారం, బేస్తవారం కడుపులోకి పొద్దునపూట యిచ్చి ఉప్పు లేకుండా పులగం నెయ్యి పత్యం చేసిన మేహజి మూగ తీట జిలపుండ్లు మానును.

తగిరిశగింజలు, బావంచాలు,ఆవాలు,నూగులు సమభాగాలు పెరుగు మీది తేటతో నూరి వల్లుకు పూసిన మేహ జిల తీట మానును.

గజ్జి కురుపులు :

 రావిపట్టమసి, కొత్త సున్నం, వెన్న కలిపి నూరి పూసిన కురుపులు మానును.

గేదె పేడ కట్టిన మానును.

 వేప ఆకు కాల్చి మసి చేసి ఆ మసిలో నెయ్యి కలిపి పట్టించిన మానును.

పత్తి ఆకు నూరి ఆముదం కలిపి పట్టించిన మొలగజ్జి మానును. పసపుచూర్ణం,

జిల్లేడాకు రసంలో కలిపి అందులో ఆవనూనె కొంచెం వేసి వెచ్చచేసి రాసిన గజ్జి మానును.

 సున్నం కాని కుంకుమ గాని ఆముదంలో వేసి రాసిన గజ్జి మచ్చలు మానును.

తామర మందు:

 కలకండ,పటిక, గంధం వీనిని మంచినీళ్ళతో నూరి రాసిన మానును.

తేలు విషానికి చికిత్సలు :
తేలు కుట్టి వల్లంతా చమటలు కమ్మి సీతలము గల్గిన వెంటనే కలిలో పసుపు కలిపి తాపిన విషం దిగును. నేపాలపు గింజ నీళ్ళతో సాది కుట్టిన చోట పట్టించిన విషం దిగి కుటిన చోట కూడా నొప్పి ఉండదు.

వెంపలి వేరును తేలు కుట్టిన చోటు నుండి దిగదిడుచి క్రింద వేసిన విషం దిగును ఆ వేరును దిగదుడిచి నెత్తిన బెట్టిన విషము ఎక్కును..

 కసివెంద వేరును నోట్లో పెట్టుకొని కొంచెం నమిలి తేలు కుట్టిన వానికి చెవిలో వూదిన వెంటనే విషం దిగును. పొద్దుతిరుగుడు చెట్టు ఆకు నలిపి వాసన చూచిన వెంటనే విషయం దిగును.

ఎర్రపత్తికాయ రసం త్రాగిన నాభి మొదలైన విషాలు విరిగి పోవును.

నేపాలపు గింజ జిల్లేడి పాలతో నూరి కుట్టిన చోట పట్టించినచో విషం దిగును.

గురిగింజ ఎత్తు పటిక నీళ్ళలో కలిపి త్రాగిన వెంటనే విషం దిగును.

 కుంకుడుకాయ పప్పు తినిన విషం దిగును.

సంకేసులాకు నలిపి విషం ఎక్కిన తావు నుంచి ఆకు గట్టిగా పట్టి కుట్టిన తావుకు తీసుకొని వచ్చిన వెంటనే విషము దిగును. అదేఆకు వేసికుట్టినచోట కట్టేది.

పులిచంచలాకు పై మాదిరి చేసిన విషం దిగి ఏడుస్తూ వచ్చిన వారు నవ్వుతూ పోవుదురు.

 జిల్లేడు పాలు దూది తడిపి కుట్టిన తావుకు పెట్టిన విషం దిగును.

చిల్లగింజ జిల్లేడు పాలతో సాది కుట్టిన తావున అంటించిన విషం దిగును.

 చింతగింజ పై మాదిరి చేసేది. విషం విరిగిపోవును.

కానగపప్పు, పటిక నూరి కుట్టిన తావున బెట్టిన వెంటనే బాధ తగ్గును.

తేలుకుట్టిన వెంటనే చేదు పుచ్చకాయ ముక్క నమిలిన వెంటనే బాధ మానును.

తేలు కరిచిన తావున పటిక పొంగించి పెట్టిన విషం దిగి బాధ మానును.

 నల్ల ఉమ్మెత్తాకు నలిపి కుట్టిన తావున కట్టిన 5 నిమిషములలో బాధ మానును.

పిచ్చికుక్క కరిచిన చికిత్స :

ఉత్తరేణి లేతవెన్నులు పంచదార కలిపి నూరి మాత్రలు చేసి తినిన వెర్రి కుక్క విషం హరించును.

 వూడుగవేరు పాలతో నూరి త్రాగిన విషం హరించును.

నూవ్వులనూనె,జిల్లేడిపాలు, బెల్లం కలిపి తినిన విషం దిగును.

 నెయ్యి,కలబంద రసం రెండు కాంచి సైందవలవణం కలిపి రోజు రెండు పూటల మూడు రోజులు త్రాగిన పిచ్చికుక్క విషం దిగును.

 నల్లజిలకర, తెల్లజిలకర,మిరియాలు సమభాగం కలిపి నూరి పూటకు పావు తులం మంచినీళ్ళతో రోజు 2 పూటల 1 నెల త్రాగిన పిచ్చికుక్క విషం హరించును. ఆరోగ్యం గల్గును. నీరుల్లిపాయ తేనేతో నూరికాటుపై వేసి కట్టవలెను.

 ఆముదపుఆకు యిగుర్లు సున్నం నూరి కరిచిన తావున వేచి కట్టిన బాగౌను.

కోడిమలం లేక బెల్లం, జిల్లేడిపాలు, నూనె కలిపి పూసేది.

 పచ్చజొన్న పిండి, ఆముదపు ఆకు యిగుర్లు నూరి కట్టేది.

కందిరీగలు, తేనెటీగల విషానికి:

ఉత్తరేణి ఆకు రసం పూసిన నయమగును.

ఎలుక విషానికి:

 వేపచెట్టు తాట గంధం తీసి పాలతో కలిపి 3 రోజులు త్రాగిన ఎలుక విషం మానును. చప్పిడి పత్యం.

జెర్రి కరిచిన:

 సోపు నూరి కాటుపై పట్టించిన విషం పోవును.

 వావిలాకురసంలో పుట్టమన్ను కొంచెం కలిపి త్రాగిన వెంటనే బాధ తగ్గును.

తొండ కరిచిన:

 వజ, జిల్లేడివేరు మెత్తగా నూరి పొడి చేసి ఉడుకునీళ్ళలో వేసి త్రాగిన తొండ విషం మానును.

పాము విషానికి:

సహదేవి ఆకు పసరులో కుంకుడుకాయ నానబెట్టి నూరి రసం తీసి ముక్కులలో వేసిన విషం దిగును. వెర్రివామ్ము వేపనూనెలో నూరి మాత్రలు వేసి వుంచుకొని వాము తగిలిన పశువులకు గాని, బాలింతరోగాలకు గాని, పాము విషాలకు గాని కంటికి కలికం వేసిన గడియలో బాగౌను.

నాగముష్టి వేరు గంధం తాపిన విషం దిగి బాగవును.

 నశ్యం, మిరియాలు చూర్ణం సమభాగాలు కలిపి మూట గట్టి వేడినీళ్ళలో తడిపి కొంచెం వెచ్చగా ఉండునట్లు చూచి కండ్లలో ముక్కులలో వేయ ఎటువంటి పాము విషమైన దిగిపోయి మనిషి బ్రతుకును.

పాము కరిచిన వానికి వజ, ఇంగువ నూరి నీళ్ళ చేత కాళ్ళకు, చేతులకు రుద్దిన ఒక జాములో విషం దిగును.

అతనికి జన్మలో పాములు కరవవు.

ఏది అందుబాటులో లేని యెడల తన మూత్రంగాని, వేరే వాండ్ల మూత్రంగాని త్రాగిన విషం యెక్కదు. జిల్లేడుఆకు వెనక నుండు తెల్లటి నూగును గోటితో గీకి తెచ్చి దానిలో జిల్లేడిపాలు పోసి నూరి శనగలంత మాత్రలు చేసి అరగంటకుఒకటి నీళ్ళ అనుపానముతో మింగిన 7 మాత్రలకే నోటికి చేదు వచ్చును. అప్పటికి విషం దిగినదని తెలుసుకొని తర్వాత ఇవ్వకూడదు. అటుపై మనుజుడు జీవించును.

నెమలిగుడ్డు తెచ్చి అందులో తెల్ల మిరియాలు పొడిచేసి ఎండించి దానిని చూర్ణించి పాము కరిచిన వానికి నోట్లో వేసి తినిపించి కొంత ముక్కులలోను మరికొంత కరిచిన కాటుపైన వేసి రుద్దిన విషం దిగి బ్రతుకును.

బొల్లికి:

 తెల్ల బొల్లికి చికిత్స అరటి పండు ఎండించి కాల్చిన బూడిద క్షారం తీసి అందులో పసుపు కలిపి తిని పైకి రాసిన బొల్లి మచ్చలు మానును.

నూగులు,బావంచాలు సమానభాగాలు నూరి 1 సం|| తినిన తెల్లమచ్చలు మానును.

యిప్ప పువ్వు రోజు 2 పూటల తింటూ వున్న 6 మాసాలో శరీరమంతా వ్యాపించిన తెల్లబొల్లి మచ్చలు మానును.

మూడువేళ్ళకు వచ్చినంత తినేది.

దిరసనపు గింజల నూనె పూసిన మానును.

 ముల్లంగి గింజలను ఉత్తరేణి ఆకురసంతో నూరి తెల్లని మచ్చలపై రాసిన 3వారాలలో బొల్లి మానును.

 కుంకుమ పువ్వు రేలవేరు నీళ్ళతో అరగదీసిన గంధం రోజుకు 3 సార్లు మచ్చలకు పూసిన నెలరోజులలో తగ్గిపోవును.

వేపాకులు, పసుపు,పిప్పల్లు, బావంచాలు వీనిని సమభాగాలు చూర్ణించి తులం వంతున ప్రతి దినం వేడినీళ్ళలో త్రాగి పాలు అన్నం తినుచుండిన శ్వేతకుష్టువు నశించును.

కాలి ఆనెలకు చికిత్స:

 ఏనుగలద్దె కాళ్లకు రుద్దుచుండిన ఆనెలు పోవును.

మనిషి చెవిలోని గుబిలి ఆనెలకు పూసిన మానును.

 ఎనుము నెయ్యిలో ఎర్రగడ్డలు వేయించి అన్నములో 20 రోజులు తినిన ఆనెలు వూడిపోవును. యీ ఎర్రగడ్డలు తప్ప మరి యే కూరలు వాడరాదు.

 కలబంద పట్ట చీల్చి ఆనెలపై వేసి కట్టేది.

అరచేతులు, ఆరికాళ్ళ మంటలకు:

 నల్లేరు కాడలు మర్దన చేసిన తగ్గును.

 కానుగచిగుర్లు, రాగిచిగుర్లు, వెలగచిగుర్లు నీళ్ళలో కాంచి త్రాగిన మంటలు తగ్గును.

అరచేతిలో మచ్చలకు:

 కరక, చిత్రమూలం, నిమ్మపండ్ల రసంతో నూరి ప్రతి రోజు రుద్దుచుండిన మానును.

కడుపులో మంటకు:

 రాగిపండ్ల గింజలు 1తులం నీళ్లతో నూరి అందులో కలకండ అర తులం కలిపి తినిన వారం రోజులలో ఎటువంటి కడుపులో మంటలయిన నయమగును.

సర్వరోగ హర యోగము:

 కరక్కాయ పెచ్చులు, సొంటి , సైందవలవణం,యీ వస్తువులు సమభాగాలు తీసుకొని చూర్ణించి పూటకు పావుతులం తేనేతో గాని మంచినీళ్ళతో గాని త్రాగిన సర్వవ్యాధులు హరించును.

నత్తికి:

 పొంగించిన పటిక మెత్తగా నూరి రాత్రి పండుకునే ముందు ఒక బేడ ఎత్తు చూర్ణం నోట్లో వేసుకొని మింగుచుండిన నెలరోజులలో నత్తి పోయి స్వచ్చముగా మాటలు వచ్చును.

ఆకుపత్రి ఎప్పుడూ నోటి యందుంచుకొని నమలు చుండిన నత్తి హరించి పోవును.

అక్కలకర్ర గంధము ప్రతి నిత్యము నాలుకకు రాయుచుండిన నత్తి మానును.

కీళ్ళ నొప్పులు:

 లేత మునగాకు నేతిలో వేయించి తింటూ వున్న 2 లేక 3 వారములలో కీళ్ళ నొప్పులు హరించును.

జ్ఞాపకశక్తికి అమోఘమైన చిట్కా:

 కరకబెరడు, పిప్పలికట్టె, తిప్పతీగ, వాయువిడంగాలు, యష్టిమధుకం, సన్న పిప్పళ్ళు, బోడతరం, తుంగముట్టెలు యీ వస్తువులు ప్రతిది ఒక్కొక్క తులం వంతున చూర్ణం చేసి ప్రతిరోజు ఉదయం పూట మూడు వేళ్ళకు వచ్చినంత చూర్ణం నేతితో కలిపి తింటూ వున్న అధికమైన జ్ఞాపకశక్తి కలుగును.

వెంట్రుకలు రాలకుండా యుండుటకు:

 మందారపువ్వులు, గోమూత్రముతో నూరి తలకు పట్టించిన వెంట్రుకలు రాలకుండా యుండును.

నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు:

 వేపనూనె ప్రతినిత్యము రెండు ముక్కులలో 4 చుక్కలు వేయుచున్న నల్లబడును.

పార్శపు నొప్పులకు:

 అల్లం రసములో బెల్లం కలిపి వడపోసి ఆద్రవాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులలో వేయ ఎంతటి అసాధ్యమైన పార్శపు నొప్పి అయినా వెంటనే తగ్గిపోవును.

అరచేతులు, అరికాళ్ళు పొరలు వూడుచుండిన:

అల్లం, బెల్లం సమాన భాగాలుగా కలిపి ప్రతిరోజు తింటూ వున్న నాలుకమీద, అరచేతులు, అరికాళ్ళు మీద పొరలు వూడుట మానును.

సుఖ నిద్రకు:

 గసాలు వేయించి మెత్తటి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని గుడ్డలో మూట కట్టి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే హాయిగా నిద్ర కలుగును.

చెవుడుకు:

 ఉత్తరేణిపూలు, ఆకులు, వేరు వీటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిద నూగులనూనెలో వేసి కాంచి వడగట్టి ప్రతిరోజు చెవిలో రెండు చుక్కలు వేస్తూ యుండిన చెవిలో చీము, చెవిలో ధ్వని, చెవిలో కురుపులు,గడ్డలు,చెవుడుగా గల సమస్త చెవి వ్యాధులు హరించును.

పొడి దగ్గుకు:

 జామపూలు, ఆవుపాలలో వేసి కాచి వడపోసుకుని చెక్కర కలిపి త్రాగిన పొడిదగ్గు తగ్గిపోతుంది.

కడుపు నొప్పులకు:

 జామ పూవులను కూరగా వండుకొని అందులో కొద్దిగా సైందవలవణం కలుపుకొని తింటూ వున్న కడుపునొప్పి తగ్గిపోతుంది.

త్రిదోషహారి:

ప్రతిరోజు ఉదయాన్నే ఒక నిమ్మపండు రసం 2 టీ స్పూనులు తేనె కలిపి అరగ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగుతూ వున్న పక్షవాతం దరిదాపులకు రాదు. త్రిదోషాలు మానును.

నేలతంగేడు మూలికా యోగం:

 నేలతంగేడు చెట్టు సమూలం వేర్లతో కూడా ఆదివారం తెచ్చి నీడలో ఆరించి మెత్తగా చూర్ణించి వస్త్ర ఘాళితం చేసి పావుతులం మొదలు అరతులం వరకు ఈ క్రింది అనుపానాలతో సేవించిన సర్వరోగములు మానును.

అనుపానము  --  వ్యాధులు                

చెక్కరతో  -- సత్తువ వచ్చును

పుల్లకలితో --  శగవ్యాధులు మానును

జాపత్రితో -- బల్లలు కరుగును

ఆవు మజ్జిగతో --  అంటుశగలు మానును

కలకండతో --  కాళ్ళు మంటలు మానును

పిప్పలితో -- వాతరోగాలు మానును

బెల్లంతో  --  ముట్టుకట్టు నొప్పి

సైందవలవణంతో --  దోషజ్వరాలు మానును

 ఆవు పెరుగుతో -- శూల నొప్పులు మానును

నెయ్యితో --  స్వప్న స్కలనం మానును

మేకపాలతో --  ఇంద్రియ వృద్ధి కలుగును

కర్జూరపండుతో --  నోటికి రుచి కలుగును

దానిమ్మతో-- తలనొప్పులు మానును

ఆవుచల్లతో --   పైత్యములు తొలగును

కాటికాకురసంతో --  తెల్లనివెంట్రుకలు నల్లనగును

 ఉసిరికరసం కండ్లలోవేయ --  కండ్లకు దృష్టి కలుగును వెర్రిమానును

జానరసంబుతో --  మొలల వ్యాధి నివారించును 

ఆవుపాలతో -- వాతరోగాలు మానును

దానిమ్మవేర్ల రసంతో --   నెత్తురుబంక బేదులు మానును

పాచినీళ్ళతో --  కడుపులోని క్రిములు బయటపడును

పుల్లనికలితో --   నల్ల పొడలు మానును

వంకాయ రసంతో -- మేహరాళ్ళు కరిగి మూత్రంలో వచ్చును

నేలతంగేడి మూలిక వలన యిన్ని రోగములు  బాగావును .

చింతచెట్టు యోగములు:

 చింతచిగురు దొరికే కాలములో ఎక్కువగా సేకరించి ఎండించి ఉంచుకొని తర్వాత వారానికి ఒకతూరి పప్పులో వేసి కూరగా వండుకొని తినిన మొలల వ్యాధి, లివర్ వ్యాధులు, ఉదరాలు తగ్గును.

బుడ్డలకు ముదురు చింతాకు ఆముదంలో వుడికించి బుడ్డలకు వేసి కట్టిన వాపు నొప్పి తగ్గును.

మత్తు వస్తువుల విరుగుడుకు సిగరెట్లు,పాన్ బీడాలు,గంజాయి, సారాయి, బ్రాంది మొదలైన వాటిని ఎక్కువగా వాడినవారు ప్రతిరోజు క్రమం తప్పక చింతాకురసం ఔషదంగా పూటకు చెంచా మోతాదులో త్రాగుచుండిన పై చెప్పిన విషాలు విరిగిపోవును.

చలి జ్వరానికి చింతాకురసంతో చారు తయారు చేసుకొని కొద్ది కొద్దిగా త్రాగుచుండిన జ్వరం తీవ్రత తగ్గుతుంది. పత్యంగా కూడా ఉపయోగపడుతుంది.

చింతపూవు తినుట వలన రక్త విరేచనాలు, పైత్యరోగాలు, వాతరోగాలు, శ్లేష్మరోగాలు హరించి ఊపిరితిత్తుల వ్యాధుతగ్గును. శరీరంలో పేరుకున్న విషపదార్థాలు అన్ని తగ్గిపోవును.

చింతకాయ పచ్చడి తింటూ వున్న ఎడల ఏ వ్యాధులు మనిల్ని బాధించవు. .

చింతపూవు రసం త్రాగుతూ వున్న పేగులోని క్రిములు హరించి పేగులు శుభ్రపడును.

మధుమేహానికి:

 చింతచెట్టు బెరడును మెత్తగా చూర్ణించి రెండు పూటలా 5గ్రాముల వంతున తింటూ వున్న మధుమేహ వ్యాధి మాయమై పోతుంది.

దెబ్బలకు, వాపులకు:

 చింతపండు గుజ్జును వేడి చేసి దెబ్బలమీద కట్టిన నొప్పులు వాపులు మానును.

కీళ్ళ నొప్పులకు:

చింతచెట్టు లేత చిగురాకుల పొడిని నెయ్యితో గాని ఆముదంతో గాని వట్టి ఆకుగాని వేయించి దానిని గుడ్డలో వేసి మూటకట్టి కీళ్ళ నొప్పుల పైన కాపడం పెట్టిన వెంటనే బాధ తగ్గుతుంది. కొంతకాలం రోజు చేస్తూ వుండిన కీళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గిపోవును.

సంభోగ సుఖానికి:

 చింతగింజల పొడి, తాటిబెల్లం, వేయించిన వామ్ము పొడి సమభాగాలు కలిపి తేనెతో 10 గ్రాములు సేవించాలి. సంభోగానికి గంట ముందుగా యీ మందు తినిన యిందులోని ఫలితము మీరే తెలుసుకుంటారు.

విరేచనాలకు :

చింతగింజల చూర్ణం అంబలిగా తయారు చేసి త్రాగిన వెంటనే విరేచనాలు కట్టుకుంటాయి.

జిల్లేడు చెట్టు ఉపయోగం:

 జిల్లేడి పువ్వు ఆకలిని కలిగించును మరియు శ్వాసకాసలు, మూల శంఖలు హరించును. తాంబూలములో చేర్చి తినిన పొడిదగ్గు, శ్లేష్మము, వగర్పు తగ్గిపోవును.

జిల్లేడు వేరుతాట నూరి పట్టించిన అండవృద్ధులుమానును.

జిల్లేడు పాలు పిప్పిగల పంటి రంధ్రములో ఒక చుక్క వేసిన పురుగు చచ్చును.

 తేలు కాటుకు ఆకు మెత్తగా నూరి  కుట్టిన తావున కట్టి గుడ్డ పొగ వేయ మానును.

పుండ్లపైన కట్టుటకు దీనికి మించిన ఆకు లేదు.

తెల్లజిల్లేడి పూలరసం నందు పసుపు కలిపి త్రాగిన ఎలుక విషం హరించును.

వేరుపట్ట మెత్తగా నూరి ఎండించిన చూర్ణం పావలాఎత్తు చెక్కర కలిపి ఉదయం పూట 3 రోజులు యిచ్చిన బాగవును. పత్యం చప్పిడి.

మర్రిచెట్టు యొక్క అద్భుత యోగములు:

 మర్రిచెట్టు పాలు ప్రాత:కాలమున 1 అణా ఎత్తు పంచదార కలిపి మొదటి రోజు త్రాగవలెను. రెండవ రోజు 2 అణాల ఎత్తు యీ ప్రకారం పెంచుతూ 11 అణాల ఎత్తు వరకు త్రాగిన వీర్యనష్టం, స్త్రీల బట్టంటు మూత్ర బంధన పూర్తిగా తగ్గించును. మెదడుకు, గుండెకు మంచి బలము చేకూర్చును. ఆరోగ్యము పుష్టి కలుగును.

 బురదలో తిరిగే వారికి కాళ్ళు పేలి బాధపడేవారు మర్రిపాలు పూసిన బాగవును.

 శరీరం పైన ఎక్కడైనా మంటగా ఉన్న మర్రిపాలు పూసిన బాధ మానును.

పిక్కలపైన తొడల పైన గడ్డలు కట్టిన మర్రిపాలు పట్టీ వేసిన అణిగికాని పగిలికాని పోయి మానును.

 నడుము నొప్పికి మర్రిపాలు పట్టీ వేసిన 3 రోజులల్లో బాగుపడును.

పిప్పి పంటికి పైన మర్రిపాలు వేసిన పురుగు చచ్చి బాధ తగ్గిపోవును.

 చెవిపోటుకు రెండు,మూడు చుక్కలు చెవిలో వేసిన పురుగు చచ్చి చెవి నొప్పి తగ్గును.

 ఒక చుక్క కంటిలో వేసిన కండ్లు మంటలు తగ్గిపోవును.

పోటుపెట్టు చుండె సెగగడ్డల పైన మర్రిపాలు పట్టీ వేసిన బాధ తగ్గిపోవును.

 బొడ్డులోపల బొడ్డుచుట్టూ మర్రిపాలు పట్టించిన ఎడల రకరకములైన విరేచనములు అద్భుతముగా తగ్గిపోవును.

 మర్రిపాలు, పాముకుసుమ రెండు కలిపి నూరి నారి కురుపులకు వేసిన కొద్దిరోజులలో సమూలంగా మానిపోవును

 ఒక బేడ ఎత్తు మర్రిపాలు పంచదారలో కలిపి ఉదయం పూట త్రాగిన మూత్రబంధన తగ్గిపోవును.

 రక్తమొలల వ్యా ధి వలన గాని, స్త్రీల ఎర్రబట్ట వలన గాని ఇతర కారణాల వలన గాని ఏ భాగముందైనను రక్తం పోవుచుండిన అయిదారు చుక్కలు మర్రిపాలు పంచదారలో కలిపి రోజుకు 4 సార్లు తినిన 2 రోజులలో తగ్గిపోయి ఆరోగ్యము కలుగును.

మెడచుట్టు గడ్డలు లేచే కంఠమాల వ్యాధికి మర్రిపాలు పట్టి వేసిన తొందరగా మానును.

కత్తి నరుకులు గాని మరి ఏ విధమయిన గాయములకు గాని మర్రిపాలు పట్టించిన తొందరగా మాని చర్మం అతుకుకొనునట్లు చేయును.

 మర్రిచెట్టు వేరుపై తాటను దంచి నీళ్ళు వేసి కాచి త్రాగిన బహుమూత్రం తగ్గును.

 మర్రిచెట్టు పచ్చిబెరడు తీసి దంచి తీసిన రసం పూటకు మూడు తులాలు త్రాగిన మధుమేహం నిశ్చయముగా హరించును.

లేత మర్రి వూడలు నీళ్ళతో దంచి రసం తీసి వాలిపోయిన స్తనములకు 3 వారాలు లేపనం చేసిన తప్పక దృఢమగును.

 లేతమర్రి ఆకులను నీడన ఆరించి చూర్ణం చేసి ఆ చూర్ణం పావుతులం పావు పంచదార కలిపి సేవించిన 40 రోజులలో మూత్రబంధనము, మూత్రకృచ్చవ్యాధి రాకుండా జీవితమంతా కాపాడును.

 మర్రిచెక్క రాగిచెక్క దంచి కషాయం తీసి నోటితో పుక్కిలించిన చిగుళ్ళువాపు పంటి నొప్పి మానును. మర్రివూడల కొనల నుండు సన్నని పీచులాంటి దానిని నీళ్ళతో నూరి త్రాగుచుండిన ఏ మందుకు నిలువని వాంతులు కట్టి పోవును.

మర్రివూడల కొనలు పెరుగుతో నూరి కాలిన శరీరంపై పట్టు వేసిన మంటలు పోట్లు తగ్గి మానిపోవును.

లేత మర్రివూడలు నీడన ఆరించి చూర్ణం చేసి అందులో సగభాగం

పంచదార కలిపి రోజు అరతులం తింటూ వున్న వారం రోజులలో మూత్రం పచ్చగా వచ్చుట, వీర్యం పలుచన, మూత్రం పోయునప్పుడు మంట మొదలయిన మేహ వ్యాధులు హరించి శరీరమునకు బలము గలుగును.

కత్తి మొదలయిన ఆయుధములు తెగినపుడు గాయం రెండు అంచులను ఒకటిగా చేసి వెచ్చచేసిన మర్రి ఆకులను వేసి కట్టిన 3 రోజులలో గాయం మాని ఆ చర్మం ఆశ్చర్యముగా కలిసిపోవును.

మర్రి పచ్చికాయలను నీడన ఆరించి చూర్ణం చేసి అందు 1.5 తులం చూర్ణమును పాలు పంచదార కలిపి త్రాగుచుండిన యడల స్త్రీల యొక్క బట్టంటు వ్యాధులు పురుషుల వీర్యనష్టములు హరించి శరీరమునకు అమిత బలం వచ్చును.

సెగగడ్డల పైన మర్రి ఆకులు వెచ్చచేసి కట్టిన పగిలి మానును.

పండుమర్రి ఆకులు కాల్చి మసిచేసి అందులో మైనము నెయ్యి చేర్చి నూరగా మలాం తయారగును. అది పుండ్లపై పట్టించిన అన్ని రకాలైన పుండ్లు మానును.

లేత మర్రివూడలు, లేత ఆకులు, లేతకాయలు కరక్కాయలు, తాండ్ర ఉసిరిక కాయలు ప్రతిది ఒక తులం చొప్పున మర్దించి అందు 3 తులాలు సరస్వతి ఆకు చూర్ణం ఒక తులం మర్రిపాలున్నూ కలిపి నూరి శనగల వలె మాత్రలు చేసి పూటకు రెండు వంతున నీళ్ళతో గాని, పాలతో గాని త్రాగవలెను. దీని వలన అన్ని రకములయిన స్త్రీల వ్యాధులు, వాతవ్యాధులు, శ్లేష్మ వ్యాధులు,కడుపులో బల్లలు, మూత్రపిండ వ్యాధులు హరించి స్త్రీల, పురుషులకు నవ యవ్వనము గలిగించును. ఇది ఒక మహాయోగి చెప్పిన యోగం. ఈ ఔసదము వలన పిచ్చివ్యాధి కూడా నయమగును. ఈ ఔషదం తినేటప్పుటు వేడి చేసే వస్తువులు తినరాదు.

కడుపులో పుండ్లకు:

 ప్రతిరోజు 2 పూటల ఒక కప్పు పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి త్రాగుతూ వున్న కడుపులోని పుండ్లు మానును.

క్షయకు:

 వెల్లుల్లి రసం రోజు త్రాగిన క్షయవ్యాధి దరిచేరదు.

యెక్కిళ్ళకు :

గోరువెచ్చని నీటిలో కరక్కాయ చూర్ణం కలిపి త్రాగేది.

సునాముఖి రసాయనం:

ప్రతిరోజు 2 పూటలా రెండున్నర గ్రాము సునాముఖి చూర్ణం కలకండ పొడి కలిపి తింటూ వున్న శరీరానికి అమిత బలము కలుగును.

ప్రతి దినము 2 పూటల రెండున్నర గ్రాము సునాముఖి ఆకు చూర్ణం గుల్ కందులో కలిపి తినిన అగ్నిమాంద్యం హరించి ఆకలి బాగా కలుగును.

 రోజు 2 సార్లు సునాముఖి రెండున్నర గ్రాము వేడిపాలు 50 గ్రాములు కలిపి త్రాగిన నపుంసకత్వం హరించి మగతనం యెక్కువ అగును.

రోజు రెండుసార్లు సునాముఖి చూర్ణం 10 గ్రాములు ఆవు నెయ్యి కలిపి తినిన అన్ని రకాల వళ్ళు నొప్పులు మానును.

 రోజు రెండు పూటల అరకప్పు ఆవుపాలలో రెండున్నర గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి త్రాగిన రక్తశుద్ధి కలుగుతుంది.

సునాముఖి చూర్ణం రెండున్నర గ్రాము పరంగిచెక్క చూర్ణం రెండున్న గ్రాము కలిపి 40 రోజులు వరుసగా వాడుచున్న కండ్ల జబ్బులు హరించును.

రోజు రెండుసార్లు 5 గ్రాములు సునాముఖి చూర్ణం అరకప్పు వేడి నీళ్ళలో కలిపి త్రాగుతున్న చెవి,ముక్కు శిరస్సులోని అన్నిరకాల వ్యాధులు హరించును.

రోజు రెండు పూటలా సునాముఖి చూర్ణం రెండున్నర గ్రాములు తేనెతో కలిపి తినిన 9 నెలలో మంచిబలము వచ్చును

5  గ్రాములు పై చూర్ణం 20 గ్రాములు అల్లం కలిపి త్రాగిన టైఫాయిడ్ జ్వరం, అజీర్ణ జ్వరం తగ్గుతుంది.

రోజు రెండు పూటలా 5 గ్రాములు పై చూర్ణం 30 గ్రాముల దోసగింజల రసంతో కలిపి త్రాగిన మూత్రంలో రాళ్ళు వూడిపడును.

కరక రసాయనం:

 జనవరి ఫిబ్రవరి నెలల్లో కరక్కాయ చూర్ణాన్ని సొంటి చూర్ణముతో కలిపి ప్రొద్దున పండ్లు తోముకుంటూనే 1 టీస్పూన్ తినాలి. పురుషులకు మగతనం, బలము చేకూరుతుంది. వీర్యదోషాలు తొలగిపోతాయి. స్త్రీలకు ఆర్థవ దోషాలు తొలగి సుందరంగా వుంటారు.

మార్చి, ఏప్రిల్ నెలల్లో పిప్పలి చూర్ణం కలిపి తినాలి. బుద్ధి బలము పెరిగి శిరోరోగాలు, నేత్రరోగాలు మానును.

మే, జూన్ నెలల్లో పై చూర్ణాన్ని తేనెతో కలిపి తినాలి. స్త్రీ పురుషులందరికి విపరీతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరచిన విషయాలు కూడా జ్ఞాపకానికి వస్తాయి.

జూలై, ఆగస్టు నెలల్లో బెల్లంతో కలిపి తినాలి. ఊపరితిత్తులు కడుపు ప్రేగులు శుభ్రపడి శరీరంలో గల వ్యాధులన్నీ నిర్మూలించును.

సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సైందవలవణం కలిపి తినాలి. కండ్ల జబ్బులు పూర్తిగా నివారించును. కండ్లకు మంచి తేజస్సు కలుగుతుంది. శారీరకమైన శక్తి కలుగుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరగుతుంది.

నవంబరు డిశంబరు నెలల్లో కలకండ పొడి కలిపి తినాలి. తలలోని వెంట్రుకలు తెల్లవి నల్లబడతాయి. శరీరంలోని సమస్త భాగాలు శుద్ధి చెంది అన్ని రోగాలు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం అందం తేజస్సు కలుగుతుంది.

ఈ విధంగా కరక్కాయ ద్వారా ఒక సంవత్సర కాలంలో మనం సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చును.

 ముఖ్య గమనిక :- స్త్రీలు బహిష్టు అయిన సమయంలో కరక చూర్ణం వాడరాదు. విరేచనాలు అయ్యేటప్పుడు, సన్నగా బలహీనంగా ఉండేటప్పుడు కూడా ఈ చూర్ణం స్త్రీలు పురుషులు వాడరాదు.

నిమ్మ పండుతో చిట్కాలు:

ఉబ్బసం దగ్గులకు ఒక కప్పు టీలో 1 నిమ్మపండు రసం కలుపుకొని ప్రతి నిత్యం త్రాగుచుండిన ఉబ్బసం వ్యాధి శాంతించును.

దగ్గులు హరించుటకు:

 1 నిమ్మపండు రసం 10 తులాలు నీళ్లు 1 తులం తేనె ఉప్పు అర తులం కలిపి కొంచెం వెచ్చజేసి పూటకు ఒక మోతాదుగా రెండు పూటల త్రాగిన అమితంగా బాధించుచుండిన దగ్గులు హరించును.

వాంతులు కట్టుటకు :

నిమ్మపండు రసం త్రాగుతూ యుండిన ఎడల ప్రయాణములో వళ్ళు తిరిగెడి వాంతులు, చిన్న పిల్లలు పాలు కక్కుట యివి నిశ్చయముగా బాగవును.

జిగట విరేచనాలకు:

 రోజుకు ఒక గ్లాసు నిమ్మపండు రసం త్రాగిన జిగట విరేచనాలు త్వరగా హరించును.

పైత్యపు దద్దులకు:

 కలకండ పానకములో నిమ్మపండ్ల రసం కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు త్రాగిన పైత్యపు దద్దులు హరించును.

నాలుకకు రుచి కలుగుటకు:

 నిమ్మపండు పై తొక్కును నాలుకపై రుద్దుచుండిన నాలుక శుభ్రమై నాలుకకు రుచి శక్తి కలుగును.

నిమ్మపండు తొక్కులను నిప్పులపై వేసి పొగ ఇంట్లో పెట్టిన ఇల్లు శుభ్రపడి వాతావరణము శుభ్రముగా ఉండును.

గుంటగలగర ( కాటుకాకు):

 పుష్యమి నక్షత్రము నాడు గుంటగలగర వేర్లను తెచ్చి ఎండించి చూర్ణం చేసి యీ చూర్ణమును ప్రతి దినము పూటకు 1/2 తులం బియ్యపు కడుగుతో రోజు రెండు పూటల తినుచుండిన ఎడల--

1 వ నెలలో సర్వరోగములు హరించును. 2 వ నెలలో ఒకసారి విన్నంతనే శాస్త్రములు చెప్పగలుగును.

 4  మాసాలలో కిన్నెర కంఠము కలుగును. 5  మాసాలలో కవీశ్వరుడగును. 6 మాసాలలో ఆశుకవిత్వము

చెప్ప గలుగును. 7 మాసాలలో వ్యాధులు ముసలితనం హరించును. 9  మాసాలలో అన్ని భూతములను చూడగలుగును. 10  మాసాలలో నూరు ఏండ్లు జీవించు ఆయువు గలుగును. 1  సంవత్సరం తినిన సర్వరోగ నివారణ అగును.

వేపచెట్టు యొక్క ఉపయోగములు:

 వేపచెట్టు యొక్క ఆకులు, పువ్వులు, పండ్లు,వేర్లు, పైతాట యీ వస్తువులు సమభాగాలు తీసుకొని చూర్ణించి

 ఆచూర్ణం చండ్ర చెక్క కషాయంతో 7 రోజులు నూరి ఎండించి ఉంచి తర్వాత చిత్రమూలం, వాయువిళంగాలు, చంగల్వకోష్టు, నల్లజీడిగింజలు, కరక వలుపు, ఉసిరక వలుపు, కామంచి గింజలు, పిప్పళ్లు, మిరియాలు, మానిపసుపు, లోహభస్మం, యీ వస్తువులు సమభాగాలు కలిపి చూర్ణించి వస్త్ర ఘాళితం చేసి యీ చూర్ణంలో గుంటగలగర ఆకు రసంతో 7 రోజులు నూరి ఎండించి పైన తయారైన వేపచెట్టు చూర్ణాలు సమభాగంగా కలిపి సీసాలో పోసి భద్రపరచి యీ చూర్ణం 1 తులం 5 తులాల పాలలో కలిపి రెండు పూటల త్రాగిన రెండు మూడు నెలలలో అష్టాదశ కుష్టువులు హరించిపోయి వీర్యవృద్ది కలుగును. పైత్య వ్యాధులు, సర్వ మేహవ్యాధులు , అపవృత్యువు హరించిపోయి 100 ఏండ్ల జీవించును. ఈ ఔషదం గొంతులోకి దిగగానే జీర్ణమగును. దీనికి పత్యము అవసరము లేదు.

వేపచెట్టు గాలి ఆరోగ్యమైనది. ఇది చలువ చేయును. శ్లేష్మములను పోగొట్టును. పైత్యమును కుష్టును, దురదను పోగొట్టును. దీని గంధం వంటికి పూసిన చల్లగా యుండును. క్రిములను చంపును వాంతులను కట్టును. హృదయతాపం పోగొట్టును.

వేప చిగుర్లను నమిలి తినిన అరుచి నోట దుర్వాసన పైత్యము, వికారము, తల తిరుగుట, వాంతి వచ్చినట్లుండుట, కడుపులోని నలిపురుగులను చంపి మేహము, జ్వరము పోగొట్టును.

వేప ఆకు కండ్లకు మేలు చేయును. వాతం చేయు గుణము కలది. వేపనూనె వేడి చేయును. కఫము నులిపురుగులు చర్మ వ్యాధులు, వాతం, పాండురోగములు, మూర్చలు, ఉబ్బసం హరించును. వేపనూనె వంటికి రాసి మర్దించిన చిడుము,దురద, తామర, దద్దుర్లుగా గల సమస్త చర్మ వ్యాధులను పోగొట్టును.

వ్రణములు మాన్పును. వ్రణములలో క్రిములను,దుర్వాసన, అతి చమట పోగొట్టును. దీనితో తల అంటుకొన్న చుండ్రు పేలు తల నెరయుటు వెంట్రుకలు రాలుట తగ్గును. వేపపండ్లు వ్రణములను పగులునట్లు చేయును. వాతము చేయును. గుల్మములు మొదలయినవి శమింపచేయును. కల్లువలె వచ్చు సురామేహం వేపకషాయం త్రాగిన తగ్గును. వేపాకు మెత్తగా నూరి తేనె కలిపి వ్రణములకు వేసి కట్టిన వ్రణములోని చెడ్డ గుణం తీసివేయును. విషహరమునకు వేపపండ్ల గుజ్జు వేడి నీళ్ళలో త్రాగిన తక్షణం విషం హరించును. పిల్లల జ్వరాలకు తేనె నెయ్యి కలిపి పొగ వేసిన జ్వరం రాదు. వేప ఆకు పసుపు పొడి కలిపి వంటికి రాసిన మసూచికం రాదు.

100 సంవత్సరముల నాటి వేపచెట్టు పగిలి కల్లువలె కారును. దానిని త్రాగిన సమస్త చర్మరోగాలు పోవును, రక్తశుద్ధి అగును. గింజల పప్పును దోరగా వేయించి తులమునకు పావుతులం రసకర్పూరం వేసి నూరి శిరి సెనగలంత మాత్రలు చేసి తినిన శూలలు మానును. వేపఆకు పువ్వు కాయ అన్ని కూడా ఉపయోగములైనవి.

ఎలక్ట్రిక్ జీవామృతము:

 అరటిపట్టలు ఎండువి కాల్చి బూడిద చేసి ఉత్తరేణి చెట్టు సమూలం ఎండినవి కాల్చి బూడిద చేసి యీ రెండు సమానభాగాలు కాల్చి ఒక కుండకు పోసి రెండు పేర్ల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి బాగా వుడికించి చల్లార్చిన తర్వాత బాగా పిసికి అది తేరిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోసి భద్రపరచి మంచినూనె కొంచెం ఒక గ్లాసులో వేసి పై ఔషదం అరతులం వేసి కలిపిన పాలు అగును. ఆ పాలను తకు అంటుకొని స్నానం చేయ ఉష్ణము వలన కండ్లు మంటలు, నీరుకారుట,అరచేతులు, అరికాళ్ళుకు మర్దించిన మంటలు మానును. తలనొప్పికి ఈ ఔషదం తలకు రుద్దిన అయిదు నిమిషాలకు తలనొప్పి హరించును.కడుపులోనికి తీసికొనే క్రమం:-   అరతులం నూగులనూనెలో అర్ధఔన్సు మంచినీళ్ళు పోసి 6 చుక్కలు పై ఔషధం వేసి కలిపిన పాలు అగును. ఆ పాల యందు చెక్కర కలిపి రోజు 2 పూటల త్రాగిన మేహం, ఉష్ణం, తెలుపు, నీరుచురకు, మూత్రద్వారం మంట, నోటియందు పుండ్లు,నోటికంపు, పెదవులు ఎండుట, కడుపునొప్పి, బలము తగ్గుట, అన్నహితవు లేకుండుట, అజీర్ణము, కడుపు ఉబ్బరం, ఇంద్రియనష్టం, మూత్రం వెంట సుద్దపడుట రెండు నిమిషాలకే యింద్రియం పోవుట, ఇవి పోయి యింద్రియం గట్టి పరచి ముఖమునకు కాంతి నిచ్చును. ఉష్ణ పైత్యము వలన కడుపులో మంట, గుండెలో మంట, ప్రక్కశూల, రొమ్ముశూల, బొడ్డుశూల, పొత్తికడుపునొప్పి, కాళ్ళు నొప్పులు, నడుంనొప్పులు, దగ్గులు, మొదలైనన వ్యాధులు తీరును. ఈ ఔషదము వలన పోయిన శరీర బలం తిరిగి వచ్చును. మీరు ఈ ఔషదమును వాడి దీని గుణము చూచి అనేక పర్యాయములు చేసి పొగడుచుందురు. ఉదరములకు, ఔన్సు నీళ్ళు 20 చుక్కలు పై ఔషదం కలిపి రోజు రెండు పూటల తాగేది.

రేచీకటికి :

తాజా ఆవు పేడను గుడ్డలో వేసి పిండిన రసం త్రాగిన పది రోజులలో మానును.

 వాపులకు :

 గోవు మూత్రం 40 రోజులు త్రాగిన బాగవును.

గుర్రపులద్దె ఉపయోగం : సుఖప్రసవమునకు:

 ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీ యోనికి దూపం వేసిన వెంటనే సుఖంగా ప్రసవించును.

తల వెంట్రుకలు కాల్చిన మసి పన్నీరులో తడిపి ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీ తలపై మర్దన చేసిన స్త్రీ సుఖముగా ప్రసవించును.

తులసిచెట్టు :

 తులసీదళములను జలబు చేసిన వారికి 30-40 రోజులు తినిన దగ్గు, పడిశం, జ్వరం రాకుండా పోవును. కుంకుడు కాయలోని పప్పు :

 నీళ్ళలో నూరి త్రాగిన నీళ్ళ విరేచనాలు కలరా విరేచనాలు సర్వ విరేచనాలు హరించును.

మజ్జిగ ఉపయోగం :

అన్నం తినిన తర్వాత మజ్జిగ త్రాగిన వీర్యవృద్ధి కలుగును. చిన్న పిల్లలు తిన్న అన్నం తిన్నట్లే విరేచనాలు అగుతూ వున్న రోజుకు రెండు మూడు సార్లు మజ్జిగ త్రాగిన మానును.

నూగులనూనె :

కాళ్ళు చేతులు మంటలకు నూనె మర్దన చేయుట వల్ల మంటలు తగ్గును.

 శనగలు :

 5  తులాలు శనగలు సాయంత్రం నీళ్ళలో నానవేసి ఉదయం వడగట్టి ఆ నీళ్ళలో కొంచెం పంచదార కలిపి త్రాగిన 40 దినములలో ఉన్మాదము హరించును.

 కొర్రలు :

 విషపదార్ధము మింగిన వారికి శరీరంలో ఉన్న విషము హరించుటకు 40 రోజుల పాటు కొర్ర అన్నం తింటూ వున్న విషము విరిగిపోవును.

మధుమేహం గల వారలు ఈ ప్రకారం చేసిన తగ్గిపోవును.

అల్లం :

 వాతవ్యాధి వలన గాని, మూర్చ వ్యాధి వలన గాని తెలిపి తప్పి పడిపోయి  నోరు బిగసకపోయిన ఈ రసము మూడు చుక్కలు ముక్కు రంద్రములో వేసిన తెలిపి వచ్చి లేచి కూర్చుండును తర్వాత అల్లంరసం కొంచెం తాపిన ఆరోగ్యము కలుగును.

మెంతులు :

 కాలిన చోట మెంతులు నూరి పట్టించిన బొబ్బలు లేయకుండా బాధతగ్గి మానును. మెంతులు చూర్ణం తినిన మధుమేహం తగ్గును.

ధనియాలు :

 నలగకొట్టి కసాయం కాచి ప్రతిదినం త్రాగుతూ వున్న నోటగాని మూత్రమున గాని,ముడ్డిన గాని, ముక్కున కారే రక్తము కట్టును. అతి దాహం మానును.

వేపనూనె :

వేపనూనె పరిశుభ్రమైనది తాంబూలములో పది చుక్కలు వేసి నమిలి మింగిన ఉబ్బసం మానును.

 రాగిచెట్టు :

 బెరడు చూర్ణం గాయములపైన వేసి కట్టిన త్వరగా మానును.

మునగచెట్టు :

 మునగచెట్టు వేరు రసం 2, 3 చుక్కలు ముక్కులలో వేసిన మూర్చలు మానును.

 నిమ్మచెట్టు :

 నిమ్మచెట్టు బెరడు పొగ వేయ ఆ ఇంటిలో కలరా సోకదు.

 అవిశచెట్టు :

పూలుగాని, కాయలు గాని, కూర వండి తింటూ వున్న రేచీకటి 3 వారములలో బాగవును.

కానుగచెట్టు :

 కానుగపప్పు, మిరియాలు సమభాగాలు నూరి బేడ ఎత్తు మాత్రలు చేసి తినిన మలేరియా జ్వరం రాదు. మేడిచెట్టు :

 మేడిపండ్లను ఎండించి చూర్ణం చేసి ప్రతిదినం తింటూ వున్న స్త్రీల బట్టంటు వ్యాధులు మానును.

కుసుమచెట్టు :

 పూలు ఎండించి చూర్ణం చేసి పూటకు పావు తులము వంతున 3 వారములు తినిన కామెర్లు మానును.

పిచ్చి కుసుమ :

 ఈ చెట్టు ఆకులు 3, మిరియాలు 5 కలిపి నూరి నీళ్ళు వేసి వడగట్టి ప్రతి రోజు ప్రాత:కాలమున త్రాగుచుండిన మూత్రంలో షుగర్ పోయే మధుమేహం మానును.

జిలకర:

 ఒక గుప్పెడు జిలకరను ప్రతి నిత్యం నమిలి తింటూ వున్న స్త్రీల బట్టంటు వ్యాధులు, తెల్లబట్ట,యోనిశూల,దురదగా గలవి కొన్ని రోజులలో హరించిపోవును.

 పసుపు :

పావు తులం పసుపు నిత్యం తేనెతో తింటూ వున్న కొలది రోజులలోనే మేహవ్యాధి, రక్తదోషాలు హరించును. ఇంగువ :

 గోరువెచ్చని నీటిలో బటాని గింజంత ఇంగువ మింగిన కడుపునొప్పి, నీళ్ళ విరేచనాలు, వాంతులు మానును.

వామ్ము:

 వామ్మును ఆవనూనెలో వండిన తైలము వడగట్టుకొని శరీరమునకు మర్ధించుచుండిన ఎడల వల్లు నొప్పులు, దురదలు, వల్లు చల్లబడుట తగ్గి ఆరోగ్యము కలుగును.

 బెల్లం :

అన్నం ఎక్కువగా తినుట వలన అతిదాహం కలిగిన బెల్లం పానకం త్రాగిన తగ్గిపోవును.

ప్రసవించిన స్త్రీలకు ఈనిన ఆవులకు బెల్లం ముక్కను ప్రతి రోజు పెట్టుచున్న తొందరగా శరీర పుష్టి కలుగును. బెండకాయ :

 బెండకాయలను తినిన బెండవేరు పై పట్ట బెరడు చూర్ణం పావుతులం చొప్పున మంచినీళ్ళ అనుపానతో ప్రతిరోజు ఉదయం తింటూ వున్న స్త్రీల బట్టంటు వ్యాధులు, పురుషుల ఇంద్రియ నష్టం హరించును.

 ఆముదం :

 పసిపిల్లలకు విరేచనములు కాక కడుపునొప్పి కలిగిన కడుపుపై ఆముదం రాసి కాపడం పెట్టిన వెంటనే బాధమాని విరేచనం అగును.

సున్నం :

 సున్నం తేటను పావుతులం నుండి అరతులం వరకు చిన్నపిల్లలకు తాపిన ఆకుపచ్చ రంగు విరేచనాలు,కడుపులో బల్లలు హరించును.

తమలపాకులు :

 మానని వ్రణముల మీద వేసి కట్టిన మానును.

స్త్రీల స్తనములపైన వేసి కట్టిన పాలు తగ్గును.

 పోక చెక్కలు :

పోకలు కాల్చిన భస్మం గోకిన తామరపై పట్టించిన కొద్ది రోజులలో తామర మానును.

 యినుప ముక్క :

ఏమి చేసినా అతిదాహం కట్టని ఎడల యర్రగా కాంచిన ఇనుప ముక్కను మంచినీళ్ళలో ముంచి వడగట్టి త్రాగిన వెంటనే అతిదాహం మానును.

 మంచి గంధం :

 సానపై అరగదీసిన మంచి గంధం శిరస్సు పైన పట్టు వేయ తలనొప్పి తగ్గిపోవును.

తులసి :

 7 తులసి ఆకులు,  7  మిరియాలు నూరి మింగిన మూడు రోజులలో మలేరియా జ్వరం రాదు.

 చింతకాయ :

పండిన చింతకాయలను నీళ్ళలో పిసికి అందులో పంచదార కలిపి త్రాగిన ఎండవడ తగిలిన వారికి ప్రాణమును నిలబెట్టును. ఎండా కాలం చింతకాయల రసంఆరోగ్యం చెడ కుండా ఉంచును.

నరముల బలానికి :

సాంబ్రాణి తైలం తీసి మర్దించిన నరముల రోగములన్నియు నయమగును.

కసివింద చెట్టు రసంలో వెన్న కలిపి మర్దన చేసిన నరములకు బలము కలుగును.

స్తనముల వాపులకు :

ఉమ్మెత్త వేరు, పసుపు సమభాగాలు నూరి ఉడికించి స్తనములపై లేపనం చేసిన బాధ నయమగును. గొడ్డుకాకరదుంపను నూరి స్తనములపై లేపనం చేసిన స్తన్య రోగములు నయమగును.

కలబంద వేరును పసుపు నూరి లేపనం చేసిన చను కుదురు మొదలయిన రోగాలు నయమగును.

జుట్టపువేరు నూరి ఆవువెన్నలో కలిపి స్తనములకు పూసిన వ్రణములు మానును.

వీర్యవృద్ధికి :

అల్లంలో సగం వుడికిన కోడిగుడ్డును కలిపి తినిన వీర్యవృద్ది కలుగును.

 ఉసిరికవరుగు చూర్ణం ఉసిరిక రసంతో నూరి వూరబెట్టి దానిలో చెక్కర నెయ్యి తేనె కలిపి తినిన పాలు త్రాగిన వీర్య వృద్ధి కలగును.

 మినపప్పు నేతిలో వేయించి చూర్ణించి ఆవుపాలలో వేసి చెక్కర కలిపి పాయసం వండి తినిన వీర్యదోషములు తొలగిపోయి వీర్యవృద్ధి కలుగును.

 బూరగవేర్ల చూర్ణం గుంటగలగర వేర్ల చూర్ణం కలిపి కలకండ ఫలము కలిపి తినిన అధిక వీర్యవృద్ధి కలుగును.. గుంటగలగర ఆకు చూర్ణం 1 నెల తిని పాలు త్రాగుచున్న అమితమైన వీర్య వృద్ధి కలుగును.

రుతుసంబంధ దోషములకు ముట్టుకుట్టుకు :

 నూగులు, జీడి గింజలు, వెల్లుల్లి పాయలు, పాతబెల్లం, సైందవలవణం ఇవి సమభాగాలు చూర్ణించి వుంటలు

చేసి యిచ్చిన ముట్టుకుట్టు నొప్పి మానును.

శంఖద్రావకం మంచినీళ్ళలో కలిపి ఇచ్చిన ముట్టు శూల మానును. చర్మవ్యాధులకు

వాపులకు :

అతివస గంధం తీసి లేపనం చేసిన వాపు పోవును.

ఉల్లిపాయలను ఉడికించి లేపనం చేసిన సీతము యొక్క వాపు నయమగును.

నీళ్ళలోని నాచును వాపుగల చోట రాసిన వాపు తగ్గును.

వంగభస్మం వెల్లుల్లితో కూడా కలిపి యిచ్చిన వాత వ్యాధులు నయమగును.

చర్మవ్యాధులకు:

గురిగింజల ఆకు రసం, గుంటగలగర ఆకు రసం, నూగులనూనె కలిపి తైలపక్వంగా వండి పైన లేపనం చేసిన దారుణ చర్మవ్యాధులు, దురదకుష్టులు, కపాలకుష్టులు నయమగును.

 కానుగ వేరు, చిత్రమూలం,ఆవుపంచితంతో నూరి పట్టించిన చర్మం దళసరిగా ఉండుట తగ్గును.

గసగసాలు పాలతో నూరి పూసిన దారుణమైన చర్మరోగాలు మానును.

తామరాకు మోదుగకాడలు నిమ్మపండ్ల రసంతో నూరి లేపనం చేసిన చాలా కాలం నుంచియున్న తామర 3 రోజులలో నయమగును.

 చిడుము గజ్జికి :

 పటిక వెలిగారం నీళ్ళలో కలిపి కడిగిన చీము రసి కారుచున్న చిడుము గట్టి కురుపులు వారం రోజులలో మానును.

 వ్రణములకు:

ఉమ్మెత్తచెట్టు వేరును గాని ఆకును గాని మంచి నీళ్ళతో ఉడికించి గోరువెచ్చనిది పైన వేసి కట్టిన వ్రణములు మానును.

పాతబెల్లం వెలిగారం చూర్ణం చేసి దంచి కలిపి వ్రణముల మీద చల్లిన వ్రణములు మానును.

గవ్వపల్కు సాంబ్రాణి,హారతికర్పూరం సమభాగాలు నూరి వ్రణములకు పట్టి వేసిన వ్రణము మానును.

దెబ్బలు , గాయములకు :

ఉమ్మెత్త ఆకు పసరులో నూనె కలిపి కాచి పూసిన తలమీది కురుపులు మానును.

వెలిగారం చూర్ణించి బాలింతబోలు నూరి పట్టించినచో ఘోరమైన దెబ్బలు గాయములు మానును.

 చెముడుచక్క మిరియాలు నూరి నూనెలో ఉడికించి గాయములకు వేసి కట్టిన నయమగును.

పటికను పాలతో నూరి త్రాగించిన కొట్టిన దెబ్బలు నయమగును.

 జిల్లేడిపాలు ఉప్పుతో కలిపి పైన పూసిన స్వల్పగాయాలు, ఇరుకు నొప్పులు నయమగును.

గవదబిళ్ళలవాపు:

ఉమ్మెత్త ఆకు పసరు వ్రాసినను, జాజికాయ నీళ్ళలో అరగదీసి రాసినను గవదబిల్లలు వాపు నయమగును.

కాళ్ళ పగుల్లకు:

గుగ్గిలం ఆవునేతితో ఉడికించినను లేక నూరియైనను వేసిన కాళ్ళ పగుల్లు మానును

మెడిమశూలకు:

జిల్లేడిపూలు నూరి కట్టిన మెడిమశూల మానును.

ఈశ్వరివేరు కషాయం త్రాగిన కీళ్ళవాపులు తగ్గును.

శ్వేతకుష్టుకు:

మినుములు నూరి రాసిన శ్వేతకుష్టు హరించును.

దిరసనపు గింజల నూనె రాసిన తెల్లమచ్చలు మానును.

 నేత్ర రోగాలకు :

ఇనుప పాత్రలో నిమ్మపండ్ల రసం పోసి కొంచెం గట్టి పడు వరకు ఇనుముతో మర్దించి నేత్రముల చుట్టు లేపనం చేసిన నేత్ర రోగములు నశించును.

మూల వ్యాధులకు :

నిత్యము భోజనానంతరం కర్షమెత్తు కరక్కాయ చూర్ణాన్ని పుల్లటి మజ్జిగతో త్రాగిన ఆర్షస్సులు వూడి పడును.

సొంటి, కరక్కాయ, పిప్పళ్లు, దానిమ్మ కాయ బెరడు వేసియైనను లేక శరీరమునకు అనుకూలమైనచో బెల్లం వేసి మెత్త నూరి తినినను మూలవ్యాధి, మలబద్దకములను హరించును.

సెగరోగాలు : 

1. ఎండిన జల్లేడిపూలు చూర్ణం గురిగింజ ఎత్తు పంచదారలో యిచ్చిన శగరోగాలు తగ్గును.

 2. మర్రివూడలు దంచి తీసిన రసం 4 డబ్బుల ఎత్తు త్రాగిన బాధపెట్టు శగరోగాలు నయమగును.

 తేలు, పాము పిచ్చికుక్క విషాలకు :

నల్లఉమ్మెత్త ఆకు రసం బెల్లం జిల్లేడిపాలు ఏకంగా కలిపి నూరి ఇచ్చిన పిచ్చికుక్క కరిచిన విషం నయమగును.

ఉమ్మెత్తకాయ చూర్ణం చేసి మేడిచెట్టు పట్ట చూర్ణం కలిపి నూరి బియ్యం కడిగిన నీళ్ళతో యిచ్చిన పిచ్చికుక్క విషం నయమగును.

విష వస్తువులు తినిన కక్కించుటకు :

 1. ఇంగువ లోపలికి ఇచ్చిన కక్కును. 

2. నిమ్మకాయ రసంలో పంచదార వేసి యిచ్చిన నాభి విషం హరించును.

 బోదకాళ్ళకు :

 1. శ్రీపదరోగం:  సైందవలవణం తమలపాకుల రసంతో నూరి కల్క చేసి వేడి నీళ్ళతో సేవించిన శ్రీపదరోగం (ఎనుకాలు రోగం) నయమగును. 

2. ఆముదంతో పక్వము చేసిన కరక్కాయ చూర్ణం గోమూత్రంతో త్రాగించిన వారం రోజులలో శ్రీపదరోగం నయమగును. 

ఎలుక విషానికి :

 పత్తిఆకు రసం 3 దినములు త్రాగిన విషం నయమగును.

మసూచికం రాకుండా చేయుటకు :

 1. చంటిపిల్లతల్లికి 4 తులములు కొబ్బరి తినిపించిన ఎడల చంటి పిల్లలకు మసూచికం రాదు. 

2. రుద్రాక్షపూస నూరి పిల్లలకు త్రాగించిన మసూచికం రాదు. 

మసూచికం మచ్చలకు మందు:

1.  దిరిసెనపుచెక్క రావిచెక్క నక్కెరు చెక్క మెత్తగా నూరి ఆవు నేతితో కలిపి మసూచికం పొక్కులపై రాసిన మానును.

2. తుంగగడ్డలు నీళ్ళలో మరగబెట్టి ఆ నీళ్లచే కడుగుచున్న మసూచికం పొక్కులు నయమగును.మరియు

3. వెల్లుల్లిపాయ గడ్డను గుమ్మమునకు వ్రేలాడకట్టిన ఆ యింటికి తుఫాన్ గాని, భూకంపము గాని, చీడలు, పీడలు ఆ యింటికి తగలవు.

దేహ రక్షణ తంత్రం:

 అమావాస్య ఆదివారం నాడు లింగదొండ విష్ణుకాంత, వెరుగార వేరు, గలిజేరు వేరు తెచ్చి దూప దీప నైవేద్యములు యిచ్చి తాయితలో బిగించి కట్టుకొన్న వారికి ఏ ప్రయోగాలు తగలవు ఆరోగ్యంగా యుండును. అరటిపండు :

 జ్ఞాపకశక్తిని మెదడు బలాన్ని పెంచుతుంది.

 కొబ్బరి నీరు : 

పార్శపు నొప్పికి మంచిది. కడుపులో పుండ్లకు : ప్రతిరోజు రెండు పూటల ఒక కప్పు పాలల్లో ఒక స్పూన్ నెయ్యి కలిపి త్రాగిన కడుపులోని పుండ్లు హరించును.

కీళ్ల నొప్పులకు తంత్రం:

 సూదంటు రాయిని ఎల్లప్పుడూ జేబులో పెట్టుకొని లేక ధరించిన యెడల కీళ్ళ నొప్పులు కుదురును. మరియు

సూదంటు రాయి మెత్తగా నూరి రెండు గురిగింజ ఎత్తు తేనెతో ప్రతినిత్యము తింటూ వున్న మగతనం ఎక్కువగును.

కోడిగుడ్డు ఇంటి తలవాకిలికి వేలాడగట్టిన ఆ యింటికి ఎలాంటి బాధలు కలుగవు.

గుర్తు తెలియని సందిగ్ధ విషములకు విరుగుళ్ళు:

 1. పాలు, కలకండ, నెయ్యి, తేనె, బర్రె పేడ రసం ఈ అయిదు కలిపి త్రాగించేది.

సర్వ పాషాణములకు:

2. పైడిపత్తి, ఆకుపూలు, పచ్చికాయలు దంచి రసం తీసి తా పేది.

3. నీలివేర్లు, మిరియాలు నీళ్ళు కషాయం కాంచి తాపేది.

4. కాకరాకు రసం, నేరేడు యిగుర్లు, వెలగపండు,మిరియాలు, తమలపాకు, తీగ కషాయం కాంచి తాగేది.

సవ్వీర దుర్గుణాలకు:

 5. టెంకాయ నీళ్ళు కాచి పొంగించి నిమ్మరసం వేచి తా పేది.

6. మేక మూత్రం తాపేది.

ఇంగ్లీక దుర్గుణానికి:

7. మిరియాల చూర్ణం నెయ్యితో 7 దినాలు తినేది.

వసనాభికి:

 8. చిర్రివేర్ల రసం, లేక నేరేడు యిగుర్లు నూరి తినేది.

పెట్టుడు మందుకు విరుగుడు:

 9. గచ్చాకు పసరులో శనిగలు నానబెట్టి 3 దినాలు తర్వాత 10 రోజులు తినేది ప్రేమ వదలును. -

రస పట్లకు : 

10. పైడిపత్తి ఆకు రసం పావు సేరు 1 తులం చోరుప్పు కలిపి ఒక పూట త్రాగిన కీళ్ళలో పట్టు వదలును. శుద్ది గంధకం తేనేతో నూరి నోటికి పూసేది.

రసం తలకెక్కినందుకు:

 ఏలకలు, లవంగాలు, వేయించి చూర్ణం చేసి చక్కర కలిపి బూడిద గుమ్మడికాయ రసంతో 3 రోజులు త్రాగిన బాగవును.

సున్నానికి యిరుపు:

 పసపు, కొబ్బరినూనె, తిప్పతీగరసం మైనం నెయ్యి అయినా చల్లనీళ్ళయినా సున్నం మంట తగ్గించును.

పెట్టుమందుకు:

 కన్యాకుమారిఆకున్నూ రెండు మిర్యాలు నమిలి మింగేది.

సారాయి, బ్రాందీ మత్తుకు:

 తేనే, నిమ్మకాయ రసం నీళ్ళు కలిపి తాపిన, వసకషాయం కాచి కొంచెం తాపిన భ్రాంతి మత్తు వదులును.

బలానికి:

 జాజి ఆకులు నెయ్యి ఈ రెండు కలిపి తినినవాడు భీమునివలె బలము గలిగి ఎక్కువ ఆహారం భుజింపగలడు.

బాహుబల రసాయనం:

 నల్లతుమ్మచెట్టుపట్ట చూర్ణించి అరతులం తేనేతో కలిపి రెండు తులాలు రోజు 3 పూటల తినిన వజ్ర శరీరమగును.

సర్వవ్యాధి సంహారణ:

 ఈశ్వరివేర్లచూర్ణం పూటకు అణా ఎత్తు తింటూ యున్న అన్ని విషములు సమస్త రోగాలు మానును.

చిన్నబిడ్డలు నిద్రపోకుండా పోరు పెట్టి ఏడ్చుచుండిన:

 ఆ బిడ్డతల్లి తలవెంట్రుకను తీసి బిడ్డ పండుకొనే పక్కబట్టలో వేసిన యెడల బిడ్డ ఏడ్పు మాని సుఖముగా నిద్రించును.

మధుమేహం హరించుటకు మంత్రం:

 1. నేను ఆరోగ్య మైన ఆత్మను - ఓం - ఓం ఓం

 2. నేను అనామయ ఆత్మను - ఓం - ఓం ఓం

 3. ఆరోగ్యమే నేను - ఓం - ఓం ఓం

 4. యేవ్యాధి నన్ను బాధింపజాలదు - ఓం - ఓం - ఓం

 

యీప్రకారం ధ్యానించుచుండిన మధుమేహం వ్యాధి హరించిపోవును. కంబళ్ళు , శాలువలు, దూదికూరిన గుడ్డలు బొంతలు, జమకానాలు వంటివి తరచుగా వాడేవికావు. కనుక మడచి పెట్టడం వల్ల గాలి పారక కంపు కొడతాయి. అలాంటి దుర్గందాన్ని తొలగించి సుగంధం కలిగించడానికి యీ యోగం చెప్పడమైనది.

లక్క కుందుష్కం, సజ్జరసం, నఖంచిప్పలు, అగరు, సిల్లకం, తేనె తెల్లచెక్కర గ్రహించి మెత్తగా పొడిగొట్టి వీనికి సమం జటామాంసి చూర్ణం కలిపి దూప ద్రవ్యంగా చేసుకొని పైన చెప్పిన గుడ్డలు బొంతలు కంబళ్ళుగా గల వాటికి దూపం వేసిన సుగంధంతో మన్నికకు వస్తాయి.

స్నాన చూర్ణం:

  కురువేరు, జటామాంసి, దాల్చిన చెక్క చంగల్వకోష్టు, నఖం చిప్పలు,దండముర స్పృక్కమురలు ఇవి సమభాగాలు చూర్ణించి అన్ని రుతువులందు వంటికి పూసుకొని స్నానం చేసిన మనోహరముగా ఉంటుంది.

అమృతధార:

 ఒక భాగం వామ్ముపువ్వు, ఒక భాగం మెంతాల్, 2 భాగాలు ఉంట కర్పూరం యీ మూడూ ఒక సీసాలో వేసిన ద్రవముగా మారిపోవును. ఇదే అమృతధార. అమృతధార రొమ్ము పైన, ముక్కుదూలం పైనా రాసిన జలుబు పడిశం తగ్గును. 2  చుక్కలు చెక్కరతో వేసి తినిన బాగా ఆకలి కలుగును. బొడ్డు చుట్టూ రుద్దిన కడుపుబ్బరం తగ్గును. పైన రుద్దుట వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గును. పచ్చి గాయములకు దూదిపై అమృతధార వేసి అద్దిన తొందరగా పక్కు కట్టి మానిపోవును.

అతి సులభమైన ఆరోగ్య సూత్రములు:

1. జీవితమును మహా పవిత్రమైనదని గ్రహించి పావన జీవనము జీవితమును మన చేయుము.2. పంచభూత సమ్మళితమగుట నీదేహము అనారోగ్య వంతమైన మరల నీ భూత సంచితము వలననే ఆరోగ్యవంతమగునని నమ్ముము.

3. క్రొత్త పనిముట్టును శ్రద్ధతో జాగ్రత్తగా ఉపయోగించిన అది యెట్లు చాలా కాలము ఉపయోగపడునో అట్లే నీ దేహముపై ఎక్కువ లక్ష్యముంచి కాపాడిన బహుదినములు దనక ఆరోగ్యమై దృఢముగా నుండును.

4. ఎప్పుడును ఔషదములనే ఉపయోగించువాడు రోగపీడితుడై యుండును.

 5. ఆహార పానీయ విహారముల యందలి లోభముల వల్లనే రోగోత్తమగును. 

6. సూర్యతాప సేవల వలన శివశక్తి వృద్ధి యగును.

7. సూర్యకాంతివలన దేహ అంతరభాగములు సజీవములై మాలిన్యములు వెడలిపోయి దేహమునందు అనవసర కామాది ఉద్రేకములు దుష్ట సంకల్పములు నశించి సహజమగు శాంతి సిద్దించును.

8. ఆరోగ్యవంతమైనది కావున ఉదయవేళ భానుని సహస్ర కిరణముల యందలి లేత గులాబిరంగులు ఆస్వాదించుట మంచిది.

9. నిత్యము ఒక గంట సూర్యకిరణముల సేవల వలన సర్వరోగములు నాశనమగుటలో సందేహము లేదు.

10. సూర్యరశ్మిలో చేసిన వ్యాయామము ఎక్కవ బలవర్ధకమైనది.

11. సూర్యతాపసేవన వలనమానసిక శక్తి పెంపొందును.

 12. సూర్యకాంతి సేవన వలన హృదయభారము తగ్గి రక్తాభిసరణము తేలికగును. సరళముగ వుండును కాన ఆయుష్యాభివృద్ధి గలుగును.

13. సూర్య ప్రకాశము స్వాస్థ్యమును వృద్ది గావించును గాన నిత్యం సూర్యరశ్మియందు నడకయో తోటపనియో వ్యాయామమో చేయుచుండవలెను.

14. దేహము భరించలేనంత తీవ్రమైన ఎండలో తిరుగాడరాదు. 

15. ఏ గృహము లోనికి సూర్య ప్రకాశము చొరబడదో అట్టిది నివాస యోగ్యము కాదు.

16. శరీరారోగ్య సంరక్షణకు పరిశుద్ధమగు వాయువును సదా సేవించు చుండవలెను

17.వ్యాయామము చేయుట వలన ఉత్తమ ఆరోగ్యము శీతోష్ణాధిష్ణుత సర్వాంగముల ధృడత, జటరాగ్నిదీప్తి కలుగును.

18. సకల వ్యాయామములలో దేశీయ వ్యాయామము సర్వోత్తమైనది.

 19. వ్యాయామము వీర్యరక్షణకు సర్వోత్తమ సాధనము.

20. వ్యాయామము మంచి చిత్రకళ వంటిది అది హెచ్చుతగ్గులు సరిచేయును.

21. వ్యాయామము వలన శారీరక మానసిక దు: ఖములు దూరమగును.

 22. వ్యాయామము శరీరమునకు అమృతతుల్యము అందువలన దుర్బరేంద్రియము సహితము ఆరోగ్యవంతమగును.

 23. నిత్యము శరీరము నందలి ప్రతి భాగము బాగుగా కదలునట్లు అలయునట్లు పరిశ్రమ చేయవలయును.

24. ఒక సంవత్సరం నియమ పూర్వకముగా వ్యాయామము చేసినచో

శరీరము సుందరమైన బలము కలుగును.

25. ఇంద్రియ లోలత్వము అన్ని అనర్ధములకు మూలము మరియు బానిసత్వమునకు దారితీయును గాన జితేంద్రియుడగుటకు ప్రయత్నించుము.

 26. వీర్యనాశనమే మృత్యువు అనగా వీర్యమును అమితముగా నాశన

మొనర్చుకొన్నవాడు ఎన్ని ఉపాయములు చేసినను అకాలమృత్యువు

నుండి తప్పించుకొనలేడు.

27. శారీరక మానసిక బలములను వృద్ధి చేయు ప్రయోగములన్నింటిలోను

వీర్య రక్షణమే సర్వోత్తమము.

28. వీర్యము యొక్క ప్రతి కణమునందు జీవనశక్తి యిమిడి యున్నది. కాన బలారోగ్యము ప్రజ్ఞానము నార్జించు స్త్రీ పురుషులందరునూ

బ్రహ్మచర్య వ్రతమును సక్రమముగా పాటించవలెను.

 29. బ్రహ్మచర్య వ్రతమును బాగుగా పాటించిన గృహస్తుడు ఉత్తమ సంతానమును బడసి సుఖింపగలడు. కావున నియమిత సమయం వరకు స్త్రీ పురుషులు ఎల్లరు బ్రహ్మచర్య వ్రతమును విధిగా పాటించుచుండుట మంచిది

30. స్నానం వలన అంతర్భాహ్యములు శుద్ధియై ఆరోగ్య ప్రాప్తి కల్గును.

31. ప్రాత:కాలము నందు చన్నీటి స్నానం అమృత తుల్యం.

32. ప్రాత:స్నానము వలన దినమంతయూ మిక్కిలి ఆనందముగా యుండును.

33. సీతల జలము నందు శరీరమునకు పుష్టిని మనస్సుకు తుష్టిని నొసంగగల విద్యుచ్చక్తి అపారముగా ఉన్నది.

34. తలను తడపక చన్నీటి స్నానం ఎన్నడూ చేయరాదు.

35. నదీజలస్నానము మానవులయందు విద్భుశ్చక్తిని వృద్ది గావించి దీర్ఘాషుమంతునిగా నొనరించును.

36. ప్రవాహెదకమందు ఈదులాడుట వలన సకలావయవములుకు మంచి పరిశ్రమ కలుగును.

37. ఈదుట వలన స్వప్నదోషములు అనగా నిద్రలో వీర్యము స్థలనము అగుట నివారించును.

38. సముద్రోదకమందు ఒక విధమైన విద్యుశ్చక్తి యున్నది. గాన అప్పుడప్పుడు సముద్రస్నానం చేయుట మంచిది.

39. వాత దేహులగు స్తూలకాయులు దుర్భల దేహులు, రోగులును ఉష్ణోదక స్నాన మాచరించుట మంచిది.

40. నిత్యం ఉతికిన బట్టలనే ధరించుచుండవలెను.

41. దేహము భరించలేని చలిని వస్త్రములను ధరించి తగ్గించుకొనవలెను.

42. ధరించు దుస్తులు ఎక్కువగా నుండక సాధ్యమైనంత క్లుప్తంగా నుండవలె.

43. ఉతుకుటకు వీలుగాని వస్త్రములు ఉపయోగించరాదు. ఒక వేళ విధిలేక ఉపయోగించినచో ఎండలో ఎండించవలెను.

44. నూలు గుడ్డలు ఖద్దరు గుడ్డలు శ్రేష్టము.

 45. ఔషదమును, ఆపరేషన్లను ఇంజక్షన్లను గైకొనుట మానుము. అవి తరచుగా రోగముకంటే ముందు రోగిని చంపి వేయును.

46. యెట్టి ఘోరవ్యాధి యైనను ప్రకృతి వైద్యం నందు సులభంగా నివారించవచ్చును. కావున ప్రకృతి వైద్యం ఆచరించి సుఖించుము

47. దైవ ప్రార్థన లేనిదే మనశ్శాంతి కుదరదు మనశ్శాంతి లేనిదే దేహ ఆరోగ్యం బాగుండదు.

48. గాఢమగు దైవ ప్రార్థన వలన సమస్త శారీరక మానసిక వ్యా ధి నిర్మూలము కాగలవు.

49. దైవచింతన వలన జీవద్రవములు ఉత్పన్నమై దేహమునకు నూతన జీవితం కలిగించి ఆయువు పెంపొందించును.

50. ప్రాతఃకాలమున నిద్ర నుండి లేచిన వెంటనే మంచినీళ్ళు త్రాగుచుండెడి వారికిని రాత్రి పండుకొనేటప్పుడు వేయించిన కరక్కాయ పొడి మూడు వేళ్ళకు వచ్చినంత తినేవానికిని రాత్రి పూట భోజనములో పాలు కలిపి తినే వారికిని వ్యాధులు పీడింప పడకుండా యుండును. వీరి ఇంటికి వైద్యుడు రావలసి వుండదు.

51. రాత్రిపూట భోజనం చేయుట వలన బలము కలుగును. చేయని యెడల బలము తగ్గును. రాత్రి ఆకలి కాని యెడల పగటి భోజనములో మూడోవంతు తగ్గించి తినుచుండిన రాత్రిళ్ళు బాగాఆకలై ఆహార పదార్ధములు రుచికరముగా యుండును.

 52. పక్షము రోజుల కొకసారి క్షురకర్మ చేయించుకొనవలెను. రోజుకు అయిదుసార్లు పండ్లు తోమవలెను. నెలకు ఒక సారి నశ్యము 3 నెలల కొకసారి విరేచనము మందు తినవలెను. 3  రోజుల కొకసారి స్త్రీ సంగము చేయవలెను.

 యిట్లు ఈ నియమములు పాటించిన ఎడల వైద్యునితో పని యుండదు. మలబద్దకం లేకుండా యుండిన యెడల వ్యాధులు పుట్టజాలవు.

సమాప్తం

.

.

 

 

 

 

 

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

    స్త్రీ , శిశు వ్యాధులు హోమియో చికిత్స       డా || శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)   రచన పి.సుబ్బరాయుడు కెంట్ హ...